07.09.2016 బుధవారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయిబాబావారి
బోధనలు మరియు తత్వము
ఆంగ్లమూలం
: లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి. నింబాల్కర్
తెలుగు
అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు
11. అహింస – 2వ.భాగం
ఆవిధంగా
సాయిబాబా అహింస అనే మాటకి
అసలయిన అర్ధాన్ని మనకందరికీ తెలియచేశారు. ఆయన
ఏమి సలహా ఇచ్చారో చూడండి
---
“ఏదయిన
సంబంధము లేనిదే ఎవరూ ఇంకొకరి వద్దకు
పోరు. ఎవరుగాని,
యెట్టి జంతువు గాని నీవద్దకు వచ్చినచో
నిర్ధాక్షిణ్యముగా వానిని తరిమి వేయకుము. వానిని సాదరముగ చూడుము.
దాహము
కలవారికి నీరిచ్చినచో, ఆకలితో ఉన్నవారికి అన్నము పెట్టినచో, బట్టలు లేనివారికి బట్టలిచ్చినచో, నీఇంటి వసారా ఇతరులు కూర్చొనుటకు
విశ్రాంతి తీసుకొనుటకు వినియోగించినచో నిశ్చయముగా భగవంతుడు ప్రీతి చెందును. ఎవరయినా
నీవద్దకు ధనసహాయము కోరివచ్చినచో నీకిష్టము లేనిచో నీవు ఇవ్వనక్కరలేదు.
కాని వారిపై కుక్కలా మొఱగవద్దు.
అధ్యాయము
– 19
“ఇతరులు
నిన్నెంతగా వందలమాటలతో కఠినముగా నిందించినను, మరలా వారికి బాధ
కలిగేలా జవాబివ్వకుము. అట్టివానిని
నీవెల్లపుడు ఓర్చుకొనినచో నిశ్చయముగా నీకు సంతోషము కలుగును.”
అధ్యాయము
– 19
“ఎవరయితే
ఇతరుల ఎడల పనికిరాని ఆక్షేపణలు
చేసి, నిందించుదురో వారు నన్ను హింసించినవారగుదురు. ఎవరయితే
బాధలననుభవించెదరో, ఓర్చుకొందురో వారు నాకు ప్రీతిని
కల్గించెదరు.”
అధ్యాయము
– 44
బాబా
చాలా యదార్ధంగా ఈ విషయాలన్ని చాలా చక్కగా చెప్పారు. కఠినమయిన
మాటలు ఎదటివారి మనసులో పదునయిన బాణాలుగా గ్రుచ్చుకుంటాయి. వాటిని
ఇక ఎప్పటికీ బయటకు తీయడం సాధ్యం
కాదు.
సాయిబాబా
జంతువులను, పక్షులను ఎంతగా ప్రేమించేవారో మనకు
తెలుసు. సాయిబాబా
ప్రతిరోజూ భిక్షకు వెళ్ళేవారు. ఆవిధంగా
భిక్షలో లభించిన పదార్ధాలన్నిటిని, మసీదులోనున్న ఒక మట్టిపాత్రలో వేసేవారు.
అందులోని
పదార్ధాలను కుక్కలు, పిల్లులు, కాకులు విచ్చలవిడిగ తింటూ ఉండేవి. బాబా వాటినెప్పుడు తరిమివేసేవారు కాదు. మసీదు
తుడిచి శుభ్రము చేసే స్త్రీ 10 – 12 రొట్టెముక్కలను
నిరాటంకంగా తీసుకొంటూ ఉండేది.
అధ్యాయము – 8
అదేవిధంగా
ఆకలితో ఉన్న ఒక కుక్కకు
రొట్టెముక్కను పెట్టి దాని ఆకలితీర్చిన తర్ఖడ్
భార్యను సాయిబాబా ఎంతగానో మెచ్చుకొన్నారు.
“ఎల్లప్పుడు
ఈవిధముగానే చేస్తూఉండు. నీకు
సద్గతి కలుగును. ఈమసీదులో
కూర్చుండి నేనెన్నడు అసత్యమాడను. నాయందిట్లే
దయ యుంచుము. మొదట
ఆకలితోనున్న జీవికి అన్నము పెట్టిన పిమ్మట నీవు భుజింపుము.
దీనిని జాగ్రత్తగా జ్ఞప్తియంధుంచుకొనుము.”
అధ్యాయము
– 9
1917 వ.సంవత్సరంలో
జరిగిన సంఘటన … ఒక పిచ్చికుక్క ఒక
చిన్న కుక్కపిల్లను కరవడంతో, ఆచిన్న కుక్క పెద్దకుక్కలను తరమసాగింది. గ్రామస్థులు
దుడ్డు కఱ్ఱలతో ఆ చిన్న కుక్కను
తరమసాగారు. అది
వీధులలో పరిగెడుతూ చివరికి ద్వారకామాయిలోకి వచ్చి బాబా ఆశ్రయంకోసం
వచ్చి ఆయన వెనకాల నుంచుంది.
గ్రామస్థులు
: “బాబా,
అది పిచ్చికుక్క. దాన్ని బయటకు తరిమివేయండి.
దానిని చంపేస్తాము.”
బాబా :
“పిచ్చివాళ్ళల్లారా.
బయటకు పొండి. ఈమూగ
జీవిని హింసించి చంపుతారా?”
ఆవిధంగా
బాబా ఆకుక్క పిచ్చిది కాదని నిరూపించి దానిని
రక్షించారు.
విషజంతువులయిన
తేళ్ళు, పాములవంటివాటిని కూడా హింసించవద్దని బాబా
హితబోధ చేశారు. శ్రీసాయి
సత్ చరిత్ర 22వ.అధ్యాయంలో హేమాడ్
పంత్ విషజంతువులను చంపవచ్చునా లేదా అని బాబాని
ప్రశ్నించాడు. అప్పుడు
బాబా ఈవిధంగా జవాబిచ్చారు. “భగవంతుడు
సకల జీవులయందు నివసించుచున్నాడు. అవి
సర్పములు గాని, తేళ్ళుగాని కానిండు. ఈప్రపంచమును
నడిపించు సూత్రధారి భగవంతుడు. సకల
జంతుకోటి పాములు, తేళ్ళతో సహా సకల ప్రాణులు భగవదాజ్ఞను శిరసావహించును. వారి ఆజ్ఞ లేనిదే ఎవరు ఎవరినీ ఏమీచేయలేరు. ప్రపంచమంతయు వానిపై ఆధారపడి యున్నది. ఎవ్వరును స్వతంత్రులు కారు. కాబట్టి మనము కనికరించి అన్ని జీవులను ప్రేమించవలెను. అనవసరమయిన కలహములందు, చంపుటయందు పాల్గొనక ఓపికతో
ఉండవలెను. అందరినీ రక్షించువాడు దైవమే.”
అధ్యాయము – 22
ఆవిధంగా
అహింస గురించి బాబా చేసిన ఉపదేశం అద్వితీయమైనది, అమోఘమైనది. అన్ని జీవులలోను అవి జంతువులయినా, పక్షులయినా అన్నిటిలోను,
భగవంతుడు ఉన్నాడని బాబా తన భక్తులకు ఉధ్భోధించారు.
ఉదాహరణకి
తర్ఖడ్ భార్యతో బాబా ఏమని చెప్పారో చూడండి.
“భోజనమునకు ముందు నువ్వు ఏకుక్కనయితే చూచి దానికి రొట్టెముక్కను పెట్టితివో
అదియు, నేను ఒక్కటియే. నేనే వాని యాకారములో
తిరుగుచున్నాను. ఎవరయితే సకల జీవకోటిలో నన్ను
చూడగలుగుదురో వారే నాప్రియభక్తులు.”
అధ్యాయము – 9
ఒకసారి కాకాసాహెబ్ దీక్షిత్ భావార్ధరామాయణం పఠిస్తూ ఉన్నపుడు, హేమాడ్ పంత్ అక్కడే వింటూ కూర్చున్నాడు. ఆసమయంలో అతని భుజంమీద ఉన్న ఉత్తరీయం మీదకి ఒక తేలు
వచ్చి కదలకుండా కూర్చుని ఉంది. హేమాడ్ పంత్
మెల్లగా అంగవస్త్రాన్ని తీసి దాని చివరలో మూటలా కట్టి ఆతేలును బయట తోటలోకి విసిరేసాడు.
అధ్యాయము – 22
అలాగే
ఒకసారి బాలాపాటిల్ నెవాస్కర్ పశువుల కొట్టంలోనికి ఒక సర్పం ప్రవెశించింది. నెవాస్కర్ ఏమాత్రం భయపడకుండా బాబాయే ఆరూపంలో వచ్చారని
భావించి, ఒక గిన్నెలో పాలను తెచ్చి త్రాగమని ఆసర్పం ముందు ఉంచాడు.
అధ్యాయం – 35
ఇక
అన్ని జీవరాశులలోను బాబా నివస్తిస్తున్నారని భక్తులంతా ప్రగాఢంగా విశ్వసించినట్లయితే
ఏభక్తుడయినా ఏవిధంగానయినా మాంసాహారాన్ని ముట్టడానికి సాహసిస్తాడా?
ఇక్కడ
మనకి ఇంకొక ప్రశ్న ఉదయిస్తుంది. మరి బాబా అహింసా
పధ్ధతిని ఆచరించేవారు కదా! అటువంటప్పుడు ఆయన
తరచూ ఉగ్రరూపం దాలుస్తూ తన భక్తులను తిడుతూ సటకాతో కొడతానని బెదిరిస్తూ వారివెంటబడి
ఎందుకని తరుముతూ ఉండేవారు? దీనికి కారణం ఏమిటంటే
భక్తులు అనవసరంగా తన ప్రశాంతతకు భంగం కలిగించకుండా వారిని ఆపడానికే.
“విషం
లేని పాముకూడా పడగ ఎత్తవలసిందే. అది విషం ఉన్నదయినా,
కానిదయినా సరే పడగ ఎత్తితే ఎప్పుడూ భీతి కొలిపేలా ఉంటుంది.”
అందుచేత
బాబా చూపించే క్రోధం అంతా పైపైన చూపించే నటన మాత్రమే. కాని ఆయనకు తన భక్తులమీద ఎంతోప్రేమ. అది ఆయన హృదయాంతరాళలో నిండి ఉంటుంది.
హేమాడ్
పంత్ బాబా గురించి విశేషంగా చెప్పిన మాటలు – “బాబా ఒక్కొక్కప్పుడు హటాత్తుగా కోపంతో
భక్తులపై నిప్పులు కక్కేవారు. మరొకప్పుడు మైనంకంటే
మెత్తగా, క్షమా శాంతీ మూర్తీభవించినట్లుండేవారు.
వెన్నకంటే సున్నితంగా ఉండేవారు కోపోద్రేకంలో
కళ్ళెఱ్ఱగా చేసినా, ఆయన మనసులో తన భక్తులపై ఎప్పుడూ ప్రేమ ఉప్పొంగుతూనే ఉండేది. క్షణంలో కోపం శాంతించగానే భక్తులను పిలిచి “నేనెవరినైనా
కోప్పడ్డట్లు నాకు గుర్తులేదు. తల్లి బిడ్డను
తరిమేస్తే, సముద్రం నదిని వెళ్లగొట్టితే నేను మిమ్మల్ని నిరాకరిస్తాను. నేను మీహితాన్నే కోరుతాను. నేను భక్తులకు అంకితుణ్ణి. వారి వెన్నంటే ఉంటాను. నేనెప్పుడూ ప్రేమనే కోరుతాను. పిలిచిన వెంటనే పలుకుతాను.” అనేవారు.
అధ్యాయము – 11
(రేపు
సత్ప్రవర్తన)
(సర్వం శ్రీసాయినానాధార్పణమస్తు)
0 comments:
Post a Comment