15.06.2016 బుధవారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీకాకుళంనుండి
సాయి బంధు శ్రీ సాయి సురేష్ గారు తమ అనుభవాలు పంపించారు. వాటినన్నిటినీ క్రమానుసారంగా
ప్రచురిస్తాను. బాబా తన భక్తులను ఏ విధంగా అనుగ్రహిస్తూ ఉంటారో
ఆయన అనుభవాల ద్వారా మనం గ్రహించుకోవచ్చు.
శ్రీ
సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
నా పేరు సాయి సురేష్, నేను శ్రీకాకుళంలో ఉంటాను. సాయి నాకు ఇచ్చిన అనుభవాలను సాయి బంధువులందరితో పంచుకొనే అవకాశం కల్పించినందుకు సాయి కి నా కృతజ్ఞతాభివందనములు.
భక్తుని
ఇంటికి వచ్చిన సాయి
2000 సంవత్సరం లో
నేను మొదట షిర్డీ వెళ్ళినప్పటినుంచి
నా మనస్సులో సాయి పెద్ద సైజు
విగ్రహం ఒకటి ఇంటిలో పూజించుకోవటానికి
ఉంటే బాగుంటుందని అనుకొనేవాడిని.
కానీ మా ఇంట్లో వాళ్ళు అంత విగ్రహం ఇంటిలో పెట్టుకోవడానికి ఒప్పుకుంటారో లేదో కూడా తెలియదు. అందుకే నా కోరిక నా మనస్సులోనే ఉంచుకున్నాను. 2011 సంవత్సరం డిసెంబర్ నెలలో నాకు తెలిసిన ఒకతను ఫోన్ చేసి “నాకు తెలిసిన వాళ్ళు బాబా 1.5 అడుగుల విగ్రహం ఇవ్వాలనుకుంటున్నారు. మీరు తీసుకుంటారా?” అని అడిగారు. నాకు చెప్పలేనంత సంతోషం కలిగింది. “బాబా వస్తానంటే నేనెందుకు వద్దంటాను” అన్నాను. ఆయన ఇంట్లో వాళ్ళని ఒకసారి అడిగి చెప్పండి అన్నారు. సరే అన్నాను. కానీ నాకు భయం వేసింది. వాళ్ళకి కొంచెం ఆచారాల పట్టింపు ఎక్కువే , ఏమంటారో అనుకున్నాను. కానీ బాబా చేసిన చమత్కరమేమో గాని నేను చెప్పగానే, మరో మాట అనకుండా సరే అన్నారు. తర్వాత ఫిబ్రవరి 20, 2012 శివరాత్రి రోజున బాబా విగ్రహం మాకు వచ్చింది.
ప్రతి గురువారం బాబాకి అభిషేకము చేసుకుంటాం. ఆవిధంగా బాబా ఇంటికే వచ్చి ఆయనను సేవించుకొనే భాగ్యం మాకు అనుగ్రహించారు. సాయి మందిరంలో సేవకు దూరం అయిన కొన్ని రోజలకి సాయి మా ఇంటికే వచ్చేసారు. అందుకు సద్గురు మూర్తికి నా కృతజ్ఞతాభివందనములు.

పాదుకలు మరియు సాయి డ్రెస్సెస్
• బాబా విగ్రహం వచ్చిన
కొన్ని రోజులకు నాకు పాదుకలు కూడా
ఉంటే బాగుండుననిపించింది. మొట్టమొదట
1912, శ్రావణ పౌర్ణమి నాడు షిర్డీ లో
వేప చెట్టు కింద సాయి
పాదుకలు ప్రతిష్టించారు. 2012, శ్రావణ పౌర్ణమి నాటికి సాయి పాదుకలు ప్రతిష్టించి
వందేళ్ళు. ఆ సందర్బంగా శ్రీకాకుళం
బాబా మందిరం వారు పాదుకలు కావలిసిన
వారు పేరు నమోదు చేసుకుంటే,
పాదుకలను షిర్డీ సమాధి మందిరం లో
పూజ చేసి, శ్రీకాకుళం బాబా
మందిరంలో వారం రోజుల పాటు
పూజలు చేసి, చివరి రోజున
వాటిని పల్లకి ఉత్సవము జరిపి అందజేస్తామని, ఆ
మందిరం వారు ప్రకటించారు. ఆ
విషయం సాయి మాకు తెలిసేలా
చేసారు. మేము వెంటనే పేరు
నమోదు చేసుకున్నాము. కొనుక్కోవాలంటే పాదుకలు దొరుకుతాయి కానీ ఎంతో
అదృష్టం ఉంటె గాని వందేళ్ళ
సందర్బంగా, అంతటి విశిష్టంగా పూజింపబడిన
పాదుకలు దొరికే అవకాశం రాదు. ఆవిధంగా పాదుకలు
కావాలని నేను అనుకోవడం బాబా
మమ్మల్ని అనుగ్రహించడం జరిగింది. అదంతా
బాబా దయ.
• బాబాకి ప్రతి పండగకి క్రొత్త డ్రెస్ తీయాలనిపించేది. కానీ మా ఇంట్లో వాళ్ళు అన్ని డ్రెస్సెస్ తీసి ఏమి చేస్తాము అనేవారు. ఎలా బాబా అనుకున్నాను. ఒకసారి నేను ఎప్పుడూ డ్రెస్సెస్ తీసే షాప్ కి వెళ్ళాను. కానీ అక్కడ ఇదివరకు తీసిన రంగులే ఉన్నాయి. దగ్గర ఏదైనా షాప్ ఉందా అని ఆ షాప్ వారిని అడిగితే, పక్కనే సాయి మేచింగ్స్ ఉందని చెప్పారు. అక్కడకి వెళ్లి నేను రెండు క్లోత్స్ ఎంచుకొని కట్ చేయమంటే, యింత తక్కువ క్లోత్ దేనికి అని అడిగారు. నేను బాబా కోసం అని చెపితే ఆయన ఆ రెండు క్లోత్స్ తో పాటు వేరొక డ్రెస్ కూడా బాబా కోసం ఇచ్చి. ఇకపైన ఎప్పుడైనా బాబా డ్రెస్ కావాలంటే కొనవద్దని, తనని అడిగితే ఇస్తానని ఆ షాప్ యజమాని చెప్పారు. ఆయన కూడా మంచి సాయి భక్తుడు. అలా సాయి బంధువు తో పరిచయము చేసి డ్రెస్సెస్ సమస్య తీర్చేసారు.
ఆపదలో
ఆదుకున్న సాయి
• 2014,
సెప్టెంబర్ లో మా ఫాదర్
ఆరోగ్యం బాగాలేక వైజాగ్ కేర్ హాస్పిటల్ కి
తిసుకువెళ్ళవలసి వచ్చింది. అప్పటివరకు మాకు హాస్పిటల్ అవసరం
ఎప్పుడు రాలేదు. అందువల్ల ఎలా అని కంగారు
పడ్డాము. తెలిసిన వాళ్ళను తోడుగా రమ్మంటే వాళ్ళకి కుదరలేదు. కానీ తప్పదు కాబట్టి
బాబాని తలుచుకొని నేను మా తమ్ముడు
విపరీతమైన వర్షంలో, అంబులెన్సు లో డాడీ ని
తీసుకోని బయలుదేరాము.
నేనున్నాను తోడుగా అన్నట్లు బాబా నాకు దారిపొడుగునా కనిపిస్తున్నారు. నాకు కొంచెం దైర్యం కలిగింది బాబా ఉన్నారని. హాస్పిటల్ చేరుకున్నాక, సమయానికి మా సిస్టర్ కూడా వచ్చింది. డాక్టర్స్ కొన్ని టెస్ట్స్ చేసి హార్ట్ లో సమస్య అని హాస్పిటల్ లో అడ్మిట్ చేసుకున్నారు. నాల్గవ రోజు ఆన్జియోగ్రాము టెస్ట్ చేసి హార్ట్ లో మూడు బ్లాక్స్ ఉన్నాయి బైపాస్ సర్జరీ చేయాలని చెప్పారు. అదే రోజు డాడీ కి టెస్ట్ చేసిన సమయానికి మరో ఆమెకి టెస్ట్ జరిగింది. ఆమె కి ఇద్దరు అమ్మాయిలు, వారిద్దరూ ఆ హాస్పిటల్ లో స్టాఫ్. అప్పటివరకు ఎటువంటి పరిచయమే లేని మాకు వారితో ఆ సమయంలో పరిచయం ఏర్పడింది. కాదు బాబానే ఎవరి సహాయం లేక ఇబ్బంది పడుతున్న మాకు, మా సహాయార్ధం వారితో పరిచయం కలిగించారు. ఆయన అదృశ్యంగా ఉంటూ తన భక్తుల కష్టాలందు ఏదో రూపంలో సహాయం చేస్తూనే ఉంటారు. మనమే గుర్తించలేము. అప్పటినుంచి వారిద్దరూ ఏ సమయంలో ఏ సహాయం అడిగిన విసుగు కోకుండా సహాయం చేసేవారు. డబ్బు కోసం సహాయం చాలామంది చేస్తారు. కానీ ఏది ఆశించకుండా అత్మీయముగా సహాయం చేసేవారు వారు. సాయే వారిద్దరి రూపంలో సహాయం చేస్తున్నారు.

ఆ
తర్వాత ఆపరేషన్ తప్పదని, ఆపరేషన్ చేసిన రిస్క్ కూడా
ఉన్నదని డాక్టర్స్ చెప్పారు. ఏమి చేయాలో అర్థం
కాలేదు. చివరికి బాబానే అడిగాను. ఒకసారి కాదు మూడు సార్లు
ఆపరేషన్ చేయించమని సాయి సందేశం ఇచ్చారు.
ఆయనపై నమ్మకంతో మేము ఆపరేషన్ కి
సిద్ధపడ్డాము. తెలిసినవాళ్ళు ఎవరూ సహాయపడని ఆ
సమయంలో 4 యూనిట్స్ ఫ్రెష్ బ్లడ్ కావాలన్నారు. అది
కూడా బాబా ఏర్పాటు చేసినట్లు
మా బావగారి ఫ్రెండ్, నెట్ లో సెర్చ్
చేస్తే మరొక అతను వచ్చి
సమయానికి బ్లడ్ ఇచ్చారు. 10 వ
రోజు ఆపరేషన్ జరుగుతూవుంది. అందరం చాలా టెన్షన్
గా ఉన్నాము. అప్పటివరకు హాస్పిటల్ లోపల నేను సాయి
ఫోటో ఎక్కడా చూడలేదు. సాయి ఫోటో కన్పిస్తే
బాగుంటుంది అని మనసులో అనుకున్నాను.
మా చెల్లెలు, బావ బయట నుంచి
వస్తు సాయి లీల బుక్
తీసుకోని వచ్చారు. ఆ పుస్తకం కవర్
పై బాబా ఫోటో ఉంది.
ఆ బుక్ చూడగానే నా మనస్సు ఉప్పొంగి పోయింది. షిర్డీ నుండి బాబా మాకోసమే వచ్చారనిపించింది. లేకపోతే మరేమిటి నేను అనుకున్న వెంటనే ప్రత్యక్షమయ్యారు. అప్పుడు నేను అందరికి నేను మనసులో ఆనుకున్న సంగతి చెప్పాను. అందరు బాబా లీలకు సంతోషించారు. అందరి టెన్షన్ పోయింది. బాబా తోడుగా ఉన్నారు, ఆపరేషన్ సక్రమంగా జరుగుతుందని ధైర్యం వచ్చింది. వెంటనే ఆపరేషన్ పూర్తయి మా డాడీ క్షేమంగా ఉన్నారు అని డాక్టర్స్ చెప్పారు. ఈ 22 రోజుల అంత్యంత కష్ట సమయంలో సాయి, మా చెల్లెలు, బావ రూపంలో కూడా మాకు ఎంతో ఆసరా ఇచ్చారు. అలా బాబా ఆ కష్ట సమయంలో మమ్ము ఆదుకున్నందుకు సాయికి నా శతకోటి నమస్కారములు.

(ఇంకా ఉన్నాయి)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment