10.07.2020 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు ఒక ఆసక్తికరమయిన అంశాన్ని మీకు అందచేస్తున్నాను.
బాబా
ఎవరినీ తన శిష్యులుగా చేసుకోలేదు,
ఆయనకు
వారసులు కూడా లేరు.
ఈ
సమాచారమ్
shirdisaisevatrust.org చెన్నై
వారినుండి గ్రహింపబడినది.
(సాయిలీల పత్రిక నవంబరు, డిసెంబరు 1983 సంచికలో పునర్ముద్రితం.)
తెలుగు అనువాదం --
ఆత్రేయపురపు
త్యాగరాజు
నిజాంపేట,
హైదరాబాద్
ఫోన్. 9440375411 ,
8143626744
సాయిబాబాకు వారసులు గాని శిష్యులు గాని లేరు – 2 వ.భాగమ్
(రచయిత కీ.శే. డి. శంకరయ్య)
( ఈ వ్యాసాన్ని shirdisaisevatrust.org నుండి యధాతధంగా అనువాదం చేసి ప్రచురిస్తున్నాను. అందువల్ల ఇందులో తెలియపరచబడిన అభిప్రాయాలన్నీ శ్రీ శంకరయ్యగారివేనని గ్రహించవలెను.)
సమాధిమందిరం కట్టబడిన ఈనాటి ప్రదేశం, ఒకప్పుడు బాబా పూలతోటను పెంచిన ప్రదేశమని మనందరకూ తెలుసు. సమాధిమందిరం కట్టబడటానికి దశాబ్దాల క్రితమే బాబా మొక్కలను నాటి వాటికి నీరుతోడి పోసేవారు. బాబా ఆవిధంగా ఆప్రదేశాన్ని శుధ్ధిచేసి పావనం చేసారు.
సమాధిమందిరం కట్టబడిన ఈనాటి ప్రదేశం, ఒకప్పుడు బాబా పూలతోటను పెంచిన ప్రదేశమని మనందరకూ తెలుసు. సమాధిమందిరం కట్టబడటానికి దశాబ్దాల క్రితమే బాబా మొక్కలను నాటి వాటికి నీరుతోడి పోసేవారు. బాబా ఆవిధంగా ఆప్రదేశాన్ని శుధ్ధిచేసి పావనం చేసారు.
నాగపూర్
నివాసి అయిన బూటీ మురళీధరుని విగ్రహాన్ని ప్రతిష్టించడానికి అక్కడ ఒక మందిరాన్ని నిర్మించాడు. అంతా పూర్తయిన తరువాత మురళీధరుని స్థానంలో బాబా
ప్రవేశించారు. ఈవిధంగా ఎందుకు జరిగింది అన్నదాని
గురించి మనం తీవ్రంగా ఆలోచిద్దాము. బాబాలాంటి యోగీశ్వరులకి మరణంలేదని, వారు కూడా మానవులలాగానే
కనిపించినా యదార్ధానికి వారు స్వయంగా భగవంతుడేనని మనందరికి తెలుసు (సత్ చరిత్ర పేజీ
239). మరణంలేని మంత్రాలయ రాఘవేంద్రస్వామీజీ
కూడా తన సమాధి 700 సంవత్సరాలపాటు శక్తివంతంగా ఉంటుందని ప్రకటించారు. అదే విధంగా బాబా సమాధికూడా శక్తివంతంగా ఉంటుంది.
ఒక
సత్పురుషుడు ఒక ప్రదేశంలో నివశిస్తున్నాడంటే ఆయనను దర్శించుకోవడానికి ప్రజలు తండోపతండాలుగా
వస్తూ ఉంటారు. కాని ఆ మహాపురుషుడు భౌతికంగా
దూరమయిన తరువాత క్రమక్రమంగా ఆప్రదేశానికి అంతకు ముందు ఉన్న ప్రాముఖ్యత తగ్గిపోతూ వస్తుంది. చరిత్రపుటలను తిరగేస్తే అటువంటి ప్రదేశాలగురించిన వివరాలను మనం గమనించవచ్చు. కాని, షిరిడీ మాత్రం అటువంటిదానికి అతీతం. మొత్తం షిరిడీ స్వరూపమే మారిపోయింది. 1918 వ.సంవత్సరం తరువాత రోజురోజుకి ప్రపంచవ్యాప్తంగా
అనేక సాయిమందిరాలు వెలిసాయి. సాయిసమాజాలు ఏర్పాటయ్యాయి. బాబా సశరీరంగా ఉన్నప్పటికంటే ఈనాడు బాబా మరింతగా
జీవించి ఉన్నారనే విషయానికి తగిన ఋజువు లభించినట్లే కదా.
బాబా
తమ దేహాన్ని విఢిచిన వెంటనే ఏమి జరిగిందో చూద్దాము. ఆయన పార్ధివదేహాన్ని ఏమిచేయాలన్న సమస్య వచ్చింది. ఆయన శరీరం 36 గంటలయినా సరే బిగుసుకుపోలేదు. కాళ్ళు, చేతులు అన్నీ యధాస్థితిలోనే అటూ ఇటూ కదల్చగలిగిన స్థితిలోనే
ఉన్నాయి. ఆయన ధరించిన కఫనీని ముక్కలుగా చింపకుండానే
తీయగలిగారు. శ్రీసాయి సత్ చరిత్ర గ్రంధకర్త
బాబా గురించి సమయోచితంగా “సచ్చీలత కలవాడు, పంచేంద్రియాలను, మనస్సుని అదుపులో ఉంఛకున్నవాడు,
పరిపాలకుడు” అని సాయిని వర్ణించాడు.
“ఎల్లప్పుడు
నానిరాకార స్వరూపాన్నే ధ్యానించమని బాబా తన భక్తులకు బోధించారు. అందువల్ల బాబా మూడున్నర మూరల దేహం మాత్రమే కాదు.
ఆయన సర్వాంతర్యామి.
16.10.1918
వేకువజామున బాబా, లక్ష్మణ్ మామా స్వప్నంలో కనిపించి “త్వరగా లే, నేను మరణించాననుకుని
బాపూసాహెబ్ జోగ్ ఈ రోజు రాడు. నువ్వయినా వచ్చి
నాపూజ చేసి కాకడ ఆరతి ఇవ్వు” అన్నారు. జోషి
బాబా ఆదేశించిన ప్రకారం ఎప్పటిలాగానే బాబాకు పూజచేసి ఆరతి ఇచ్చాడు. తన శరీర స్థితి ఎలా ఉన్నాగాని, భక్తులమనసులలో ఉన్న సంధిగ్ధాన్ని తొలగించడానికి తనకు ప్రతిరోజు
జరుపబడే పూజ, ఆరతులను యధావిధిగా నిర్వహించేలా బాబా ఏర్పాటు చేసారు. 16.10.1918 న పండరీపూర్ లో ఉన్న దాసగణు మహరాజ్ స్వప్నంలో
బాబా దర్శనమిచ్చి, “మసీదు కూలిపోయింది, నాశరీరాన్ని పూలతో కప్పు” అని చెప్పారు. దాసగణు ఆవిధంగానే ఆయన సమాధిని పూలతో కప్పాడు.
శ్రీబి.వి.నరసింహస్వామి
గారు రచించిన Devotees Experiences అనే పుస్తకంలో శ్రీ M.W. ప్రధాన్ గారు చెప్పిన విషయం…
“18.10.1918
నాడు బాబా దేహాన్ని వీడివెడుతున్న స్థితిలో తనకు స్వప్నంలో కనిపించి “ప్రజలంతా మహాత్ములు
మరణించారు అని అంటారు, కాని మహాత్ములు సమాధి చెందారని అనాలి” అని బాబా చెప్పారు.
మరలా
19.10.1918 నాడు స్వప్నంలో దర్శనమిచ్చి మూడు రూపాయలు ఇచ్చారు. ఆవిధంగా స్వప్నంలో డబ్బు తీసుకోవడం మంగళప్రదం కాదని
భావించి నేను తిరస్కరించగా బాబా “దీనిని తీసుకుని నీపెట్టెలో నువ్వు దాచిన డబ్బుతో
సహా నాకివ్వు” అన్నారు. అదేరోజు రాత్రి బాబా
ప్రధాన్ మరదలి కలలో కనిపించి తన సమాధిని పసుపురంగు పీతాంబరంతో కప్పమని చెప్పారు. ఈవిషయాలన్నిటినీ ప్రధాన్ గారు వివరించారు. ఈసంఘటలన్నిటినీ గమనిస్తే బాబా ఇంకా సజీవులేనని మనకు
అర్ధమవటల్లేదా? అవతారాల గురించిన ప్రసక్తి
ఇక అనవసరం.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment