15.02.2017
బుధవారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
భగవంతుని
గురించి సాయిబానిస ఆలోచనలు – 2 వ.భాగమ్
సంకలనం
: ఆత్రేయపురపు త్యాగరాజు - దుబాయి నుండి
16. భగవంతునికి మంత్రాలతో చేసే పూజకన్నా, నీవు చేసే
మానసిక పూజ అంటేనే ఇష్ఠము.
17. భగవంతుని ఆజ్ఞ లేకుండా ఈ సృష్ఠిలోని ఏప్రాణి ఒక్క
అడుగు ముందుకు వేయదు.
18.
భగవంతుని అందమును నీవు చూడదలచిన ముందుగా ఆయన సృష్ఠించిన ఈ ప్రకృతి, దానిలోని అందమును
చూడు.
19. ప్రాపంచిక రంగములో నీచొక్కా జేబులోని ధనాన్ని చూడు,
కాని ఆధ్యాత్మిక రంగములో ఆచొక్కా జేబు వెనుక ఉన్న గుండెలోని భగవంతుని శక్తిని చూడు.
20.
జనారణ్యములో అందరితో కలసి జీవించు కాని నీ గురు బంధువులతో కలసి ప్రయాణమును కొనసాగించుతు
గురువు ప్రేమను సంపాదించు.
21.
ఈ ప్రపంచములో నీదగ్గర ఉన్న ధనాన్ని అందరికి పంచిననాడు నీకు మిగిలేది ఏమి లేదు. అదే నీవు నీలోని ప్రేమ అనే సంపదను పంచిననాడు నీకు
మిగిలేది సంతృప్తి.
22. భగవంతుడు నీకు ఇచ్చిన ప్రేమ అనే సంపదను నీవు అందరికి
పంచుతున్నావా లేదా అని చూడటానికి ఆయన తన నివాసమును నీహృదయములోనికి మార్చుకొంటాడు.
23. భగవంతుడు నీలో ఉన్నపుడు నీవు ఆయనతో ఉన్నట్లే కదా.
24.
నీలో ఉన్న అర్హత ప్రకారమే భగవంతుడు నీకు తగిన ఆధ్యాత్మిక సంపదను ప్రసాదించుతాడు.
25.
ఒకసారి నీవు భగవంతునికి ప్రీతిపాత్రుడువి అయినపుడు ఆయన నిన్ను పరమాత్మ అనే తోటలో విహరింప
చేస్తాడు. అక్కడ నీకు శాశ్వత స్థానాన్ని కల్పించుతాడు.
26. భగవంతుడు నీమనోనేత్రాలలోని చీకటి పొరలను తొలగించుతాడు. అపుడు నీవు ఆయన దివ్య సౌందర్యాన్ని చూడగలవు.
27. భగవంతుడు ఆయన శక్తిని నీలో ప్రవేశపెట్టిననాడు నీవు
కూడా భగవత్ స్వరూపుడవే.
28.
భగవంతుని కాంతి స్వర్గములో ఎంత ఉందో అంతే కాంతి భూమి మీద ఉంది. కాని ఆకాంతిని చూడగలగడానికి నీమనోనేత్రాన్ని తెరచి ఉంచాలి.
29. నీవు భగవంతుని కృప కోసము ఆరాట పడుతున్నావే, మరి ముందుగా
నీప్రేమను నీతోటివానికి పంచుతున్నావా?
30. భగవంతుని చేరడము నీకు శక్యము కాదు. కాని ఆయన అనుగ్రహమును సంపాదించటానికి సాధనను నీవు
కొనసాగించగలవు.
(ఇంకా
ఉన్నాయి)
(సర్వం
శ్రీసాయినాధార్పణమస్తు)









0 comments:
Post a Comment