20.06.2016
సోమవారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ
రోజు ఇద్దరు సాయభక్తుల గురించి తెలుసుకుందాము.
సాయి బంధు శ్రీసాయి సురేష్ గారు తమ వెబ్ సైట్ www.saaileelas.com
నుండి పంపించారు. వారికి ధన్యవాదాలు సమర్పించుకొంటున్నాను.
ఈ
రోజు లక్ష్మణ్ బజి అవరె, దుర్గా బాయి కర్మాకర్ ల గురించి తెలుసుకుందాము.
సాయి భక్తులు
లక్ష్మణ్
బజీ అవరె
1910సం. లో
లక్ష్మణ్ బజీ అవరె అనే
అతనికి రెండు కళ్ళలో నొప్పి
వచ్చింది. రెండు కళ్ళ నుండి
నీరు కారసాగింది. చివరికి కంటి చూపు పోయింది.
నయం చేయడానికి చేసిన అన్ని ప్రయత్నాలు,
మందులు ఏవి పని చేయలేదు. ఆ
కుటుంబానికి తెలిసిన ఒక స్నేహితుడు శిరిడి
వెళ్ళమని సలహా ఇచ్చారు. బాబా
దర్శనం చేసుకుంటే బాధ
నయం కాగలదని చెప్పారు. ఒక గురువారం షిర్డీ
వెళ్లి బాబా దర్శనం చేసుకున్నారు.
బాబా లక్ష్మణ్ వైపు కరుణతో చూసి
“అల్లా అచ్చా కరేగా” అంటూ ఉదీ ఇచ్చారు.
వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చాక కళ్ళ నీరు రావడం
ఆగింది, నొప్పి కూడా తగ్గింది. అప్పటినుండి
ఆరు నెలల పాటు వారు
ప్రతి గురువారం షిర్డీ వెళ్లి బాబా దర్శనం చేసుకుంటుండేవారు.
తర్వాత
ఆ గ్రామస్తులు అతని తల్లితో అతనిని బొంబాయి లో జె.జె.
హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళమని
చెప్పారు. వారు బొంబాయి బయలుదేరిన
రోజు లక్ష్మణ్ వళ్ళంతా మంటలు
పుట్టి భాధ కలిగింది. బ్రిటిష్ కంటి వైద్యుడు లక్ష్మణ్
ను పరీక్షించి అతని కళ్ళు బాగా
చేడిపోయినవని, కంటి చూపు మరి
రాదని చెప్పారు. వాళ్ళు చాలా బాధపడుతూ తిరిగి
ఇల్లు చేరారు.
లక్ష్మణ్
కంటి చూపు వచ్చినా, రాకున్నా
షిర్డీ వెళ్ళి సాయి చెంత ఉండాలని
నిశ్చయించుకున్నారు. ఆ కుటుంబమంతా షిర్డీ
వచ్చి కొన్ని రోజుల పాటు షిర్డీ
లో ఉన్నారు. తర్వాత అతని తల్లి కొడుకుని
బాబా చెంత విడిచి తన
స్వగ్రామం వెళ్ళిపోయారు. లక్ష్మణ్ కు బాబా యందు
సంపూర్ణ విశ్వాసం ఉంది. ప్రతి
రోజు బాబా ముఖం కడుగుకొనే
నీళ్ళతో అతడు తన కళ్ళను
కడుగుకునేవాడు. ఈవిధంగా ఒక నెల రోజులపాటు
చేసారు. అకస్మాత్తుగా ఒకరోజు పూర్తిగా కాకుండా కొంచెం కంటి చూపు వచ్చింది.
తరువాత ఒక సాయంత్రం చావడిలో
బాబా దర్శనం చేసుకున్నారు. అప్పుడు బాబా లక్ష్మణ్ గుండెపై
చేతితో తట్టి, “ఇతనికి మళ్ళి కంటి చూపు
పూర్తిగా వస్తుంది. ఇకపై అంతా స్పష్టంగా
చూడగలడు” అన్నారు. మరుక్షణమే లక్ష్మణ్
కు చూపు వచ్చింది.
బాబా చేసిన మేలుకు లక్ష్మణ్
కృతజ్ఞత బావంతో పరవశించిపోయారు. రాధాకృష్ణ మాయి లక్ష్మణ్ ను
బావి నుండి నీరు తెమ్మని
చెప్పేవారు. మరి కొన్ని సేవలు
కూడా ఆమె అతనికి చెప్పేది.
లక్ష్మణ్ తనకు కంటి చూపును
తిరిగి ఇచ్చిన సాయి పై కృతజ్ఞత
బావంతో ఆ సేవలను సంతోషం
తో చేస్తుండేవాడు. బాబా
సమాధి చెందే వరకు షిర్డీ
లోనే ఉండిపోయారు.
దుర్గాబాయ్
కర్మాకర్
1913 సం. లో
దుర్గాబాయి కర్మాకర్ అనే ఆమె చేతిలో
8 నెలల బిడ్డతో ద్వారకామాయికి వచ్చింది. తన బిడ్డను మసీదు
మాయి నేలపై ఉంచి సాయి
బాబా కు నమస్కరించింది. సాయి
దర్శనంతో ఆమెకు తన్మయత్వంతో కన్నీళ్ళు
కారాయి. ఆమె చాల పేదరాలు.
షిర్దిలో ఉండటానికి ఆమె వద్ద ధనం
లేదు.సర్వాంతర్యామి అగు సాయి కి ఆమె
పరిస్థితి తెలుసు కదా! ఆమెతో సాయి
“దేనికి బాధ పడవద్దు, ఇక్కడ నీకు ఎటువంటి ఇబ్బంది కలగదు. ఈ
ద్వారకామాయి అందరికి మేలు చేస్తుంది. ఇప్పుడే
వెళ్లి మూడు రోజుల పాటు
ఒక్క మాట మాట్లాడకుండా, అన్నపానీయాలు
తీసుకోకుండా ఆ వేప చెట్టు
క్రింద కూర్చో. నాల్గవ రోజు ఉదయం అన్నీ
చక్కపడతాయి” అన్నారు.
అప్పుడామె “బాబా నేను చాల
బీదరాలను, నాకెవరు అండ లేరు. మూడు
రోజులు నేను అన్నపానియలు లేకుండా
ఉండగలను, కానీ పాలపై ఆధారపడే
నా బిడ్డ ఎలా ఉండగలడు.
అందుకని కొంచం పాలు వాడికోసం
తీసుకుంటాను” అంది.
అప్పుడు
బాబా “వెళ్ళు వెళ్ళు అంటూ పాలు గాని,
ఇంకేమి గాని బిడ్డకు ఇవ్వవద్దు,
కేవలం వాడిని పడుకోనివ్వు. అల్లామాలిక్”
అన్నారు. ఆమె కంటి నుండి
నీరు కారుతోంది. ఆమెకు ఎటువంటి అనుమానం
లేదు బాబా మాటలందు. బాబా
మాటలే ఆమెకు కొండంత బలాన్నిచ్చాయి
. మంచి,
చెడు ఏది జరిగినా బాబా మాటలకు కట్టుబడాలని
ఆమె నిశ్చయించుకుంది. దుర్గాబాయ్, బాబా ఆజ్ఞ ప్రకారం
వెళ్లి వేపచెట్టు(గురుస్థాన్) క్రింద కూర్చుంది. అటువంటి భక్తులకు బాబా ఆజ్ఞే బలాన్ని
చేకూరుస్తుంది. దుర్గాబాయ్ బాబా చెప్పినట్లుగానే ఒక్క
మాటైన మాట్లాడకుండా, అన్నపానీయాలు తీసుకోకుండా కూర్చుంది. కానీ అద్బుతమేమిటంటే ఆమె
బిడ్డ కూడా ఆ మూడు
రోజులు పాలకోసం గాని, ఆహారం కోసం
గాని ఏడవలేదు. మూడు రోజులలో తల్లిబిడ్డ
ఇద్దరూ ప్రకృతి పిలుపుకు కూడా వెళ్ళలేదు.
నాల్గవ
రోజు వేకువ జామున బాబా
దుర్గాబాయ్ వద్దకు వచ్చి రెండు చపాతీలు
అమెకిచ్చారు మరియు రెండు రూపాయలు
బిడ్డ చేతిలో పాలకోసం పెట్టారు. ఇంక సాయి
ఆమెతో “అనవసరంగా ఎవ్వరితో మాట్లాడవద్దు. వీలైనంతవరకు మౌనంగా ఉండు. నా సేవగా
బావించి, ఇతరులను సేవించు” అని చెప్పారు. ఈ
సంభాషణ జరుగుతుండగా బలబావ్ అక్కడికి వచ్చారు. అతనికి షిర్డీ లో ఒక హోటల్
ఉన్నది. అతడు బాబాతో “బాబా! ఈమె బాధ్యత
నా
భుజాలపై వేసుకుంటాను”
అన్నారు. ఆ విధంగా తల్లిబిడ్డలకు బాబా పోషణ ఏర్పాటు
చేసారు. అప్పటివరకు
ఆ బిడ్డకు నామకరణం జరగలేదు. అప్పుడు బాబా రఘునాద్ అని
బిడ్డకు పేరు పెట్టారు.
దుర్గాబాయ్
7 లేక 8 రోజులు షిర్డీ లో ఉండాలని వచ్చింది.
ఆ గడువు దాటిన తర్వాత
ద్వారకామాయి కి వెళ్లి షిర్డీ
విడిచి వెళ్ళడానికి సాయి ని అనుమతి
అడిగింది. బాబా
“వెళ్ళు నీ స్ఠానంలో కూర్చో,
నేను నిన్ను ఇక్కడికి లాగుకొని వచ్చాను. నిన్ను తిరిగి పంపటానికి తీసుకురాలేదు. ఎవరైతే నా వారో వారినే
నేను ఇక్కడకు తీసుకువస్తాను” అన్నారు.
దుర్గాబాయ్
రెండు వేరు వేరు చోట్ల
పనిచేస్తూ సంపాదించుకోనేది. ఆమె లెండిబాగ్ కు
ద్వారకామాయి కి మద్యలో ఇల్లు
కట్టుకుంది. ప్రతి రోజు ఉదయం,
సాయంత్రం బాబా లెండి కి వెళ్లి
వచ్చేటప్పుడు ఆమెకు సులువుగా బాబా
దర్శనం కలుగుతుండేది. ఆమె ముక్కుసూటితనం అందరికి
నచ్చేది కాదు. వారంతా ఆమె
గురించే చెడుగా మాట్లాడేవారు. అటువంటి వారికి ఏధమయిన
సమాధానం దుర్గాబాయ్ చెప్పేది కాదు. ద్వారకామాయి కి
పోయి ఓ మూలన కూర్చుని
నెమ్మదిగా ఏడ్చేది. ఒకరోజు మధ్యాహ్నం బాబా పాదాలు వత్తుతూ ఇతరులు తన గురించి అనే
చెడు మాటలు గుర్తువచ్చి ఆపుకోలేక
కన్నీరు పెట్టుకుంది. అప్పుడు సర్వజ్ఞుడగు సాయి ఆమె మదినెరిగి
“దుర్గా! ప్రజలు ఏమైనా చేయని, ఏమైనా
మాట్లాడని, వాటికి విలువ ఇవ్వవలిసిన అవసరము
మనకేమైనా ఉందా? వాళ్లతో మనకు
పనేమిటి? కష్టపడి పని చేయు, నీవు
చేయవలిసింది చాలా ఉంది. నేను
ఇక్కడ నీకోసమే ఉన్నాను. ఎల్లప్పుడు నీ సహాయర్ధమే నేనిక్కడ
కూర్చొని ఉన్నాను” అన్నారు. బాబా యొక్క ఈ
అద్భుత పలుకులు విని దుర్గాబాయ్ సంతోషంతో
పరవశించి పోయింది.
దుర్గాబాయ్
ఎటువంటి పని అయినా తిరస్కరించేది
కాదు. ఎంత కష్టమైన పని
అయిన పూర్తి చేసేది. ఆమె తన పని
పూర్తయిన తర్వాత ఒక కుండలో బియ్యం
పోసి ద్వారకామాయికి తీసుకోని వచ్చి పవిత్రమైన బాబా
ధునిపై పెట్టేది. బియ్యం ఉడికే వరకు, ఆమె
బాబా శరీరాన్ని మాలిష్ చేస్తూ ఉండేది. బాబా ఆపమని చెప్పేవరకు
మాలిష్ చేస్తూ ఉండేది. ఆ
ఉడికిన అన్నం తో బాబాకు
నైవేద్యం తయారుచేసి సమర్పించుకోనేది. దాదాసాహెబ్ ఖాపర్డే ఆమె బాబాకు చేసే
అనుపమానమైన సేవకు మెచ్చి, ప్రతి
నెల ఆమెకు 15 రూపాయలు ఇవ్వడానికి నిశ్చయించుకొన్నారు. .
బాబా
‘నిజమైన ప్రేమ’ను మాత్రమే భక్తుల
నుండి కోరుకున్నప్పటికి, దుర్గాబాయ్
కఠినమైన నియమ నిష్టలతో బాబాను
సేవించేది. ఆమె అంటరానితనం పాటించేది.
ఒకసారి దుర్గాబాయ్ బియ్యం, ధునిపై పెట్టి బాబాకు మాలిష్ చేస్తూ వుంది. అంతలో ఒక భక్తుడు
వచ్చి ధుని మీదనుండి అన్నం
కుండను ప్రక్కకు దించి, ధునిలోని నిప్పుతో చిలిం వెలిగించుకొని, మరల
అన్నం కుండ ధునిపై
పెట్టాడు. అతనికి అంటరానితనం అనే భావాలు ఏమి లేవు.
అతనికి ఒక్కటే తెలుసు అది బాబా సన్నిధి.
అక్కడ పేద-గొప్ప, ఎక్కువ-తక్కువ, అనే భేదాలుండవు. అక్కడ
అంతా సమానమే. దుర్గాబాయ్ అటువంటి వారు ఏమి చేసిన
ఏమి అనేది కాదు, తను
బాబా సేవను విడిచిపెట్టేది కాదు.
కానీ తన మనస్సులో ‘నా
బిడ్డ భోజన వేళ అయ్యింది.
ఎలా ఇటువంటి దిగువ జాతివారు ముట్టిన
ఆహారం బిడ్డకి పెట్టేది. ఆ ఆహారం వాడికి
ఎటువంటి మేలు చేయదు. నేను
ఎప్పుడు దుకాణానికి వెళ్లి
బియ్యం తెచ్చి, అన్నం వండి బిడ్డకు
తినిపెంచేది’ అని
అనుకుంటూ దుఃఖాన్ని ఆపుకోలేక కన్నీరు పెట్టుకుంది. ఒక కన్నీటి బొట్టు
బాబాపై వెనకవైపు
రాలింది. సర్వజ్ఞుడగు సాయి కి ఆమె
మనస్సులో ఆలోచనలు, భాధ తెలుసుకదా!
అప్పుడు
సాయి “దుర్గా ఏడవవద్దు. నా సన్నిధిలో అంటరానితనం
అన్నదానికి స్థానమేలేదు. ఈ మసీద్ మాయి
విలువలేనిది కాదు. ప్రజలు ఇక్కడకి
వచ్చి కోట్ల జన్మల పాపాలను
కడిగేసుకుంటారు. నా స్వహస్తాలతో ఈ
ధుని వెలిగించాను. ఈ ధునిలో అగ్ని
దేవుడు కొలువైవున్నాడు. అంతటి పవిత్రమైన మంటపై
వండబడిన ఆహారం ఒకరు ముట్టినంత
మాత్రన అపవిత్రం అయిపోతుందా? ఇటువంటి ఆహారం తినుటవలన నీ
బిడ్డకు ఎంతో మేలు చేకూరుతుంది.
దయ కలిగి నేను ఈ
మాటలు చెప్పుచున్నాను. నాకు ఎవరి యందు
ఎటువంటి చెడు అభిప్రాయములు లేవు.
ప్రజలు ఎక్కడెక్కడి నుండో వచ్చి ఈ
ధునిలోని ఊదీని తీసుకొని వారి
వ్యాధులు నయం చేసుకోవటానికి తమ నుదట
రాసుకుంటారు. వారి అదృష్టాన్ని నేనేమని
చెప్పను. అందువలన దుర్గా! మనస్సులో ఎటువంటి అనుమానాలు పెట్టుకోకుండా! ఈ ఆహారాన్ని రఘుకు
తినిపించి, నీవు కూడా తిను” ఈవిధంగా
చెప్పి ఆమెను ఆశీర్వదించి సరే
ఇప్పుడు లే, లేచి అన్నం తీసుకొని ఇంటికి వెళ్లి నువ్వు, రఘు తినండి అన్నారు.
ఈవిధంగా
సాయి తన దృష్టిలో అందరు
సమానమని మరియు కులం, మతం
మరియు అంటరానితనం వంటి భేద భావాలు
గమ్యం చేరడానికి అడ్డంకులని అపూర్వమైన భోధ చేసారు.
శ్రీ
సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్
మహారాజ్ కి జై
(సర్వం
శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment