24.04.2016 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి
జయజయ సాయి
సాయి బంధువులకు
బాబావారి శుభాశీస్సులు
సాయిబానిస గారికి
బాబావారు ప్రసాదించిన ఆధ్యాత్మిక జీవిత సందేశాలు మరికొన్ని.
10.09.2005
51. పెద్దలు నీ ప్రేమను గౌరవరూపంలోను,
నీ సమ వయస్కులు అభిమానం రూపంలోను, నీ పిల్లలు ఆశీర్వచన రూపంలోను, భగవంతుడు భక్తి రూపంలోను కోరతారు.
17.09.2005
52. భగవంతుని దృష్టిలో అన్ని వర్ణాలవారు, అన్ని
వృత్తుల వారు సమానమే. పిల్లవాడి
అక్షరాభ్యాసాన్ని బ్రాహ్మణులు చేయిస్తే,
అదే బ్రాహ్మణ పిల్లవాడికి
ఉపనయనం రోజున పంచ శిఖలు పెట్టి
బ్రహ్మచర్యాన్నిపాటించమని
చెబుతాడు నాయీ బ్రాహ్మణుడు.
మరి ఆనాయీ బ్రాహ్మణుడిని అంటరానివాడిగా
భావించడంలో న్యాయముందా?
27.10.2005
53. గతం ఒక కల. వర్తమానం
ఒక నిజం. భవిష్యత్తు
ఒక ఊహ. అందుచేత
గతం గురించి ఆలోచించకు. భవిష్యత్తు
గురించి ఊహించకు. వర్తమానంలోనే
జీవించు.
01.11.2005
54. మానవుడు శాస్త్రప్రయోగాల పేరిట జంతువుల మధ్య
కొత్త ప్రయోగాలు (క్లోనింగ్) చేస్తూ కొత్త జంతువులను సృష్టించి,
సృష్టికి ప్రతిసృష్టి చేయుచున్నాడు. ఇది
మంచి పధ్ధతి కాదు. ఈ
ప్రయోగాలే మానవాళి వినాశనానికి నాంది పలుకుతుంది.
11.12.2005
55. మన పెద్దలు దుష్టులకు దూరంగా ఉండమన్నారు. అందుచేత మనము ఈ సమాజంలో
అప్రమత్తంగా జీవించాలి.
56. ఆత్మీయులు, రక్త సంబంధీకులు వీరు తమ స్వార్ధం
కోసం నిన్ను వాడుకుంటారు. నిజానికి
వారు నీ హితులు కారు. అటువంటివారి
గురించి ఆలోచించకుండా
భగవంతుడిని నమ్ముకుని నీ
జీవిత ప్రయాణాన్ని
కొనసాగించు.
57. నీవు వంట ఇంటిలో వండే వంటకాల రుచులు వేరు వేరయినా తిన్న తరువాత నీవు పొందే అనుభూతి మాత్రం ఒక్కటే. అప్పుడు నీవు అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటావు. అందుచేత రుచులకు పోకుండా నీ కిష్టమయిన ఏదో ఒక పదార్ధముతోనే తృప్తి చెంది అందులో పరబ్రహ్మను చూడు.
58. నీ రచనలను చదివి, ఉపన్యాసాలను విని అందరూ బాగున్నాయని పొగడటంలో తప్పులేదు. ఆ పొగడ్తలకు నీవు పొంగిపోయి అహంకారంతో జీవించిననాడు నిన్ను పొగిడినవారే నిన్ను అసహ్యించుకుంటారు. అందుచేత ఆ పొగడ్తలన్నీ సరస్వతీదేవి పాదాలపై ఉంచి నీవు ఆమె సేవకుడివిగా జీవించిననాడు, నీ రచనలు సమాజానికి ఉపయోగపడతాయి.
17.12.2005
59. నీ జీవిత రైలుప్రయాణంలో ప్రతి స్టేషను ఒక షిరిడీయే. అందుచేత నీవు వేరేగా షిరిడీకి రానవసరం లేదు.
26.01.2006
60. పదవి శాశ్వతం కాదు. ప్రజల
అభిమానం కూడా శాశ్వతం కాదు. ఇవన్నీ
తెలిసికూడా ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. అందుచేత
భగవన్నామ స్మరణ ఒక్కటే జీవన
గమ్యానికి శాశ్వతమయిన దారి చూపిస్తుంది.
(మరికొన్ని సందేశాలు తరువాతి సంచికలో)
(సర్వం శ్రీ
సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment