24.06.2016
శుక్రవారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబా వారి శుభాశీస్సులు
ఒక్కొక్కసారి
మనం అనుకున్న పనులు జరగలేదనుకోండి. కొంతమంది
భక్తులకి అనిపిస్తుంది. బాబాని ఇంత కాలం నుండీ
పూజిస్తున్నానే, మరి నా గురించి ఏమీ పట్టించుకోడా? అని కాస్త నిరాశకూడా కలుగుతూ ఉంటుంది. అటువంటప్పుడు మనం విచక్షణ కూడా కోల్పోతాము. బాబాని నిందిస్తాము. ఆయన మీద కోపగిస్తాము. కాని ఆయన మాత్రం మనమీద కోపగించుకోరు. ఆయన మన తండ్రి, సద్గురువు. ఆయనకి మన మీద ఎప్పటికీ ప్రేమ కలిగే ఉంటారు. ఇప్పుడు మీరు చదవబోయే ఈ లీలలో బాబా మీద ఒక భక్తుడు
కాస్తంత కోపగించుకున్నా, అదికూడా ప్రేమతోనే. ఆయన ఏవిధంగా ఆదుకున్నారో చూడండి.
saileelas.com లో ప్రచురింపబడిన దానికి తెలుగు అనువాదంరోజు ఈ రోజు మీకు అందిస్తున్నాను.
నన్ను నిందించినా నేను కోపించను
నా
పేరు నిట్టల వంశీకృష్ణ. నాకు సాయిబాబా అంటే
ఎంతో భక్తి. నేను ఆంధ్రపదేశ్ లో డిగ్రీ చదువుతుండగా
ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. అది నేను జీవితాంతం
మర్చిపోలేని అధ్బుతమైన అనుభూతి.
నేను
డిగ్రీ ఆఖరి సంవత్సరంలో ఉండగా అమెరికాలో ఎమ్ ఎస్ చేయాలని కలలు కంటూ ఉండేవాడిని
GRE, TOEFL పరీక్షలకి స్వంతంగానే తయారయి టెస్టు రాశాను గాని, మంచి యూనివర్సిటీలో చేరడానికి
కావలసిన అర్హత మార్కులు సాధించలేకపోయాను. ఆ
సమయంలో నా మాస్టర్ డిగ్రీ అయేంతవరకు నాబాబాకి ఇష్టమయిన వంకాయ కూర (నాకు కూడా ఇష్టమే)
తినకూడదని నిర్ణయించుకొన్నాను. ఇదే కాకుండా
మరొక అతి దారుణమయిన నిర్ణయం కూడా తీసుకొన్నాను.
అది కొద్ది రోజులపాటు బాబా గుడికి వెళ్ళకూడదనే నిర్ణయం. దీనికి కారణం బాబా మీద నాకున్న ప్రేమ దానితోపాటుగా
కాస్తంత కోపం. నా జీవితంలో తీసుకొన్న చెడు
నిర్ణయం ఇదే అని నేను ఒప్పుకుంటున్నాను.
కొద్ది
రోజుల తరువాత ఒక మల్టీ నేషనల్ కంపెనీలో వాకిన్ ఇంటర్వ్యూకి నా స్నేహితులతో కలిసి వెళ్ళే
అవకాశం వచ్చింది. బాబాని ప్రార్ధించకుండా నా స్నేహితులతో కలిసి ఇంటర్వ్యూకి బయలుదేరాను. నా విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్స్ అన్నీ
నా కాలేజీ బాగ్ లో సద్దుకొన్నాను. సామాన్యంగా
ఉద్యోగాన్వేషణలో ఉన్నవానికి అతి విలువయిన ఆస్తి సర్టిఫికెట్లే.
మేమంతా
బస్ స్టాండుకు చేరుకొని బస్సు కోసం నిరీక్షిస్తూ ఉన్నాము. బస్సు లేటుగా వస్తుందని తెలియడంతో నా కాలేజీ బాగ్
ని మిగిలిన బాగ్స్ దగ్గర పెట్టి, మరొక స్నేహితునితో కలిసి టిఫిన్ ఏదయినా తిని వద్దామని
బయలుదేరాను.
కొద్ది
సేపటి తరువాత వచ్చి చూస్తే నా సర్టిఫికెట్స్ అన్నీ ఉన్న నా బాగ్ కనపడలేదు. గుండెల్లో దడ మొదలయింది. నా బాగ్ ని ఎవరో దొంగిలించారు. కళ్ళంబట నీళ్ళు వస్తున్నాయి. బస్ స్టాండ్ చుట్టుప్రక్కల అంతా వెతికాను. దగ్గరున్న ఆటో స్టాండులో , అన్ని చోట్లా వెతికాను,
కాని నా బాగ్ ఎక్కడా కనిపించలేదు. నా స్నేహితులు
బస్ స్టాప్ లో పోయిన బాగ్ గురించి ఎనౌన్స్ చేయించారు. ఆ బాగ్ లో సర్టిఫికెట్లు తప్ప మరేమీ లేవనీ, అవి
పోగొట్టుకున్నవానికి తప్ప మరెవరికీ ఉపయోగపడవని ప్రకటన ఇప్పించారు. ఆ బాగ్ ను తిరిగి తీసుకొచ్చిన వాళ్ళకి తగిన బహుమతి
కూడా ఇవ్వబడుతుందని కూడా ప్రకటన ఇప్పించారు.
బస్ స్టాండులోకి వచ్చిన ప్రతి బస్సునీ వెతికాను. నాస్నేహితులతో కలిసి బస్ స్టాండులో ప్రతిచోటా వెదికాను. అప్పుడు ఒక పోలీసు వచ్చి, దర్యాప్తు మొదలుపెట్టడానికి
ముందరగా ఒక కంప్లయింట్ రాసి ఇవ్వమన్నాడు. కాని
నాకు అలా చేయడం ఇష్టంలేదు. కారణం నా బాగ్ ఎవరికయినా
దొరికి నాకు ఇవ్వడానికి ప్రయత్నించినా పోలీసులకి భయపడి ముందుకు రాకపోవచ్చనిపించింది.
ఆ
తరువాత నేనొక్కడినే, ఏదయినా క్లూ దొరుకుతుందేమోనని దగ్గరలో ఉన్న మురికి వాడలు, వీధులు
అన్నీ ఆ రాత్రివేళలో తిరుగుతూనే ఉన్నాను. ఎంతో
ఆందోళనతో ఆవిధంగా వీధులన్నీ తిరుగుతుండగా నాకు బాబా గుడి కనిపించింది. గుడిలో బాబా విగ్రహాన్ని చూసిన వెంటనే నా కళ్ళలో
కన్నీరు ఉబికి వచ్చింది. వెంటనే గుడిలోకి వెళ్ళి
బాబాని ప్రార్ధించాను.
ఇంక బాగ్ దొరకదని, ఆశ వదిలేసుకొని బస్ స్టాండ్ కు వస్తూ ఉన్నాను. ఆ సమయంలోనే ఒక అపరిచితుడి నుంచి ఫోన్ వచ్చింది. రైల్వే ట్రాక్ వద్ద తనకి బాగ్ దొరికిందని, వెంటనే
వస్తే తీసుకోవచ్చని చెప్పాడు అతను. వంటరిగా
రైల్వే ట్రాక్ వద్దకు ఆ సమయంలో వెళ్లడం క్షేమకరం కాకపోయినా బాబాని ప్రార్ధించుకుని
అతను రమ్మన్న చోటకు వంటరిగా బయలుదేరాను. అక్కడ
ఒక రైతు నా బాగ్ పట్టుకుని నుంచుని ఉన్నాడు.
అతని ప్రక్కన ఒక కుక్క కూడా ఉంది. వెంటనే
నా బాగ్ తెరిచి చూసాను. నా సర్టిఫికెట్స్ అన్నీ
ఉన్నాయి. ఏమీ పోలేదు. అన్నీ సరిగ్గానే ఉన్నాయి. వెడుతున్న రైలులోనుండి ఎవరో ఆ బాగ్ ను బయటకు విసిరేశారని
చెప్పాడు ఆ రైతు. బాగ్ లో ఉన్న నా డైరీలో ఉన్న
నా నెంబరు చూసి ఫోన్ చేసానని చెప్పాడు. మరుక్షణంలోనే
ఆవ్యక్తి తన కుక్కతో సహా అక్కడినుండి వెళ్ళిపోయాడు. అంత పెద్ద సమస్యనుండి నన్ను కాపాడినది బాబా తప్ప
మరెవరూ కాదని నాకర్ధమయింది.
ఇకనుండి
ఎటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదనే గుణపాఠం నేర్చుకొన్నాను.
ఇండియాలోనే
ఒక పేరున్న ఇన్స్టిట్యూట్ లో నాకు మాస్టర్స్ డిగ్రీలో సీటు వచ్చింది. ఆ తరువాత నా ఎమ్ ఎస్ పూర్తయిన
కొద్ది నెలల్లోనే నాకు అంతర్జాతీయ సంస్థలో మంచి ఉద్యోగం వచ్చింది.
అమెరికాలో ఎమ్ ఎస్ చేసినా అంత మంచి ఉద్యోగం వచ్చి ఉండేది కాదు.
(సర్వం
శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment