Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Thursday, June 18, 2020

గురుభక్తి – 2 వ.భాగమ్

Posted by tyagaraju on 7:16 AM
    Shirdi Sai Baba - Lord Dattatreya Incarnate | Shirdi Sai Baba Life ...
      Three roses isolated on white | Stock image | Colourbox
18.06.2020 గురువారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సత్ చరిత్రలో నాకు కలిగిన సందేహాలు – 
బాబా సమాధానాలు – 10 (2)
గురుభక్తి – 2 వ.భాగమ్
ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్
ఫోన్.  9440375411 & 8143626744
మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com


గురుదేవుని అనుగ్రహానికి దూరంగా ఈ ప్రపంచంలో సుఖమనేది ఎక్కడా లభించదు.  గురుభక్తి లేనివారికి గురువు లభించినా ప్రయోజనం ఉండదు.  ఎన్నో జన్మల పుణ్యఫలంగా సద్గురువు లభిస్తాడు.  అటువంటి అవకాశం లభించినపుడు మనం సద్వినియోగం చేసుకోలేకపోతే మోక్షం సిధ్ధించకపోగా మళ్ళీ మళ్ళీ జన్మలే ప్రాప్తిస్తాయి.  దీనిని బట్టి మనం గ్రహించుకోవలసినది  సద్గురువు జననమరణాల నుండి తప్పిస్తాడు.


మందమతులయినవారు గురువుయొక్క శక్తిని కాంచలేరు.

గురుదేవుని నామమును జపించుట వలన అనేక జన్మలలో ఆర్జించిన పాపములు కూడా నశించుచున్నవి.
                         ---        గురుగీతశ్లో. 297
ఈ భూలోకమున గురువును మించిన దైవము లేదు.  గురువును మించిన తండ్రియు లేడు.  గురుధ్యానమునకు సమానమైన కార్యము లేదు.                                  -----      గురుగీత -  శ్లో. 298

గురువుయొక్క పాదతీర్ధమును త్రాగి, శేషించిన తీర్ధమును ఎవడు శిరమున ధరించుచున్నాడో అట్టి పుణ్యాత్ముడు సరస్వతీ స్నానఫలమును పొందుచున్నాడు.     ---        గురుగీత  శ్లో. 29

గురుదేవుడు వసించు ప్రదేశమే కాశీక్షేత్రము.  గురుదేవుని పాదతీర్ధమే గంగా జలము.  గురుదేవుడే సాక్షాత్తు పరమేశ్వరుడు.  గురుబోధయే కాశీలో విశ్వేశ్వరుడుపదేశించు ప్రణవతారకము. 

                                        ---     గురుగీతశ్లో. 37
                 SHIRDI SAI SAMAJ USA: Dasganu Maharaj Part 2
(శ్రీ సాయి సత్ చరిత్ర అ. 4 దాసగణు ప్రయాగ వెళ్లి అక్కడ సంగమములో స్నానము చేయదలచి బాబా దగ్గరకు వెళ్ళి ఆయన అనుమతి కోరాడు.  అప్పుడు బాబాఅంత దూరము పోవలసిన అవసరమే లేదు.  మన ప్రయాగ ఇచ్చటనే కలదు.  నామాటలు విశ్వసింపుముఅన్నారు.  ఆ సమయంలో దాసగణు బాబా పాదములపై శిరస్సునుంచిన వెంటనే బాబా రెండుపాదముల బొటనవ్రేళ్లనుండి గంగాయమునా జలములు కాలువలుగా పారాయి.  దాసగణు భక్త్యావేశాలతో మైమరచాడు.  కన్నులు ఆనందాశ్రువులతో నిండాయి.)

గురుపాద తీర్ధము పాపమనెడి బురదను ఎండింపజేయును.  ఆత్మజ్ఞానమును పెంపొందింపజేయును.  భవసాగరమును దాటించును.                                   --  గురుగీతశ్లో – 31
నిరంతరము గురుపాద తీర్ధమును పానముగను, గురువు భుజించగా మిగిలిన శేషము భోజనముగను, సదా గురుమూర్తియే ధ్యానరూపముగను, గురునామమే జపముగను సాగుచుండవలెను.
                                       గురుగీతశ్లో.32
(బాలాజీ పాటిల్ నెవాస్కర్   బాబా త్రాగగా మిగిలిన నీటినే త్రాగుతూ ఉండేవాడు.  బాబా స్నానం చేసిన నీటిని కూడా త్రాగేవాడు.  బాలాజీ తరువాత అతని కుమారుడు కూడా తన తండ్రిలాగానే, నీరు త్రాగే విషయంలో అదే పధ్ధతిని పాటించాడు.)
(శ్రీ సాయి సత్ చరిత్ర అ.4.  శ్రీ సాయి దర్శనమే మాకు యోగసాధనముగా నుండెను.  త్రివేణీ ప్రయాగల స్నానఫలము వారి పాదసేవ వలననే కలుగుచుండెడిది.  వారి పాదోదకము మాకోరికలను నశింపజేయుచెండెడిది.)

తనయొక్క ఆశ్రమమును, తన జాతిని, తన కీర్తిని, ఐశ్వర్యమును, సమస్తమును త్యజించి గురువునే ఆశ్రయింపవలెను. 
                                --- గురుగీత – శ్లో  41

దేహమును, ఇంద్రియములను, ప్రాణమును, ధనమును, స్వజనులను, బంధువులను, కట్టుకొనినవారిని సమస్తమును గురుదేవుని సేవలో వినియోగించవలెను.  --- గురుగీత  - శ్లో. 52
(నెవాస్ నివాసి అయిన బాలాజీ పాటిల్ పైన చెప్పిన విధంగానె తన శరీరము, మనస్సు, ధనము తన గురువుకే అర్పించి జీవితాన్ని సార్ధకం చేసుకున్న వ్యక్తి.  అతను నిమ్న కులంలో జన్మించాడు. ఆయినాగాని అతను తన గురువుమీద చూపించిన భక్తి ద్వారానే భవసాగరాన్ని దాటాడు. బాలాజీ తన పొలంలో పండిన పంటనంతటినీ ఎడ్లబళ్లమీద వేసుకుని దాని అసలయిన యజమాని బాబాయి అనే ఉద్దేశ్యంతో ఆయన పాదాలముందు సమర్పించుకునేవాడు.  బాబా అతనికి ఇచ్చిన ధాన్యాన్నే సంతోషంగా ఇంటికి పట్టుకెళ్ళేవాడు.  ఆయన ఇచ్చినదానితోనే కుటుంబాన్ని పోషించుకునేవాడు

సర్వులకును గురుదేవునికన్నను అన్యమైన సత్యవస్తువు లేదు.  ఇది నిశ్చయము.  గురుసేవను సదా చేయవలెను.  తన జీవితమునే నివేదనగా సమర్పించవలెను.   --- గురుగీత –  శ్లో. 49 

(చాలాకాలం క్రితమే బాలాజీ మొట్టమొదటిసారిగా బాబా దర్శనం కోసం షిరిడీ వచ్చాడు.  బాబాను దర్శించుకున్న మరుక్షణమే అతను షిరిడీలోనే శాశ్వతంగా ఉండిపోవాలనే నిర్ణయానికి వచ్చాడు.  కొన్నాళ్ళు బాబా అతనిని ఇంటికి వెళ్ళిపోయి కుటుంబంతో ఉండమని ఎంతో నచ్చచెప్పడానికి ప్రయత్నించారు.  కాని చివరివరకు అతను సంసార జీవితంలో ఉపశమనం పొందలేకపోయాడు.)


(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)



Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List