Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Sunday, November 12, 2017

ప్రసవానికి ముందు సాయిబాబా దర్శనమ్

Posted by tyagaraju on 8:58 AM
      Image result for images of shirdisaibaba caring child
                 Image result for images of rose hd

12.11.2017  ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు శ్రీసాయిపదానందరాధాకృష్ణస్వామిజీ బ్లాగులో ప్రచురింపబడ్డ బాబా చూపిన లీలను ప్రచురిస్తున్నాను. 
ఒక సాయిభక్తురాలి ఈ అనుభవం ఆంగ్ల బ్లాగులో గురువారమ్, ఆగస్టు, 27, 2015 లో ప్రచురింపబడింది.
ఈ బ్లాగులో ప్రచురింపబడ్డ లీలలను అనువాదమ్ చేసి ప్రచురిస్తూ ఉంటాను.

తెలుగు అనువాదం :  ఆత్రేయపురపు త్యాగరాజు

ప్రసవానికి ముందు సాయిబాబా దర్శనమ్

నాకు ప్రసవం అవడానికి యింకా నెల రోజులు ఉందనగా, ఒక గురువారము నాడు, తెలుగు ఛానల్ లో సాయిబాబా సినిమా చూస్తున్నాను.  ఆ సినిమా హిందీ భాషలో బాగా ప్రజాదరణ పొందినప్పటికీ, నాకు తెలుగులో వచ్చిన సినిమా అంటేనే బాగా యిష్టం. 


ఎందుకనగా ఈ సినిమాలో సాయిబాబా వేషం వేసిన నటుడు చాలా సహజంగా ఆపాత్రలో ఇమిడిపోయి నటించాడు.  సాయిబాబాగా ఆ నటనలో జీవించాడనే చెప్పచ్చు.  బాబా ఒక జ్ఞానమూర్తిగా, వృధ్ధఫకీరుగా టన్నుల కొద్ది ప్రేమను తనలో నింపుకుని తన భక్తులకు పంచడానికై అవతరించిన ఆయన, ఇపుడే కనక జీవించి ఉంటే ఏవిధంగా కనిపించేవారో కదా అనే ఊహాజనితమైన దృశ్యం నాకనులముందు గోచరించింది.  ఈ సినిమాను ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు, అలుపు అనేది రాదు.  ఇపుడు నేను ఈ సినిమాని ఎన్నోసారి చూస్తున్నానో నాకే తెలీదు.  సినిమా చూస్తూ చూస్తూ అలాగే సోఫాలో నిద్రపోయాను. 


అకస్మాత్తుగా నాప్రక్కనే సాయిబాబా ఉన్న అనుభూతి.  ఆయన నాప్రక్కనే నుంచుని నాతలమీద మృదువుగా కొడుతున్నారు.  ఆయన ఇంకా నాదగ్గరగా వచ్చి నాకొక సందేశం యిచ్చారు.  “భయపడకు, నేను నిన్ను జాగ్రత్తగా కనిపెట్టుకునే ఉన్నాను” అన్నారు.  ఆయన నాప్రక్కన 5 – 10 నిమిషాలు ఉన్న తర్వాత అదృశ్యమయ్యారు.  కొన్ని కారణాలవల్ల బాబా టెలివిజన్ లో  కనిపించి నాకీ సందేశం యిచ్చారనే భావనలో ఉన్నాను.  మరునాడు ఉదయం మెలకువ వచ్చాక మాత్రమే నా మదిలో బాబా యిచ్చిన సందేశం బాగా స్పష్టంగా పెద్దగా నాలో మెదులుతూనే వుంది.  బాబా వాస్తవంగానే నాకు దర్శనమిచ్చి నన్ను దీవించారనే విషయం అపుడు నాకర్ధమయింది.  

ఆయన వచ్చి నన్నెందుకు దీవించారా అని నాకు చాలా ఆశ్చర్యం కలిగింది.  నాకు ప్రసవం అవడానికి యింకా నెలరోజుల వ్యవధి ఉంది.  ఇక ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే ఆ తరువాత మంగళవారము నాడు తెల్లవారుఝామున నాలుగు గంటలకు ఉమ్మనీరు బయటకు వచ్చేసింది.  నాకు ప్రసవం అవడానికి యింకా మూడువారాలు ఉండనగానే వెంటనే ఆస్పత్రిలో చేరాల్సివచ్చింది.  క్రిందటి గురువారమునాడు బాబా దర్శనం లభించి, ఆయన గురించే ఎక్కువ సమయం గుర్తుచేసుకుంటూ ముందు రాబోయే  సంఘటనలకు తయారుగా ఉండమనే సంకేతం అయి ఉండవచ్చు.  నాకు మూడువారాల ముందుగానే ప్రసవం అవుతుందనే విషయం బాబాకు తెలుసు.  అందుచేతనే రాబోయే సంఘటనకు నన్ను సిధ్ధం చేసారు.  ఆ కారణం వల్లనే బాబా నన్ను దీవించి నామనసును ఆయనమీదనే లగ్నమయేలా చేసారు.  జరిగిన సంఘటన తలచుకోగానే నామనసు ఎంతో ఆనందాన్ని పొందింది.  ఆయన మాతృప్రేమకి ఎంతో పొంగిపోయాను.  నాసాయిబాబా తీసుకున్న ప్రత్యేకమయిన శ్రధ్ధ, బాధ్యత యింకెవరు తీసుకుంటారు?  నామాతృమూర్తి అయిన సాయికి నా ప్రేమాభిమానాలను సమర్పించుకుంటున్నాను.
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)



Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List