19.05.2020 మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు సాయిభక్తులలో ఒకరయిన శ్రీ ఉద్ధవేష్ బువా అనబడే శ్యామ్ దాస్ బాబా గురించి మూడవ భాగం మీకు అందిస్తున్నాను. ఆయనయొక్క
సమాచారం shridisaitrust.org – Chennai వారి నుండి గ్రహింపబడింది.
తెలుగు అనువాదమ్
: ఆత్రేయపురపు
త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫోన్ నం.
9440375411 & 8143626744
ఉధ్దవేష్ బువా –3 వభాగమ్
నాలుగవరోజు సాయంత్రం బాబా, జోగ్ తో “ఈరోజు ఎన్ని రూపాయలను పంచావు?” అని ప్రశ్నించారు. “అరవైఒక్క రూపాయలు పంచాను బాబా” అని జోగ్ సమాధానమిచ్చాడు. బుట్టీకి ఏభై రూపాయలు, శ్యామ్ దాస్ కి పదకొండు రూపాయలు ఇచ్చినట్లుగా చెప్పాడు. ఈ సంభాషణ జరుగుతున్నంత సేపు ఉధ్ధవ్
మవునంగా ఉన్నాడు. అపుడు
బాబా “నీకు పదకొండు రూపాయలు ముట్టాయా?” అని ఉధ్ధవ్ ని అడిగారు.
బాబామాటలలోని గూఢార్ధాన్ని గ్రహించలేక
తనకు పదకొండు రూపాయలు ముట్టాయని చెప్పాడు.
అపుడు బాబా “లేదు, నీకు ముట్టలేదు. సరే ఆ సంగతి రేపు చూద్ధాం.. ఈలోపుగా పోతీ ఒక్కసారి చూడు
సరేనా?” అన్నారు.
వాడాకి తిరిగివచ్చిన తరువాత బాబా అడుగుతున్న పదకొండు రూపాయలలోని
అంతరార్ధం ఏమిటి అని ఇద్దరూ చర్చించుకోవడం మొదలుపెట్టారు. బాలా సాహెబ్ భాటే తెలివయినవాడు.
బాబా దక్షిణ అడగటమంటే ఏకనాధ బాగవతాన్ని చదవడం అనే విషయాన్ని గ్రహించాడు. బాబా చదవమని చెబితే తప్ప తాను పోతీ చదవకూడదనే నిర్ణయం తీసుకున్న విషయం అపుడు గుర్తుకు వచ్చింది
ఉధ్ధవేష్ కి.
ఆ తరువాత ఇద్దరూ
మసీదుకు వెళ్ళారు. బాబా వారికి ఇద్దరు సోదరుల గురించి ఒక సుదీర్ఘమయిన కధ చెప్పారు. సంగ్రహంగా ఆ కధ. ఇద్దరు సోదరులు చాలా దూరం ప్రయాణం చేస్తున్నారు. ఇక్కడ సోదరులంటె అర్ధం “వాస్తవమయిన నేను’ అనగా ఆత్మ. ఇక రెండవ సోదరుడు అనగా “కనిపించే నేను” అనగా కంటికి కనిపించే ఈ దేహం, బుధ్ధి, ఇంద్రియాలు, వివేకం వీటన్నిటితో
కూడిన ఈ ఆధిభౌతిక శరీరం. వీటన్నిటితోను కనిపించే ఈ శరీరం కష్టాలని, సుఖాలని అనుభవిస్తుంది. అందువల్ల ఆ బాధలనుండి పంచభూతాలతో
కూడిన ఈ శరీరాన్ని నిర్ధాక్షిణ్యంగా మరుగు పరచాలి. అంటే దానర్ధం ఈ శరీరం నాదికాదు అనే
భావనతో ఉండాలి. అనగా ఒక విధంగా మన శరీతాన్ని తొలగించడం. దానికి బాబాగారు ఒక పధ్ధతిని సూచించారు. అదే యోగ సాధన. యోగ సాధన చేయడంవల్ల సర్పంలాగ చుట్టచుట్టుకుని
ఉన్న కుండలిని జాగృతమయి ‘నేను’ ని కాటు
వేసి నాశనం చేస్తుంది. యోగసాధన చేస్తూ ఉండటం వల్ల కుండలిని
క్రమక్రమంగా విడివడుతుంది. ఆధ్యాత్మిక శక్తి శరీరంలో ప్రవాహంలా సాగుతుంది.
ఆకుండలిని పైకి లేచి మన శరీరంలో ఉన్న షట్చక్రాలగుండా పాకుతుంది. ఈకుండలినీ శక్తి వల్ల మనలోని అన్ని చక్రాలు ప్రభావితమయి వాటి శక్తి జాగృతమవుతుంది. ఇవి శక్తి కేంద్రాలు. చివరికి ఈ కుండలిని సహస్రార చక్రంలోకి ప్రవేశించి అత్యున్నత స్థితిని పొందుతుంది. ఈ సహస్రార చక్రం వేయి రేకుల పద్మంలాగ మన తలలో మెదడుపైన ఉంటుంది.
ఆకుండలిని పైకి లేచి మన శరీరంలో ఉన్న షట్చక్రాలగుండా పాకుతుంది. ఈకుండలినీ శక్తి వల్ల మనలోని అన్ని చక్రాలు ప్రభావితమయి వాటి శక్తి జాగృతమవుతుంది. ఇవి శక్తి కేంద్రాలు. చివరికి ఈ కుండలిని సహస్రార చక్రంలోకి ప్రవేశించి అత్యున్నత స్థితిని పొందుతుంది. ఈ సహస్రార చక్రం వేయి రేకుల పద్మంలాగ మన తలలో మెదడుపైన ఉంటుంది.
(ఉధ్ధవేష్ బువా కఫనీ)
(ఎడమవైపు ఉధ్ధవేష్ బువా)
యోగ సాధనలో ఎప్పుడయితె ఈ కుండలిని జాగృతమయి సహస్రారానికి చేరుకుంటుందో అపుడే సమాధి స్థితి అనుభవమవుతుంది. కాని మనలో ఉన్న ప్రాపంచిక విషయవాసనలు,
కోరికలు, పూర్తిగా నిర్మూలింపబడనట్లయితే
ఈ సమాధి స్థితి ఎక్కువసేపు నిలబడదు.
ఇక్కడ బాబా వీటిని 5 లేక 6 గురు వ్యక్తులుగా అభివర్ణించారు.
అయిదుగురు వ్యక్తులనగా పంచేంద్రియాల అదుపులో ఉండే విషయవాసనలు. ఇంకా అరిషడ్వర్గాలు (6 గురు వ్యక్తులు). అసలయిన సాధకుడిని ఈ శత్రువులు ప్రలోభపెట్టి నిరంతరం దాడి చేస్తున్నా
వాటికి భయపడడు. అవి సాధకుడిని
ఏమీ చెయ్యలేవు. అంతే
కాదు అసలయిన సాధకుడే వాటిని నాశనం చేయగలుగుతాడు. ఆ విధంగా బాబా చెప్పిన కధనం
“ఒక పెద్ద సర్పం, నేను దానిని భూస్థాపితం చేసాను,
సుదీర్ఘమయిన ప్రయాణం, ఇవి విషయవాసనలను సూచిస్తాయి.
బాబా ఒక మంచి బలమయిన శక్తి గల స్త్రీ గురించి కూడా చెప్పారు. అదే ‘మాయ’.
అజ్ఞానం వల్ల మనం మనలో ఉన్న ఆత్మని మరిచిపోయాము. అజ్ఞానం పటాపంచలయితే అసలయిన
‘నేను’ కి ఈశరీరానికి గల భేదాన్ని గుర్తించగలుగుతాము. ఈ భేదాన్ని తెలుసుకోలేకపోవడం వల్లనే మానవుడు ఈప్రాపంచిక జీవితంలో సమస్యల సుడిగుండాలలో
చిక్కుకుని, జనన మరణాలను సుఖదుఃఖాలను అనుభవిస్తూ ఉంటాడు.
జాగ్రదావస్థ, స్వప్నావస్థ ఈ రెండూ కూడా ఒక భ్రమే. అయినా కాని,
ఇవన్ని కూడా యదార్ధమనిపిస్తాయి. ఈ మాయ మన ఆత్మని కప్పివేస్తుంది.
అందుచేత మనలోఉన్నటువంటి ఆత్మను
తెలుసుకోవాలంటే ఈ మాయను కూడా తొలగించాలి.
బాబాకూడా తనను ఈ మాయ బాధపెట్టుచున్నదని తాను ఆమాయను తొలగించుకున్నానని
చెప్పారు. మాయను తొలగించిన
తరువాత కూడా ఈవిషయవాసనలనేవి ఇంకా మనమీద దాడి చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి. వాటినే బాబా అయిదు లేక ఆరుగురు వ్యక్తులుగా పోల్చి, “అవి
మన కళ్ళ ముందే మనలని మోహంలో పడవేస్తాయి. ఈ విషయవాసనలు లేక మాయ అంత బలమైనది. బ్రాహ్మణుడు అనగ బ్రహ్మజ్ఞానం పొందినవాడు. బ్రహ్మజ్ఞానం పొందినవాడు ఆ విషయవాసనలని గులాబీలుగా మార్చగలడు. అనగా వాటిని జ్ఞానంగా మార్చగలడు. 'స్వచ్చమయిన జలములో చిన్న నడకదారి' ఇది సాధకుడు సాధన ద్వారా పరబ్రహ్మ స్థితికి చేరుకోగలడు అని స్పష్టంగా తెలియపరుస్తుంది. ఆ తరువాత చుట్టూరా స్వచ్చమయిన జలమే తప్ప నడకదారి కనిపించదు. అపుడు సాధకుడు పరిపూర్ణమయిన పరబ్రహ్మస్థితిని చేరుకుని బ్రహ్మజ్ఞానాన్ని
పొందుతాడు. ఆఖరికి సాధకుడు
పరబ్రహ్మలో లీనమవుతాడు.
(కుండలిని గురించిన కొంత సమాచారాన్ని ఈ వీడియోలో చూడండి.)
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment