06.04.2017
గురువారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయి
లీలా తరంగిణి –14 వ.భాగమ్
రచనః  శ్రీమతి భారం మణి ఉమా మహేశ్వర రావు
(మూల
రచన :  తెలుగు.   ఆంగ్లంలోకి అనువదింపబడినది)
సాయి
లీలాస్. ఆర్గ్ నుండి గ్రహింపబడినది
(మరల
తెలుగులోకి అనువాదమ్ చేయించినవారు బాబా)
అనువాదానికి
నిమిత్త మాత్రుడుః  ఆత్రేయపురపు త్యాగరాజు
ఆల్
ఖైల్ గేట్,  దుబాయి
Email
:   tyagaraju.a@gmail.com
Watts
app. No.  9440375411
ధ్యానంలో
బాబా సందేశాలు
నాభర్త
శ్రీ భారం ఉమామహేశ్వరరావు గారు శ్రీ సాయిబాబాకు అంకిత భక్తులు గొప్ప సాధకుడు.  ఆయనకు ధ్యానంలోను, స్వప్నంలోను బాబానుంచి స్వయంగా
సందేశాలు అందుతూ ఉండేవి.  ఆవిధంగా బాబా ఆయనను
అనుగ్రహించారు.  తోటి సాయిభక్తులందరికీ బాబావారి
సందేశాలను, బోధనలను ప్రచారం చేసేందుకు ఆయనను తన సాధనంగా వినియోగించుకున్నారు. 
బాబావారు
ప్రసాదించిన ఈ సందేశాలు సాయిభక్తులకే కాదు,  నేటి యువతరం జీవనవిధానంలో మార్పు రావడానికి, వారు
సద్గురువుయొక్క అనుగ్రహానికి తగిన అర్హత పొందడానికి, సద్గురువు బోధనలను ఇంకా ఇంకా తెలుసుకోవడానికి
ఈ సందేశాలు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయి .  
1978
వ. సంవత్సరంలో నాభర్త ఎడిషనల్ సూపరెంన్ టెండెంట్ ఆఫ్ పోలీస్ గా పదవీవిరమణ చేసిన తరువాత
ప్రతిరోజు శ్రీసాయిబాబాను క్రమం తప్పకుండా పూజిస్తు ఉండేవారు.  తరచుగా మేము షిరిడీ వెడుతూ బాబాను దర్శించుకుంటూ
ఉండేవాళ్ళం.
1987
వ.సంవత్సరంలో మే 30వ.తారీకున కొంతమంది సాయిభక్తులతో కలిసి షిరిడీ వెళ్ళాము.  కేరళనుంచి ఒక స్వామీజీ మాదగ్గరకు వచ్చారు.  ద్వారాకామాయిలో కూర్చుని ఆయనతో మేము సాయిలీలలను
గురించి ఆంగ్లంలో మాట్లాడుకుంటున్నాము.  హటాత్తుగా
నాభర్తకి ధ్యానం చేసుకోవాలనే గాఢమయిన సంకల్పం కలిగింది.  ధ్యానంలో ఆయనకు బాబా దర్శనమిచ్చారు.  బాబా ఆగ్లంలో మాట్లాడటం మొదలుపెట్టారు.  బాబా ఆంగ్లంలో మాట్లాడుతున్నది విన్న వెంటనే నా
భర్త బిగ్గరగా మళ్ళి దానిని తిరిగి మాట్లాడసాగారు.  జరుగుతున్నది చూసి మేము స్ఠాణువులమైపోయాము.  శ్రీ వి. నారాయణరావుగారు (రిటైర్డ్ డెప్యూటీ పే
& ఎక్కౌన్ ట్స్ ఆఫీసర్) ఆయన కూడా మాతో షిరిడీకి వచ్చారు.  ఆయన వెంటనే కాగితం మీద నా భర్త పలుకుతున్న మాటలన్నీ
రాయడం మొదలుపెట్టారు.  శ్రీసాయిబాబా నోటివెంట
యదార్ధంగా వచ్చిన మొదటి సందేశం ఇదె.
అప్పటినుండి
ఆయనకు బాబాయొక్క వేదాంతము, తత్వం మీద ఎన్నో ఆధ్యాత్మిక సందేశాలు బాబానుంచి అందుతూ ఉండేవి.  అవన్నీ కూడా బాబా తెలుగులో చెప్పినవే.  మూడు సందేశాలను మాత్రం బాబా ఆంగ్లంలో చెప్పారు.  బాబా నాభర్తకు సందేశాలు ఇచ్చే సమయంలో ఆయన ప్రక్కన
ఎవరున్నాగాని వారా సందేశాలన్నిటినీ రాస్తూ ఉండేవారు.  ఆ సందేశాలలో ఎక్కువభాగం రాసే అదృష్టం నాకు మాత్రమే
కలిగింది.
జనవరి
1వ.తారీకు 1989 వ.సంవత్సరంలో మేము షిరిడీలో ఉన్నాము.  అప్పుడు బాబా తను ప్రసాదించిన సందేశాలన్నిటినీ ప్రచురించి
ప్రచారంలోకి తీసుకురమ్మని ఒక సందేశాన్నిచ్చారు. 
అప్పటికే బాబా మావారికి సందేశాలను ఇచ్చారు.  వాటినన్నిటినీ ‘సాయి తత్వ సందేశాలు” అనే పేరుతో
పుస్తకంగా ప్రచురించారు.   
 ఆయనకు ఇంకా సాయిబాబా వారు సందేశాలను తరచుగా ఇవ్వసాగారు.  తను అంతవరకు ప్రసాదించిన సందేశాలను దేశం నలుమూలలా
వ్యాపింప చేయమని వాటిని ఆంగ్లంలోకి కూడా అనువాదం చేయమని ఆదేశించారు.  అప్పటివరకు 77 సందేశాలను బాబా ఇచ్చారు.  వాటినన్నిటిని ఆంగ్లంలోకి అనువదించి ‘సాయి తత్వ
సందేశ్’ అనే పేరుతో పుస్తకంగా ప్రచురించారు. 
ఇంతవరకు ఆయనకు 300 లకు పైగా సందేశాలను బాబా ప్రసాదించారు.  వాటినన్నిటిని ఆంగ్లంలోకి అనువదిస్తూ ఉన్నారు.  బాబా అనుగ్రహంతో వాటిని ఎంత త్వరగా వీలయితే అంత
త్వరగా పుస్తకంగా ప్రచురిద్దామనుకుంటున్నారు.
బాబావారు
ఇచ్చిన సందేశాలన్నీ ఆధ్యాత్మికతా పరిజ్ఞానం కలిగి ఉన్న బోధనలు.  బాబావారి సందేశాలను కాస్తయినా అర్ధం చేసుకునేంత
పరిజ్ఞానం నాభర్తకు లేదు.  శ్రీశివనేశన్ స్వామీజీవారు
ఆసందేశాలన్నిటిని మాకు విపులంగా తెలియచేసారు.
ఈ
సందేశాలలో సాయిబాబా తన తత్వాన్ని నలుదిశలా ప్రతివారికి తెలియచేయమని తన భక్తులందరికీ
ఉధ్భోధించారు.  బాబా మనలోనే ఉన్నారు.  అంతటా వ్యాపించి ఉన్నారు.  ప్రతి అణువణువులోను ఉన్నారు.  ఆధ్యాత్మిక సాధన ద్వారా సాయిబాబా వారి వ్యక్తిత్వం
మనకి అవగతమవుతుంది.  ‘కష్టపడేవాడు ఎపుడూ చెడిపోడు’.
అందుచేత మనం భగవంతుని గురించి తెలుసుకోవాలంటే నిజాయితీతోను, చిత్తశుధ్ధితోను కృషి చేయాలి.
బాబా
చేసిన బోధనలను ప్రవృత్తి ద్వారా నివృత్తిగా అభివర్ణించవచ్చు.  అనగా స్వార్ధపరమయిన కోర్కెలకి శీఘ్రఫలితాలను ఆశించకుండా
భగవంతునియందు నిశ్చలమయిన భక్తితో కర్మనాచరించి జ్ఞానమును పొందాలి.
షిరిడీకి
రమ్మని బాబా ఆదేశించుట
1987
వ.సంవత్సరం డిసెంబరు 20 వ.తారీకున నా భర్త ధ్యానంలో ఉండగా బాబా ఆయనను శిరిడీకి రమ్మని
ఆజ్ఞాపించారు.  షిరిడీకి వెడదామని నాకెంతగానో
అనిపించింది.  కాని అప్పుడు సంవత్సరం చివరిరోజులు,
పైగా సెలవులు మొదలవడంవల్ల, ఎంతోమంది షిరిడీకి వస్తారు.  మనకి అక్కడ బస దొరకడం చాలా కష్టమవుతుంది.  ప్రశాంతంగా బాబాని దర్శించుకోలేమని మాపిల్లలు అడ్డు
చెప్పారు.  మేము మూడు నెలలక్రితమే షిరిడికి
వెళ్ళాము.  అయినా నాకు ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలనిపించింది.  పిల్లలు అన్న మాటలతో ఇంక మవునంగా ఉండిపోయాను.
మరుసటిరోజు
కాకినాడనుంచి మా అన్నయ్య డా.సి.ఆర్.ప్రసాద్ వచ్చాడు.  తామంతా ఒక మెటడార్ వ్యాన్ బుక్ చేసుకుని షిరిడీ
వెడుతున్నామని, నన్ను, నాభర్తని కూడా తమతో రమ్మని చెప్పాడు.  రెండు నెలలకు ఒకసారి షిరిడీకి రమ్మని బాబా సందేశం
ఇచ్చినా, నాభర్త షిరిడీ వెళ్ళడానికి తటపటాయించారు.  ఏమయినప్పటికీ కొద్దిరోజుల తరువాత మేము షిరిడీ వెళ్లాము.  అంతా బాబా దయవల్ల, ఆయన ఆదేశాల ప్రకారమే జరుగుతాయి.  సరిగా క్రిస్మస్ రోజున మేము షిరిడీలో ఉన్నాము.  ఆరోజున మహారాష్ట్ర ముఖ్యమంత్రి షిరిడీ వచ్చారు.  అన్ని గెస్ట్ హౌస్ లు, హోటల్స్ ప్రముఖుల కోసం బుక్
చేయబడ్డాయి.  కాని బాబా దయవల్ల మాకు వసతి దొరికింది.  తల్లి తన పిల్లలకోసం ఎంతగా పరితపిస్తుందో, అదే విధమయిన
ప్రేమతోను, దయతోను మాకు బాబా సందేశాన్నిచ్చారు. 
మా షిరిడీ యాత్ర మాకొక మరపురాని అనుభూతి. 
పరిపూర్ణమయిన సంతోషంతో హైదరాబాదుకు తిరిగి వచ్చాము.
శ్రీశివనేశన్
స్వామీజీగారు ఏది మాట్లాడినా అది బాబాగారే మాట్లాడుతున్నారని మాగట్టి నమ్మకం.  శ్రీస్వామీజీ మమ్మల్ని రెండు నెలలకు ఒకసారి షిరిడీకి
రమ్మన్నారు.  మేము డిసెంబరులో షిరిడీకి వచ్చాము,
కాబట్టి మరలా ఫిబ్రవరిలో వెళ్ళాలి.  కాని కొన్ని
అనుకోని పరిస్థితులవల్ల నాభర్త షిరిడీ వెళ్ళడం నిర్లక్ష్యం చేసారు.
అది
1987 వ.సంవత్సరం మార్చి నెల 9వ.తారీకు.  నాభర్త
మధ్యాహ్నంవేళ నిద్రపోతున్నారు. హటాత్తుగా మాయిల్లంతా సుగంధ పరిమళంతో నిండిపోయింది.  దోసెడు మంచిసువాసన గల మల్లెపూలు గాని, గులాబీ పువ్వులనుంచి
గాని అటువంటి పరిమళం వ్యాపించదు.  దీనిని బట్టి
బాబా మాయింటిలోకి ప్రవేశించారని గ్రహించుకున్నాము.  
బాబా! వినయవిధేయతలతో మీకు మేము మా సాష్టాంగప్రణామాలను
అర్పించుకోవడం తప్ప మీకు మేమేమివ్వగలం?
కొద్ది
నిమిషాల తరువాత నాభర్త నిద్రనుంచి మేల్కొన్నారు. 
తనకు బాబా కలలో కనిపించి నువ్వు షిరిడీకి ఎందుకని రాలేదని అడిగారని చెప్పారు.  అప్పటికే రెండు నెలలు దాటిపోయింది.  నాభర్త ఎంతో పరవశంతో ఉన్నారు.  దుప్పటి మీద, ఆయన నుదుటిమీద సువాసన ద్రవ్యం మరకలు
ఉన్నాయి.  మామనసులు ఆనందంతో నిండిపోయాయి.  ఆసంతోషానికి మరొక ముఖ్యమైన కారణం, బాబా ఆదేశించిన
ప్రకారం మేము షిరిడీకి వెడుతున్నామనే ఆలోచన. 
అది మాకెంతో చెప్పలేని ఆనందానుభూతులను కలిగించింది.
(రేపటి సంచికలో బ్రైన్ హెమరేజ్ నుండి బాబా
నా భర్తను కాపాడుట)
(సర్వం
శ్రీసాయినాధార్పణమస్తు)









0 comments:
Post a Comment