14.10.2016
శుక్రవారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయిబాబావారి
బోధనలు మరియు తత్వమ్
ఆంగ్లమూలం
: లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి. నింబాల్కర్
తెలుగు
అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
19. జ్యోతిష్య శాస్త్రం – 1వ.భాగమ్
ఈ
రోజుల్లో వివాహాలు కుదుర్చుకోవడానికి మొట్టమొదటగా జాతకాలకి అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ముఖ్యంగా పెళ్ళికుమారుని తరఫునించి జాతకాలు అడగడం
ఎక్కువగా ఉంది. పెళ్ళిచూపుల తరువాత అమ్మాయి అన్ని విధాలా తగినట్లుగా ఉన్నా జాతకాలు, చక్రాలు పరిశీలించడం, ఆ తరువాత బుధుడు ఒక ప్రత్యేకమయిన
ఇంటిలో ఉన్నాడనీ, ఇంకా అమ్మాయి జాతకం కొన్ని విషయాలలో నప్పటల్లేదని,
ఇటువంటి కారణాలతో తిరస్కరించడం జరుగుతోంది.
అమ్మాయి బాగున్నా జాతకరీత్యా సరిపోలేదనే కారణం వల్ల సంబంధాలు కురుర్చుకోలేకపోతున్నారు. అదేవిధంగా రాజకీయనాయకులు కూడా ఎన్నికల సమయంలో నామినేషన్
వేయడానికి, ఆ తరువాత క్రొత్తగా మంత్రులయినవారంతా ప్రమాణస్వీకారం చేయడానికి సరియైన తేదీ,
సమయం నిర్ధారించుకోవడానికి జ్యోతిష్కులను సంప్రందించడం జరుగుతోంది.
నిజానికి
ఈరోజుల్లో జ్యోతిష్యానికి అంత ప్రాముఖ్యం ఇవ్వడం సరైన పద్ధతి కాదు. మొట్టమొదటగా చెప్పాలంటే మిగతా విజ్ఞానశాస్త్రాలతో
(సైన్స్) పోలిస్తే జ్యొతిష్యశాస్త్రం మీద తగినంతగా పరిశోధన, అధ్యయనం అంత శ్రధ్ధగా జరగలేదు. అందుచేత ఈ మధ్యన అనగా ఇటీవలి కాలంలో జ్యోతిష్యశాస్త్రం
అంతగా అభివృధ్ధి చెందలేదు. అంతే కాకుండా జ్యోతిష్య
ఫలితాలకు కూడా ఒక పరిమితి ఉంది --- ఏజ్యోతిష్కుడయినా సరే తాను 99 శాతం వరకు భవిష్యత్తు
చెప్పగలననే విషయాన్ని కాదనలేడు. కాని, మిగతా
ఒక్కశాతం భగవంతుని దయమీదనే ఆధారపడి ఉందని, ఏదయినా జరగచ్చనే చెబుతాడు.
ఇక
రెండవది ఈ జ్యోతిష్యం అనేది పెద్ద వ్యాపారంగా మారిపోయింది. ఎంతోమంది జాతకాలు చెబుతామని డబ్బు దోచేసే దగాకోరులున్నారు. ప్రతివాడు సుఖాలని, సంతోషాలని కోరుకుంటాడే కాని,
కష్టాలను, బాధలను, రోగాలను, దురదృష్టాలను కోరుకోరు. అది చాలా సహజమయిన విషయమే. కాని వాటినుంచి అనగా కష్టాలనుండి, బాధలనుండి పూర్తిగా
తప్పించుకోవడం సాధ్యమేనా? అది అసాధ్యమని తెలిసినా
కూడా ప్రతివాడు వాటినుంచి ఎలా బయటపడాలా అని దారులు వెతుకుతూనే ఉంటారు. ప్రజలలోని ఈ బలహీనతలనే జ్యోతిష్కులు
అటువంటివారిని తమకు అనుకూలంగా మార్చుకుని నివారణోపాయాలు చెపుతామని డబ్బు గుంజుతారు.
జ్యోతిష్కులు
తమ దగ్గరకు జాతకచక్రం చూపించుకోవడానికి వచ్చేవారి చేతులను చూసి రేఖలను చూస్తారు (హస్త సాముద్రికం). తరువాత వారికి వచ్చిన కష్టాలు, రోగాలను గురించి
ప్రత్యేకంగా చెప్పి, నీ గ్రహస్థితి బాగాలేదు, కనుకనే ఇన్ని కష్టాలను అనుభవిస్తున్నావని
చెప్పి వారి నమ్మకాన్ని చూరగొంటారు. ఆతరువాత
ఆబాధలు పోవాలంటే గ్రహశాంతులు చేయించాలని, హోమాలు, మంత్రోచ్చారణలతో పూజలు చేయించాలని
అధిక మొత్తంలో డబ్బులు గుంజుతారు. అంతకన్నా నివారించే మార్గాలు ఇంకేమీ లేవని చెబుతారు.
జ్యోతిష్యంలో
అంత నమ్మకం ఉన్నవాడయితే , ఆధ్యాత్మిక గ్రంధాలలో
చెప్పబడిన గ్రహశాంతులకు చేయవలసిన పద్ధతులు పూజలు తానే స్వయంగా తెలుసుకుని చేయవచ్చు. ఉదాహరణకి ఏలినాటి శని దోషనివారణకు శనీశ్వరునికి
గాని, హనుమంతునికి కాని ప్రీతి కల్గించే ధ్యాన శ్లోకాలు, పూజలు, వ్రతాలు మరియు ధార్మిక
సేవలు చేసి (అనగా అన్నదానం వగైరా) మనం కోరుకున్న ఫలితాలను పొందవచ్చు. కాని మనం డబ్బు విచ్చలవిడిగా ఖర్చుపెట్టి శాంతిహోమాలు,
మంత్రోఛ్చాటనలు చేయించినా, చేసేవారు సరిగా చేయవలసిన పద్ధతిలోను, పరిపూర్ణంగాను చేశారో
లేదో మనకు రూఢిగా తెలియదు. అటువంటప్పుడు మనం
అనుకున్న ఫలితాలు వస్తాయనే గ్యారంటీ ఏమీ లేదు.
అంతేకాదు,
ఇక్కడ మనం ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి.
మనం అన్నీ అనుకున్నట్లు సరిగా శాస్త్రోక్తంగా చేయించేవారు దొరికినా వాటికి సంబంధించిన
వస్తు సామాగ్రి మనకు కల్తీ లేనివే దొరుకుతున్నాయా? ఉదాహరణకి ఆవునెయ్యి. కల్తీలేనిది స్వచ్చమయినది ఉపయోగిస్తున్నామా? అలాగే ఆవుపాలు. దొరకకపోతే టెట్రాప్యాక్ లు వాడేస్తూ
ఉంటాము. ఎందులో ఎంత నిజాయితీ ఉందో మనకు తెలీదు. ఆవు దగ్గరకు వెళ్ళి పాలు పితికించుకుని తాజాగా తెచ్చుకున్నా
పాలవాడు కాస్తయినా నీళ్ళు కలపకుండా స్వఛ్చమయినవి ఇవ్వడు.
ఇప్పుడు
ప్రజలందరికీ ఉన్న ఒకవిధమయిన మోజు అనుకోండి, ఇంకేదయినా అనుకోండి, అదే వార్తాపత్రికలలో
వారఫలాలు చూసుకోవడం. తను పుట్టిని తేదీని బట్టి,
జన్మనక్షత్రాన్ని బట్టి వారఫలాలు దినఫలాలు చూసుకోవడం. చాలా మంది వార్తా పత్రికలలోను,
వారపత్రికలలోను రాసినదాని ప్రకారం సంతోషించడమో, విచారించడమో చేస్తూ ఉంటారు. వాస్తవంగా ఒకే రాశికి ఒకే సమయానికి రాయబడ్డ ఫలితాలను
రెండు వేరువేరు పత్రికలలో పరిశీలించినపుడు రెండూ ఒక్కలాగే ఉండవు. రెండిటికీ చాలా తారతమ్యం ఉంటుంది. ఏరోజు కూడా ఒక్కలా ఉండవనే విషయం మనం గమనించవచ్చు. అసలయిన జ్యోతిష్యపండితుడు కూడా ఏఒక్కరి జాతకం రాశిని
బట్టి, చక్రం వేసి ఆడవారిది గాని మగవారిది కాని నిక్కచ్చిగా చెప్పలేమని చెబుతారు. ఒక్క రాశి చక్రం చూసి చెబితే చాలదు. జాతకం చూడాలంటే ఇంకా ఎన్నో విషయాలను పరిశీలించాలి. జాతక చక్రం, ఇతర గ్రహాలయొక్క ప్రభావం, ఇంకా దగ్గరి
బంధువులు అనగా భార్యది గాని భర్తది గాని (అనగా భార్యకు భర్తది, భర్తకు భార్యది) కూడా
పరిశీలించి నిర్ణయించవలసి ఉంటుంది.
ఇంతవరకు
మనం జ్యోతిష్యాన్ని తర్క దృష్టితోనే చూశాము.
ఇపుడు శాస్త్రీయ దృక్పధంతో ఆలోచించి పరిశీలిద్దాము. నిజం చెప్పాలంటే ప్రతి మానవుడు తాను పూర్వజన్మలో
చేసిన పాప పుణ్యాలను బట్టే విధి నిర్ణయించిన ప్రకారం ఈజన్మలో కర్మఫలాన్ని అనుభవించాల్సి
ఉంటుంది. ఆఖరికి ముక్తి, మోక్షాన్ని పొందినవాడు
కూడా ఆకర్మఫలాన్నుండి తప్పించుకోలేడు. జ్యోతిష్యశాస్త్రం
గాని, హస్త సాముద్రికం గాని సూచనలు మాత్రమే ఇవ్వగలుగుతాయి. భగవంతుడు మానవునికి ఏదిమంచి ఏదిచెడు అని తెలుసుకునే
జ్ఞానాన్ని, శక్తిని ప్రసాదించాడు. తనకు ప్రసాదింపబడ్డ
జ్ఞానంతో కనీసం మంచి పనులు చేసి, వచ్చే జన్మలోనయినా మంచి భవితవ్యం పొందేందుకు తగిన
పునాదులు ఏర్పరుచుకోవచ్చు. ఈప్రాపంచిక జీవితంలో
సుఖదుఃఖాలు అందరికీ సహజమే.
అందుచేత కష్టాలు
చుట్టుముడుతున్నాయని వగచి వాటినుంచి బయటపడదామని చేసే ప్రయత్నాలు శుధ్ధ దండగ. గ్రహశాంతుల కోసం జ్యోతిష్యపండితులకు గాని, బ్రాహ్మల చేత చేయించే మంత్రోచ్చాటనలకి గాని
విపరీతంగా డబ్బు ఖర్చు చేయడం అనవసరం. దానికి
బదులుగా వివేకంతో వేరే మార్గమేదయినా ఉందా అని ఆలోచించుకోవాలి.
ఒకవేళ
తప్పించుకోలేనివి, అనుభవించక తప్పనివి అయినట్లయితే స్వామి సమర్ధ చెప్పినట్లుగా ధైర్యంతో
వాటిని సంతోషంగా ఇష్టపూర్వకంగా అనుభవించాల్సిందే.
(ఇంకా
ఉంది జాతకం)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment