02.10.2016
ఆదివారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయిబాబా
వారి బోధనలు మరియు తత్వము
ఆంగ్ల
మూలం : లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి. నింబాల్కర్
తెలుగు
అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు
17.
సద్గ్రంధ పఠనమ్ – 2వ.భాగమ్
ఒకవేళ
భక్తులు ఏకారణం చేతనయినా గ్రంధ పారాయణ చేయలేకపోయినట్లయితే, దానికి కారణమయే అడ్డంకులను
తొలగించి వారికి సాయిబాబా సహాయం చేసేవారు.
ధానే
జిల్లా మామలతదారయిన బాలాసాహెబ్ దేవ్ ఎంత కష్టపడి ప్రయత్నించినా ‘జ్ఞానేశ్వరి’ చదవలేకపోయేవాడు. దానివల్ల సాయిబాబా ఆజ్ఞాపిస్తే తప్ప చదవకూడదని నిర్ణయించుకున్నాడు. ఆ తరువాత అతను బాబా దర్శనానికి షిరిడీ వెళ్ళినపుడు
నా గుడ్డపీలికలను ఎందుకురా దొంగిలిస్తావు అని తిట్టి అతనిని కోపంతో కొట్టబోయారు. కాని బాబా తిడుతున్నంతసేపు దేవ్ మవునంగా బాబా తిట్టే
తిట్లని, నిందలని భరిస్తూ వాటిని బాబా తనపై కురిపిస్తున్న పూలజల్లులలాగ భావించాడు.అవి
నిజానికి బాబా తిట్లు కావు. దేవ్ కు జ్ఞానేశ్వరిని
చదవడంలో కలిగే ఇబ్బందులని తొలగించారు. ఆ తరువాత
బాబా శాంతించి దేవ్ ను దగ్గరకు పిలిచి, దీక్షిత్ వాడాలో కూర్చుని జ్ఞానేశ్వరిని ప్రతిరోజు
క్రమం తప్పకుండా పారాయణ చేయమని చెప్పారు. అంతేకాదు
జ్ఞానేశ్వరిని చదువుతూ తను చదివినదానికి అర్ధాన్ని ఇతరులకి కూడా వివరించి చెప్పమన్నారు. ఆవిధంగా బాబా, దేవ్ కు ప్రతిరోజూ జ్ఞానేశ్వరిని
చదవాలనే కోరికను తీర్చడమే కాక, ఏవిధంగా చదవాలో బోధించారు. అంతేకాదు, కొంతకాలం తరువాత దేవ్ కు కలలో కనిపించి
అతను ఏవిధంగా చదువుతున్నాడో పరిశీలించి తప్పులు సరిదిద్దారు. అతను చదువుతున్న పధ్ధతిని గమనించి “నువ్వు పుస్తకం
చదివేటప్పుడు చాలా తొందరగాను. ఆతురతతోను చదువుతున్నావు. ఇపుడు నాదగ్గరగా కూర్చో. ఏదీ ఇప్పుడు నాముందు చదువు. ఎలా చదువుతున్నావో చూస్తాను” అని చదివేటప్పుడు తొందరపనికిరాదని,
చదువుతున్న విషయాన్ని అర్ధం చేసుకుంటూ నెమ్మదిగా చదవాలని వివరించి చెప్పారు.
అధ్యాయం – 41 (ఓ.వి. 164)
బాబా
తన భక్తులపై ఎంతటి ప్రేమ శ్రధ్ధ కనపర్చేవారో కదా!
సాధారణంగా
మానవుడు చివరికి కోరుకునేది ముక్తి, మోక్షము.
ఇదెలా సాధ్యమంటే క్రమం తప్పకుండా ఆధ్యాత్మిక గ్రంధాలను పఠిస్తూ ఉండాలి. వాటిలోని విషయాలన్నీ అర్ధం చేసుకొని ఆచరణలో పెట్టాలి. ఊరికే చదివేసామన్న పేరుకు చదువుతే ఎటువంటి ప్రయోజనం
లభించదు. మోక్షసాధనకు మనకు ఉపయోగపడేవి సద్గ్రంధాలే. చదవదలచుకున్న గ్రంధాన్ని మొట్టమొదటగా గురువుకు సమర్పించి,
ఆతరువాత దానిని ఆయన ఇచ్చిన ప్రసాదంగా స్వీకరించి పఠిస్తే మరింత ఫలితం ఉంటుందని భక్తుల
నమ్మకం.
భక్తుల నమ్మకంలో కొంత అర్ధం ఉంది. ఎటువంటి అనుమానం లేదు. కాని చదివేటప్పుడు నమ్మకంతోను, మిక్కిలి శ్రధ్ధతోను
చదవాలి. 21వ.అధ్యాయంలో పూనా నివాసి అయిన అనంతరావు
పాటంకరే ఉదాహరణ. అతను వేదాలు, ఉపనిషత్తులు
బాగా అధ్యయనం చేశాడు. అయినా గాని అతని మనస్సుకు
శాంతిలేదు. అతను సాయిబాబా దర్శనం చేసుకోవడానికి
షిరిడీ వచ్చాడు. అప్పుడు బాబా అతనికి ఒక వర్తకుని
కధ చెప్పారు. “ఒకనాడొక వర్తకుడు ఇక్కడకు వచ్చాడు. ఆతని ముందు ఒక ఆడ గుఱ్ఱము లద్దె వేసింది. అది తొమ్మిది ఉండలుగా పడింది. జిజ్ఞాసువయిన ఆ వర్తకుడు పంచెకొంగు సాచి తొమ్మిది
ఉండలను అందులో పెట్టుకొన్నాడు. ఈవిధంగా అతడు
మనస్సును కేంద్రీకరించగలిగాడు.” (ఇక్కడ తొమ్మిది గుఱ్ఱపు లద్దెలనగా నవవిధ భక్తులు).
“వేదాలు,
ఉపనిషత్తులు చదివినా భగవంతుని నామాన్ని నిరంతరం ఉఛ్ఛరిస్తున్నా, భజనలు, తపస్సు చేసినా,
మొక్కులు మ్రొక్కుకున్నా, యోగాభ్యాసం చేసినా, తనకు లభించిన జ్ఞానంతో భగవంతుని గురించి
చర్చించినా భక్తి లేకుండా చేసినట్లయితే అవన్నీ నిష్ప్రయోజనమే.
అదేవిధంగా
ఒకసారి గురుపూర్ణిమనాడు, ఇండోర్ జడ్జి అయిన శ్రీ ఎమ్.బి.రేగే, బాబా భక్తులందరూ ఆధ్యాత్మిక
గ్రంధాలను బాబా దగ్గరకు మోసుకుని వెడుతూ ఉండటం చూశారు. వారు ఆగ్రంధాలని బాబాకు సమర్పించి, ఆతరువాత వాటిని
ఆయన ఆశీస్సులతో ప్రసాదంగా స్వీకరించి చదువుకోవడానికి. రేగే తాను కూడా గ్రంధాన్ని తీసుకురానందుకు చాలా
విచారించాడు. బాబా ఆవిషయం గ్రహించి, రేగేతో
“ఈపుస్తకాలలో వారంతా ప్రరబ్రహ్మాన్ని (భగవంతుని) వెదుకుదామనుకుంటున్నారు. నీనిర్ణయం సరైనదే. పుస్తకాలు చదవద్దు. నన్ను నీహృదయంలో నిలుపుకో. నీఆలోచనలని మనస్సుని లయం చెయ్యి. అది చాలు.” అన్నారు. భక్తుల అనుభవాలు
– H.H. నరసింహ స్వామీజీ Part I
ఊరికే
చదివామన్న పేరుకు పుస్తకాలు చదివితే సరిపోదు.
“భక్తి లేకుండా భగవంతుడిని పూజిస్తే ఉపయోగం ఏముంటుంది? అలాగే అర్ధం చేసుకోకుండా పుస్తకాలు చదివినంతమాత్రాన
ఎటువంటి ప్రయోజనం సిధ్ధించదు” అని హేమాడ్ పంత్ ఈ సందర్భంగా చెప్పారు. (ఓ.వి. 204)
అధ్యాయం – 14
మొదట
గ్రంధాన్ని చదవాలి. తరువాత దానిని మననం చేయాలి. మరలా మరలా చదవాలి. అందులోని విషయాలను అవగాహన చేసుకొని జీర్ణించుకోవాలి. అపుడే అవి మన మనస్సుకు బలంగా నాటుకుంటాయి.” (ఓ.వీ.71)
కేవలం
పుస్తకం చదివితే సరిపోదు. దానిలో బోధించిన
విషయాలను ఆచరణలో పెట్టాలి. లేకపోతే బోర్లించిన
కుండమీద నీళ్ళు గుమ్మరించినట్లవుతుంది.
అధ్యాయం
- 21 (ఓ.వి. 72)
ఈ
సందర్భంగా 21వ.అధ్యాయంలో రెవిన్యూ అధికారయిన శ్రీవినాయకరావు ఠాకూర్ అనుభవాన్ని తెలుసుకోవాలి. ఒకసారి అతను బెళగాం సమీపంలో ఉన్న వడ్ గాం పట్టాణానికి
సర్వేపార్టీతో వచ్చాడు. అక్కడ ‘అప్ప’ అనే కన్నడయోగిని
దర్శించుకునే అవకాశం లభించింది. ఆయన అతనిని
ఆశీర్వదిస్తూ నిశ్చలదాసు రచించిన ‘విచారసాగర’మనే వేదాంత గ్రంధాన్ని బహూకరించి, “ఈ పుస్తకాన్ని
నీవు చదవాలి. నీవట్లు చేసినచో నీకోరికలు నెరవేరును. ముందు ముందు నీ ఉద్యోగమునకు సంబంధించిన పని మీద
ఉత్తర దిక్కునకు పోయినప్పుడు నీఅదృష్టవశమున నీకొక గొప్ప మహాత్ముని దర్శనము కలుగును. వారు నీభవిష్యత్తునకు మార్గమును చూపెదరు.నీమనసుకు
శాంతిని ప్రసాదిస్తారు” అని దీవించారు.
(ఓ.వి. 33 నుంచి 35)
ఆయన
మాటలు నిజమయి ఠాకూర్ షిరిడీ వెళ్ళి సాయిబాబాను దర్శించుకునే భాగ్యం కలిగింది. అపుడు బాబా “ఇచ్చటి మార్గము అప్పా బోధించిన నీతి
వాక్యాలంత సులభం కాదు. నాన్హేఘాటులో ఎనుబోతు
మీద సవారీ చేయటంకంటె కష్టము. ఈ ఆధ్యాత్మ మార్గం
చాలా కష్టతరమయినది. దీనికి ఎంతో కృషి చేయాలి”
అన్నారు.
(ఓ.వి. 62)
ఆవిధంగా
ఒక భక్తుని కోసం నిశ్చలానంద వ్రాసిన విచారసాగరమనే పుస్తకం వడగావ్ లో సూచించబడింది. గ్రంధాన్ని చదివిన ఆభక్తునికి తరువాత ఏమిచేయాలన్నది
షిరిడీలో తెలియచేయబడింది.
సాయిబాబా
తన భక్తులకి ఆధ్యాత్మిక గ్రంధాలను చదవమని, శ్రవణం చేయమని చెప్పేవారు. గ్రంధాలను చదివేటప్పుడు కలిగే అవరోధాలను తొలగించేవారు. గ్రంధం చదివేటప్పుడు తొందర పనికిరాదని, చదివేదాన్ని
అర్ధం చేసుకుంటూ మెల్లగా చదవాలని చెప్పేవారు.
వారు ఆవిధంగా ఆచరించేలా వారికి తగిన సూచనలు కూడా చేసేవారు. అప్పుడే చదివేవానికి దానియొక్క ప్రయోజనం సిధ్ధిస్తుంది. చదువుతున్నపుడు పూర్తి నమ్మకంతోను, భక్తితోను చదవాలి. అవేమీ లేకుండా చదివితే చదువుతున్నదంతా గందరగోళంగాను,
అస్పష్టతగాను అయి సమయమంతా వృధాకావడం తప్ప ఫలితం లేదు.
(తరువాతి
అధ్యాయం గురుభక్తి)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment