01.01.2017 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి బంధువులందరికీ నూతన సంవత్సర
శుభాకాంక్షలు
శ్రీ షిరిడీసాయి వైభవమ్
తన భక్తుని బాధను బాబా అనుభవించుట
నూతన సంవత్సరం కాబట్టి బాబా
గారి గురించి ఒక్కటయినా ప్రచురిద్దామనుకున్నాను.
కాని వ్యక్తిగత పనులవల్ల
సమయం దొరకలేదు.
ఇప్పుడు ప్రచురిస్తున్నది కాస్త చిన్నదయినా ఇందులో బాబా చూపించిన మహత్యం
అద్భుతం. బాబా తన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలిగినా వాటిని
నివారిస్తూ ఉండేవారు. ఆఖరికి
ఒక్కొక్కసారి తన భక్తులకు వచ్చే అనారోగ్యాలను కూడా ఆయన స్వీకరించి తన భక్తులను కాపాడేవారు. అంతే
కాదు ఆయన చేసే వైద్యం కూడా చాలా విచిత్రంగా
ఉండేది. అటువంటి సంఘటన గురించి ఈ రోజు
తెలుసుకుందాము. బాబా తన భక్తులపై చూపించే ప్రేమకు సాటి మరొకటి లేదు.
1915 వ.సంవత్సరంలో బాపూసాహెబ్
బుట్టీ 105 డిగ్రీల జ్వరంతో బాధ పడ్డాడు. జ్వర
తీవ్రత వల్ల బాగా
నీరసించిపోయి బాబా దర్శనానికి ద్వారకామాయికి కూడా వెళ్ళలేకపోయాడు. బాబా అతనిని ఎవరి
సహాయంతోనైనా రమ్మని కబురు పంపించారు. నీరసంగాఉన్నా బుట్టీ మరొకరి సహాయంతో బాబావద్దకు
వచ్చాడు. బాబా అతనిని కూర్చోమని చెప్పి పాయసం, బజ్జీలు, పప్పు, ఉసల్ (మహారాష్ట్ర వంటకం) అతని
ముందు ఉంచారు. ఆపదార్ధాలన్నిటినీ తన సమక్షంలో తినిపించారు. భోజనం అయిన వెంటనే బుట్టీని తన
బసకు తిరిగి వెళ్ళి
విశ్రాంతి తీసుకోమన్నారు. ఎటువంటి మందులు వాడకుండానే అతని జ్వరం తగ్గిపోయింది.
అదే సమయంలో బాబాకు జ్వరం వచ్చింది. కాని బుట్టీకి నయమవగానే బాబాకు కూడా జ్వరం తగ్గిపోయింది.
ఆవిధంగా బాబా బుట్టీకి వచ్చిన జ్వరాన్ని తాననుభవించి
బుట్టీకి నయం చేశారు.
(ఉసల్ తయారీ యూ ట్యూబ్ లింక్ లో చూడండి)
https://www.youtube.com/watch?v=Qzh6q1AQZhU
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment