17.06.2016 శుక్రవారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీకాకుళంనుండి
సాయి బంధు శ్రీ సాయి సురేష్ గారు తమ అనుభవాలు పంపించారు. వాటినన్నిటినీ క్రమానుసారంగా
ప్రచురిస్తాను. బాబా తన భక్తులను ఏ విధంగా అనుగ్రహిస్తూ ఉంటారో
ఆయన అనుభవాల ద్వారా మనం గ్రహించుకోవచ్చు.
శ్రీ
సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
నా పేరు సాయి సురేష్, నేను శ్రీకాకుళంలో ఉంటాను. సాయి నాకు ఇచ్చిన అనుభవాలను సాయి బంధువులందరితో పంచుకొనే అవకాశం కల్పించినందుకు సాయి కి నా కృతజ్ఞతాభివందనములు.
ఊది
మహిమ: అధ్బుతం
1. ఒకసారి
నాకు జ్వరం వచ్చింది. అయినా
ఉదయం 4 గంటలకు లేచి చల్లని నీళ్ళతో
స్నానం చేసి కాకడ హరతికి
మందిరానికి వెళ్ళిపోయాను. నాకు కాకడ ఆరతి
అంటే చాల ఇష్టం.
ఆరతి
అవుతూ ఉండగా చివరిలో నాకు
కొంచెం కష్టంగా అన్పించి వెనకకి వెళ్లి కూర్చుండిపోయాను. నా తోటి భక్తులు
ఆరతి పూర్తయిన తరువాత వెంటనే నా దగ్గరకు వచ్చి
ఏమైందని ఆడిగారు. జ్వరమని చెపితే, మరి ఎందుకు వచ్చావు
అన్నారు. నాకంతా బాబానే. అంతా బాబానే చూసుకుంటారని
అన్నాను. వారు డాక్టర్ కు
చూపించుకోమన్నారు. సరే అన్నానుగాని సాయి
పై విశ్వాసంతో మొండిగా బాబా ఊది మాత్రమే
తీసుకున్నాను. వేరే ఏ మందు
వేసుకోలేదు.
మూడవ రోజు కూడా
జ్వరం తగ్గలేదు. మద్యాహ్న ఆరతికి ఒక లేడి డాక్టర్
వచ్చారు. నా తోటి వారు,
పంతులుగారు నాపై ప్రేమతో నా
విషయం ఆమెకు చెప్పారు. నేను
బాబా కు మనస్సులో నాకే
మందులు వద్దు నువ్వే నాకు
శరణు అని కోరాను. ఆ
డాక్టర్ నన్ను చూసి, పరీక్షించి వైరల్ ఫీవర్ అని చెప్పారు.
కానీ ఏ
మందు తీసుకోవద్దు రెండు రోజులలో ఫీవర్
అదే తగ్గిపోతుందని చెప్పారు. డాక్టర్స్ యేవో మందులు రాసి
ఇస్తారు గాని ఏ డాక్టర్
అలా చెప్పరు. నేను బాబా లీలకు
ఆశ్చర్యపోయాను. సాయి
కి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. రెండు రోజులలో ఫీవర్
తగ్గిపోయింది.
2. ఒకప్పుడు
నా పెదవుల రెండు చివరల తెల్ల
మచ్చలు ఉండేవి. 5 లేక 6 సంవత్సరాల పాటు
ఏ మందులు తీసుకున్న తగ్గేవి కాదు. చివరకు విసుగుచెంది
మందులు వాడటం మానేసాను. సాయికి
శరణాగతి చెందిన తరువాత సాయి ఊదీ పెదవులకు
రోజు రాసుకోనేవాడిని. చిత్రంగా
ఒక నెల రోజులలో ఆ
మచ్చలు పూర్తిగా నయమైపోయాయి. అది ఊది మహిమ.
3. ఈ
మధ్యనే 4 లేక 5 నెలలుగా నా
కుడి చేయి చిటికన వేళ్ళు
తిమ్మిరి ఎక్కినట్లుగా ఉండేది. అందువలన చేయి పటుత్వము తగ్గినట్లు
ఉండేది. తినేటప్పుడు ముద్ద చేతికి సరిగా
వచ్చేది కాదు. చపాతీ ముక్క
చేయడానికి ఇబ్బందిగా ఉండేది. బట్టల క్లిప్ పెట్టాలన్నా
కష్టంగా ఉండేది. ఈ సమస్య గురించి
ఇంటర్నెట్ లో వెతికాను. అది
ఒక రకమైన సమస్య అని
దానికి యేవో కొన్ని వ్యాయామాలు
చేయాలనీ, ఆపరేషన్ కూడా అవసరము ఉంటుందని
చదివి భయపడ్డాను. ఇంట్లో వాళ్ళకి తెలిస్తే భాధ పడతారని, హాస్పిటల్
కి వెళ్లమంటారని, వాళ్ళకి చెప్పలేదు. ఎందుకంటే అందరికంటే పెద్ద డాక్టర్ సాయి
ఉండగా హాస్పిటల్ కి వెళ్ళటం అనవసరమనిపించింది.
సాయినే నమ్ముకొని రోజు రెండు పూటలు
బాబా ఉది చిటికనవ్రేలుకి పూయటం
మొదలుపెట్టాను. బాబా కృప వలన
ఆ భాధ నయమయ్యింది.
4. నాకు
ఏది తిన్న, త్రాగిన బాబాకు సమర్పించి ఆ తర్వాత నేను స్వీకరించటం అలవాటు.
ఒకసారి మా ఇంట్లో టీ
చేసారు. నేను బాబా ముందు
టీ పెట్టాను. మిగిలిన వాళ్ళు త్రాగుతున్నారు. అది ఏదో వాసన
వస్తుందని, గేదెకు వ్యాక్సిన్ ఏదో ఇచ్చి ఉంటారని
అందుకే పాలు ఆ వాసనతో
ఉన్నాయని వాళ్ళు అనుకుంటున్నారు. టీ త్రాగలేక వదిలివేసారు
కూడా. కానీ బాబా అద్భుత
లీల ఏమిటంటే నేను
టీ త్రాగాను. అది ఎటువంటి వాసన
లేకుండా చక్కగా ఉంది. అందులో దోషాన్ని
సాయి తొలగించేసారు.
• ఒకసారి స్వప్నంలో బాబా స్వహస్తాలతో నాకు
ఒక పుస్తకం ఇస్తున్నట్లు కనిపించింది. ఆ
పుస్తకం అట్టపై సాయి ముఖం స్పష్టంగా
కనిపిస్తూ ఉంది.
దానిపై అమ్ముల సాంబశివరావు అని పేరు స్పష్టంగా
ఉంది. అంతటితో
కల ముగిసింది. ఉదయం మేల్కొన్న తర్వాత
కల జ్ఞప్తికి తెచ్చుకొని ఆలోచించాను. ఈ అమ్ముల సాంబశివరావు
గారు ఎవరని. ఎందుకంటే నేను అంతకుముందు ఎప్పుడు
పేరు వినలేదు. మా ఫ్రెండ్స్ అందరిని
అడిగాను. ఎవరికి ఆయన గురించి తెలియదన్నారు.
కొన్ని రోజుల తరువాత నేను
ఇంటర్నెట్ లో అమ్ముల సాంబశివరావు
గారి గురించి వెతికాను. అప్పుడు తెలిసింది ఆయన బాబాపై ఒక
బుక్ వ్రాశారని. అప్పటినుండి ఆ బుక్ కోసం
చాలా వెతికాను. కానీ దొరకలేదు. ఆ
బుక్ కనిపిస్తే తీసుకోమని మా ఫ్రెండ్స్ కి కూడా
చెప్పాను. కొన్నాళ్ళ తర్వాత మా ఫ్రెండ్స్ షాపింగ్
కి వెళ్ళినప్పుడు ఆ బుక్ కనిపిస్తే
కొని నాకిచ్చారు. అలా సాయి నాకు
ఇంకొక స్వప్నంలో చూపి చదివేలా చేసారు.
ఇలా
వ్రాస్తుంటే ఎన్నెన్నో అనుభవాలను గుర్తుచేస్తూనే ఉన్నారు సాయి. అవన్నీ వ్రాస్తుపోతే
ఒక బుక్ తయారైపోతుందేమో. అప్పటికీ
నేను కుదించి వ్రాస్తున్నా ఇన్ని పేజీలు అయిపోయాయి.
అందుకే ఇక్కడితో ముగిస్తున్నాను.
పూర్ణ
విశ్వాసంతో సాయి చరణాల వద్ద మీ
జీవితాన్ని సమర్పించుకోండి. అప్పుడు చూడండి. మీ జీవితం యెంత
అద్బుతంగా ఉంటుందో. అడుగడుగునా మీ అండగా ఉండి
మిమ్మల్ని గమ్యం చేరుస్తారు సాయి.
జీవితంలో కష్టాలే ఎదురైనా సహనంతో ఉండండి. ఎందుకంటే ఆ కష్టాలు మన
శ్రేయస్సుకోసమే సాయి ప్రసాదించారు.
ఈ విధంగా
సాయి నాకు ఎన్నో అనుభవాలు
ప్రసాదించారు. సాయి గుర్తు చేసినంతవరకు
మీ అందరితో పంచుకున్నాను.
మీ
సాయి బందువు,
సాయి
సురేష్
Mobile No:- +91 8096 343 992
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment