06.07.2016 బుధవారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు షిరిడీ సాయి వైభంలోని మరొక వైభవం తెలుసుకుందాము.
శ్రీ
షిరిడీసాయి వైభవమ్
బాబా వారి సటకా దెబ్బ
1917
వ.సంవత్సరం వైశాఖమాసంలో ఒక డాక్టరు, తన భార్య కొడుకుతొ సహా షిరిడీకి వచ్చాడు. అతని కొడుకుకి దెయ్యం పట్టి పీడిస్తూ ఉంది. తన కొడుకును పట్టి బాధిస్తున్న దెయ్యాన్ని బాబా వదలకొడతారనే ఉద్దేశ్యంతో కొడుకుని షిరిడీకి తీసుకొని వచ్చాడు.
ద్వారకామాయిలో బాబా గోధుమలను
విసురుతూ ఊరి పొలిమేరల్లో చల్లడం చూసి ఆయన చేసే పని అర్ధరహితమనీ, దాని వల్ల ఎటువంటి
ఉపయోగం లేదని భావించాడు.
బాబా అతని మనసులోని
ఆలోచనలను గ్రహించి అతనిని మధ్యాహ్నం మూడు గంటలకు రమ్మని చెప్పారు. సరిగ్గా మూడు గంటలకి కుటుంబంతో సహా ద్వారకామాయికి
చేరుకొన్నాడు. బాబా ఆజ్ఞాపించిన మీదట డాక్టరు,
అతని కొడుకు బాబా వద్ద కూర్చొని ఆయన కాళ్ళను వత్త సాగారు. అదే సమయంలో ఒక కురూపియైన దెయ్యం వచ్చి డాక్టరు కొడుకుని తీసుకొని వెళ్ళిపోవడానికి పట్టుకొని లాగసాగింది. బాబా వెంటనే తన సటకాతో ఒక్క దెబ్బ కొట్టారు. ఆ భయంకర దెయ్యం గట్టిగా అరుస్తూ దెబ్బకి పారిపోయింది. అప్పుడు బాబా డాక్టరుతో ఇలా అన్నారు “ఆ దెయ్యం నీ
కొడుకుని మింగడానికి వచ్చింది. దానికి ఈ రోజు
తిండి దొరకలేదు. నేను పిచ్చిపని చేస్తున్నానని
నువ్వు భావించడం వల్ల ఈ రోజు నేను ఊరి పొలిమేరల్లో పిండిని చల్లలేదు. కాని నేను దానిని నా సటకా దెబ్బతో తరిమివేసాను. ఇక ఆమె నీ కొడుకుని బాధించదు.” తండ్రి కొడుకులిద్దరూ బాబా వారి అపారమైన కరుణకి,
ఆయన సర్వజ్ఞతకి ఎంతో విస్మయం చెందారు. మరుసటి
రోజు వెళ్ళడానికి బాబా వారికి అనుమతిని ప్రసాదించారు.
(మరికొన్ని వైభవాలు ముందు ముందు)
(సర్వం
శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment