18.12.2016
ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
గత
వారం రోజులుగా కొన్ని స్వంత పనులవల్ల ప్రచురణకి అంతరాయం కలిగింది. ఈ రోజు సాయి బంధు
శ్రీసాయి సురేష్ గారు పంపించిన అనుభవాలలో మరొక అనుభవమ్ యధాతధంగా ప్రచురిస్తున్నాను.
సాయి
భక్తుల అనుభవాలు – బాబా తన భక్తురాలికి తానే ప్రసాదం పంపిన లీల
@@@
బాబా
తన భక్తురాలికి తానే ప్రసాదం పంపిన
అద్భుత లీల(ఇందిర గారి
అనుభవాలు)
అఖిలాండకోటి
బ్రహ్మండనాయక రాజాధి రాజ యోగిరాజా పరబ్రహ్మ
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహారాజ్ కి జై
సాయి
బంధువులకు బాబా వారి ఆశీస్సులు
విజయవాడ
వాస్తవ్యులు శ్రీ ఇందిర
గారు తమ కుటుంబంలో జరిగిన
మూడు బాబా లీలలను saileelas.com ద్వారా సాయి
బంధువులతో పంచుకోవడానికి నాకు వాట్సప్ లో
పంపించారు. వారికి బాబా వారి ఆశీస్సులు
సదా ఉండాలని బాబా వారిని కోరుకుంటున్నాను.
ఇక చదివి ఆనందించండి.
మా పెద్దమ్మాయి
పేరు రేవతి. డిగ్రీ ఫస్ట్ ఇయర్
లో ఉండగా
మా అమ్మాయి స్నేహితురాలు కుటుంబంతో
షిరిడి వెళ్ళింది.
బాబా దర్శనం చేసుకుని
బయటకు వస్తుంటే ఒక పూజారి
గారు ఆ అమ్మాయిని పిలిచి ఒక ఆరంజ్
రంగు తాడు, ప్రసాదం ఇచ్చి మీ ఫ్రెండ్ రేవతి కి ఇవ్వమని ఇచ్చారట. ఆ అమ్మాయి
షిర్డీ నుండి వచ్చాక మా అమ్మాయికి ప్రసాదం, తాడు ఇచ్చి మీకు షిరిడిలో చుట్టాలు ఉన్నారా అని అడిగింది. మా
అమ్మాయి మాకు షిర్డీలో
తెలిసిన వారు ఎవరు లేరు అని చెపితే,
ఆ అమ్మాయి ఏమో నాకు
తెలియదు పూజారి గారు
ఈ తాడు, ప్రసాదం మీకు ఇచ్చి అడిగానని
చెప్పమన్నారు అని చెప్పింది. మా అమ్మాయి ప్రసాదం తెచ్చి
నాకు ఇచ్చి,
ఆ విషయం అంతా చెప్పింది.
నేను మా అమ్మాయితో ఆ
రూపంలో బాబాగారు ఆరంజ్ తాడు, ప్రసాదం
నీకు పంపించారు అని, ఆతాడు మా అమ్మాయి చేతికి కట్టి ప్రసాదం అందరమూ
తీసుకున్నాము. ఈ సంఘటన 2003లో
జరిగింది అనుకుంటా. ఈ అమ్మాయికి బాబా
కనబడుతుంటారు. ఏదైనా ఆడిగితే సమాధానం
చెపుతుంటారు.
2003వ సంవత్సరంలో నెల
గుర్తు లేదు ఒక రోజు
చపాతీలు చేసి బంగాళదుంప కూర
చేసి స్టౌ ప్రక్కన పెట్టాను.
రాత్రి 8 గంటలకి, మా రెండవ అమ్మాయి
ఇంకా స్కూల్ నుండి రాలేదు వచ్చాక
అందరమూ తినవచ్చు అని కూర్చున్నాము. మా
అమ్మాయి వచ్చాక తిందామని చూస్తే పైన
ఉన్న చపాతీ కొంచం తుంచి
ఉంది.
ప్రక్కన ఉన్న కూర
మధ్యలో కొంచం తీసినట్టుగా ఉంది.
నాకు అర్థంకాక పిల్లల్ని అడిగా మీరెవరన్నా తిన్నారా
అని. వాళ్ళు
లేదు అని చెప్పారు.
తరువాత మా అమ్మాయికి
బాబా నేనే తిన్నానని చెప్పారు.
మా ఫాదర్, మదర్ కాశి వెళ్లినప్పుడు అక్కడ పండుగాని, కూరగాయగాని
ఏదో ఒకటి వదిలిపెట్టాలని, మా నాన్న గారు జామకాయ వదిలి వచ్చేసారు. తరువాత వాళ్ళకి షుగర్ వచ్చింది. షుగర్ వాళ్ళు తినే ఫ్రూప్ట్స్ ఏముంటాయి. జామకాయ తప్ప ఏమి తినకూడదు. మా మదర్ మా అమ్మాయిని బాబాని అడగమన్నారు జామకాయ
తినోచ్చేమో అని. కాశిలో
వదిలారు అది ఎలా కుదురుతుంది అని
బాబా చెప్పారు
. తరువాత రెండు రోజుల తరువాత నాకు ఎవరో పెద్ద జామకాయ ఇచ్చారు. నేను దానిని కడిగి బాబాకి నైవేద్యంగా
పూజలో పెట్టాను.
నేను టీచర్
గా పని చేసేదానిని. నేను స్కూల్ కి వెళ్లి సాయంత్రం వచ్చి చూస్తే పూజలో జామకాయ లేదు. నేను పిల్లలు తిన్నారేమో అనుకుని
ఊరుకున్నాను. మేము కాలనీలో ఉంటాం.
మా వెనుక లైన్లో మా మదర్ వాళ్ళు ఉంటారు
. సాయంత్రం 6గంటలకి
నన్ను మా మదర్ పిలిచి వాళ్ళ
ఇంటిలో దేవుడి దగ్గర ఒక కవర్ లో జామకాయ పెట్టి ఉందని చూపించారు. అవి నేను బాబాకి నైవేద్యం పెట్టిన
జామకాయ, పక్కన నేను
పడేసిన నల్లని కవర్. అప్పుడు
అర్ధమైంది మా మదర్
జామకాయ తినవచ్చా, లేదా అని బాబాని అడిగారు కదా!
దానికి సమాధానంగా బాబా ఆ
జామకాయ ను మా ఇంట్లో మాయం చేసి మా మదర్
వాళ్ళ ఇంట్లో పెట్టి తినవచ్చని
సూచించారు.
మా పెద్దమ్మాయి పెళ్లికి మొదటి శుభలేఖ బాబాకి ఇంట్లో పూజలో పెట్టి పెళ్లికి రమ్మని పిలిచాను. పెళ్లిలో
మేము బిజీగా ఉన్న
సమయంలో ఒక ఆవిడ వచ్చి మా అమ్మగారితో నాకు భోజనం పెడతారా అని అడిగారు. మా అమ్మగారు
తీసుకువెళ్ళి భోజనం పెట్టించారు. ఆవిడ తింటూ నావంక చూస్తూనే వున్నారట నేను గమనించలేదు. తరువాత మా అమ్మగారు
ఆ రూపంలో బాబానే వచ్చారని
చెప్పారు. ఆవిడ
కళ్ళు నీలంగా
ఉన్నాయట. ఆయన వస్తే గుర్తుపట్టలేదు అని.
సర్వం
సాయినాధార్పాణమస్తు
(సర్వం
శ్రీసాయినాధార్పణమస్తు)
1 comments:
sai ram. thanks thyagaraju garu. manisha garu blog lo rasinattu sai nama japam start chesanu ninna. ma bavagaru ninna tirupati prassadam techaru valla office lo evaro icharani. sai ram sai ram sai ram
Post a Comment