14.07.2016
గురువారమ్
ఓం
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయిబాబావారి
బోధనలు మరియు తత్వము
2. ఆహారం – 2వ.భాగం
ఆంగ్లమూలం
: లెఫ్టినెన్ట్ కల్నల్ ఎమ్.బి.నింబాల్కర్
తెలుగు
అనువాదం: ఆత్రేయపురపు త్యాగరాజు
ఈ
రోజు సాయిబాబాగారు ఆహారం గురించి ఏమని వివరించారో తెలుసుకుందాము. బోధనలు మరియు తత్వంలో
రెండవ విషయం ఆహారం గురించి మరికొంత సమాచారం.
బాబా
తన భక్తులను మాంసాహారం మాన్పించడానికి చేసే బోధనలు, ఆ పద్ధతులు చాలా విభిన్నంగాను,
అసమానంగాను ఉండేవి. బాబా తన భక్తులకెప్పుడూ
తాను అన్ని జీవులలోనూ ఉండి సంచరిస్తున్నానని మాటిమాటికీ చెబుతూ ఉండేవారు.
ఆయన
తార్ఖడ్ గారి భార్యతో (9వ.అధ్యాయం) “భోజనవేళకు నువ్వు ఏకుక్కకయితే రొట్టెముక్క పెట్టి
దాని ఆకలి తీర్చావో అదియును, నేనును ఒకటే. అలాగే
సకల జీవరాసులు (పిల్లులు, పందులు, కీటకాలు, గోవులు మొదలైనవన్నీ) అన్నిటిలోను నేను వాటి
రూపంలో సంచరిస్తున్నాను.
ఎవరయితే నన్ను ప్రాణులన్నిటిలోనూ
చూచెదరో వారు నాకు ప్రియమైనవారు. అందుచేత భేదభావాన్ని
మరచి ఈ రోజు నువ్వు చేసినట్లుగానే ఎల్లపుడూ నన్ను సేవించు” అన్నారు.
బాబా
చెప్పిన ఈ సిధ్ధాంతాన్ని కనక ఎవరయినా పరిపూర్ణంగా నమ్మితే, మాంసాహారాన్ని ముట్టడానికి
ఎవరు సాహసం చేస్తారు? తమంతతామే మాంసాహారాన్ని
తినడం మానివేస్తారు. ఆవిధంగా సాయిబాబా ఆహారం
విషయంలో చాలా యుక్తిగా ప్రయోగాత్మకంగా, వాస్తవాన్ని ప్రతిబింబింపచేస్తూ అహింసా సిధ్ధాంతాన్ని
ప్రబోధించారు.
ఉల్లిపాయలు
:
మాంసాహారానికేదయితే
వర్తిస్తుందో ఉల్లిపాయలకు కూడా అదే వర్తిస్తుంది.
సాయిబాబావారు ప్రతిరోజూ రొట్టెలో ఉల్లిపాయలను నంచుకొని తినేవారు.
ఉల్లిపాయలకున్న ఘాటయిన చెడు వాసన వల్ల ఎవరయినా దానిని
అసహ్యించుకొన్నా, తినకూడదని అనుకున్నా బాబాకి ఇష్టం ఉండేది కాదు. దాదాకేల్కర్ ని, దాసగణూని, కుశాభావూలని ఈ విషయంలో
బాబా పరిహాసం చేయడం మనకందరకూ తెలిసిన విషయమే.
ఒకసారి ఆయన యోగాభ్యాసం నేర్చుకోవడానికి వచ్చిన విద్యార్ధి ఎదుట రొట్టె, ఉల్లిపాయలను
తిని, అతనిని ఆశ్చర్యపరచారు. తరువాత అతీతమయిన
తన యోగశక్తులను ఋజువుగా ప్రదర్శించి అతనిని అబ్బురపరచారు. అర్ధం పర్ధం లేని ఛాందస భావాలు, మూఢనమ్మకాలతో ఉల్లిపాయలను,
వెల్లుల్లిని తినడం తమంత తామే మానుకొంటున్నారనీ, ఆయుర్వేదపరంగా ఎన్నో ఔషధ గుణాలున్నాయని,
ఆరోగ్యానికి అద్భుతంగ పని చేస్తాయని అలాంటివారికి తెలియచేయాలనుకొన్నారు. పొలంలో బాగా
కష్టించి పని చేసేవారంతా రొట్టి, ఉల్లిపాయలను తిని అంత పనిని సులభంగా చేయటల్లేదా?
మారుమూల గ్రామాలలో ఎవరయినా స్పృహతప్పి పడిపోతే వెంటనే
ఉల్లిపాయను చితుకగొట్టి వాసన చూపించి ప్రధమ చికిత్స చేస్తున్నారు. ఈమధ్యనే పశ్చిమదేశాలవారు కూడా గుండె జబ్బులకి వెల్లుల్లి
అమోఘంగా పనిచేస్తుందని నిర్ధారించి చెప్పారు.
బి.పి.ని కూడా తగ్గిస్తుందని చెపారు.
అప్పటినుండి మన భారతీయులు ఖరీదయిన మందుబిళ్ళలు (లాసునా) వెల్లుల్లి సారంతో తయారుచేసినవి
ఉపయోగించడం మొదలుపెట్టారు.
ఉపవాసం
:
తరువాత
బాబావారు ఉపవాసంనాడు ఆహారం గురించి ముఖ్యమైన సలహానిచ్చారు. సాయిబాబా తానెప్పుడూ ఉపవాసం ఉండలేదు, తానెవ్వరినీ
ఉపవాసం ఉండమని చెప్పలేదు. గోఖలేగారి భార్య
షిరిడీలో మూడురోజులు ఉపవాసం చేద్దమనుకొన్నపుడు (అధ్యాయం 32) బాబా ఆమెని దాదాకేల్కర్
గారి ఇంటికి వెళ్ళమని చెప్పారు. అక్కడ కేల్కర్ గారి భార్య ఇంటిలోనికి రాకూడని రోజులవడంచేత
సాంప్రదాయం ప్రకారం వంట నిషిధ్ధం కనుక ఆమెను వంట చేయమని పంపించారు. కాకాగారికి వారి కుటుంబానికి మంచి రుచికరమైన బొబ్బట్లు
చేసి వారికి వడ్డించమనీ, ఆమెను కూడా ఉపవాసం ముగించి తృప్తిగా తినమని చెప్పారు.
ఉపవాసం ఉన్నవారి మనసు నిలకడగా ఉండదు. అపుడు మనసు భగవంతుని మీద లగ్నం కాదు. అలాంటప్పుడు
భగవంతుని సాక్షాత్కారం ఎలా లభిస్తుంది (ఏది జీవిత లక్ష్యం)? ఖాళీ కడుపుతో భగవంతుని
దర్శించలేవు. మొదటగా ఆత్మని శాంతింపచేయాలి. మన శరీరంలోని భాగాలన్నిటికి సరియైన పోషణనిచ్చి,
అవి సక్రమంగా ఆరోగ్యంగా పనిచేస్తేనే మనకు భగవంతుని మీద భక్తి ఏర్పడి ధ్యానం నిలకడగా
కుదురుతుంది. దాని వల్ల మిగతా సాధనలన్నిటినీ
మనం సక్రమంగా చేయగలుగుతాము. మన శరీరంలోని అవయవాలన్నీ
సక్రమంగా వాటి పని అవి చేయాలంటే శక్తి అవసరం.
అటువంటి పౌష్టికశక్తి లేనప్పుడు భగవంతుని ఏకండ్లతో చూడగలము? ఏ నాలుకతో పొగడగలము. ఏ చెవులతో భగవంతుని లీలలను వినగలము? అవయవములన్ని మంచి స్థితిలో ఉన్నపుడే మనము భక్తి
మొదలగు సాధనములను ఆచరించి దేవుని చేరగలము.
కాబట్టి ఉపవాసము గాని మితిమించిన భోజనము గాని మంచిది కాదు. ఆహారములో మితి శరీరానికి, మనస్సుకు కూడా మంచిది.
దీనివల్ల
మనం అర్ధం చేసుకోవలసినదేమిటంటే ఉపవాసం గాని, అమితంగా భుజించడంగాని మంచిది కాదు. మితాహారం శరీరానికి, మనస్సుకు ఆరోగ్యకరం.
అధ్యాయం – 32
శ్రీమతి
రాధాబాయి దేశ్ ముఖ్, తనకు బాబా మంత్రోపదేశం కనక చేయనట్లయితే భోజనం నీరు కూడా మానివేసి
ఉపవాసం ఉండి చనిపోవుదునని భీష్మించుకుని ఉంది.
బాబా ఆమెకు తన అనుభవాన్ని తెలియచెప్పి తన గురువు తనకెటువంటి మంత్రోపదేశము చేయలేదని,
ఉపవాస దీక్షను విరమించుకోమని బోధించారు. భగవంతునితో
ఏకత్వం సాధించడానికి సులభమయిన తరుణోపాయం ఆమెకు విశదీకరించారు. అది "నాయందెవరి దృష్టో వారియందే నా దృష్టి. నావైపు సంపూర్ణ హృదయముతో చూడుము నేను నీవైపు అట్లనే
చూచెదను.”
అధ్యాయం - 19
(ఆహారం ౩వ.భాగమ్ రేపటి సంచికలో)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment