22.07.2020 బుధవారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ
రోజు సాయిలీల పత్రికలో ప్రచురింపబడిన ఒక
బాబా లీలను ప్రచురిస్తున్నాను.
ఈ
లీలను భువనేశ్వర్ నుండి శ్రీమతి మాధవిగారు తెలుగులోనికి అనువాదమ్ చేసి పంపించారు.
సాయిబాబా ఆశీర్వాద ఫలంగా సంతాన ప్రాప్తి
శ్రధ్ధ, సబూరి అనే సందేశాలను ఇచ్చే సాయిబాబా, ప్రతిఒక్కరి ఆత్మలో నివసించే సాయి, మహాసత్పురుషుడు జీవించి ఉన్నకాలంలోను, సమాధి తరువాత కూడా
తన భక్తులకు ఆశీర్వాదాలను ఇస్తూ అందరి కోరికలను తీరుస్తున్నారు.
అది 1978 వ.సంవత్సరమ్. మొదటిసారి షిరిడీ యాత్రకు వెళ్ళే అవకాశం కలిగింది. అప్పటినుండి ఆ సచ్చిదానంద సాయి భక్తుడిగా మారిపోయాను. బాబా కృపవలన నాకు 1982 వ.సంవత్సరంలో ఉద్యోగం వచ్చింది. అదే సంవత్సరంలో వివాహం కూడా అయింది. నేను నాభార్యతో కలిసి షిరిడీ వెడదామనుకున్నాను గాని వెళ్లలేకపోయాను.
1990 వ.సంవత్సరం వరకు నాకు సంతానం కలుగలేదు. మాకు సంతాన భాగ్యం లేదోమోననే చింత మా అందరినీ వేధిస్తూ ఉండేది. 1990 లో బాబా ఆశీర్వాదం వలన నాకు కుమారుడు జన్మించాడు. ఆ సందర్భంగా నేను నా భార్య, కుమారునితో కలిసి షిరిడి వెడదామనుకున్నాను. శ్రీరతన్ సింగ్ తోసర్ అనే ఆయన మా కార్యాలయంలో నా సహోద్యోగి. అతను నాకన్న వయసులో పెద్దవాడు, నాకు మంచి మిత్రుడు. అతనికి వివాహమయి 12 సంవత్సరాలయిన సంతానం కలగలేదు. అన్ని సుఖసంపత్తులు ఉన్న సంతానలేమి అతనిని బాధిస్తూ ఉండేది. అతని భార్య చేయని వ్రతాలు, లేవు, దర్శించని దేవీ దేవుళ్ళు లేరు. అన్ని కోరికలు తీరే పవిత్ర భూమి షిరిడీలో తన కోరిక తీరుతుందేమోననే ఆశతో ఆదంపతులు కూడా మాతోపాటే షిరిడీకి వచ్చారు.
షిరిడీకి చేరుకొన్న తరువాత ఉదయాన్నే స్నానసంధ్యాదులన్ని పూర్తిచేసుకొని ప్రసాద, పూలమాలతో బాబా దర్శనానికి సమాధిమందిరానికి చేరుకొన్నాము. బాబా చరణద్వయాలకు నమస్కరించుకొన్నాము. సమాధిపైన శిరసువంచి నమస్కారమ్ చేసుకొన్నాము. ఆసమయంలో ఒక అనూహ్యమయిన సంఘటన జరిగింది. ఆసంఘటన వల్లనే రాబోయే రోజుల్లో జరిగే పరిణామం స్పష్టంగా అర్ధమయింది.
మేము బాబా విగ్రహం ముందర నిలబడి ప్రసాదం, పుష్పాలను అర్పించి సాయిబాబా వారి దివ్యమంగళమూర్తిని చూస్తూ ప్రార్ధించుకుంటూ అపరిమితమయిన ఆత్మానందాన్ని అనుభవిస్తూ ఉన్నాము. ఇంతలో ఎవరో తెలియదు ఒకావిడ తన మూడు సంవత్సరాల వయసు గల పిల్లవాడిని నా స్నేహితుని భార్య చేతికిచ్చి, కాస్తంత వీడిని పట్టుకోండి, నేను ఇపుడె వస్తాను అని చెప్పి ఎక్కడికో వెళ్ళింది. అంత చిన్నపిల్లవాడిని ముక్కు మొహం తెలియనివారికి ఏ తల్లి అయినా ఎలా ఇస్తుంది? శ్రీమతి తోసర్ ఆబిడ్డను అక్కున చేర్చుకొంది.
బాబా సమక్షంలో తన స్వంత కొడుకులా ఆ పిల్లవాడిని హత్తుకొని అలౌకికమయిన ఆనందాన్ననుభవించింది. ఆవిధంగా పది నిమిషాలు గడిచాయి. మేము ఆపిల్లవాడి తల్లి కోసం ఎదురుచూస్తూ ఉన్నాము. అంత జనంలో ఆమె ఎక్కడికి వెళ్ళింది? ఎలా వచ్చిందన్నది బాబాకే తెలుసు. ఆతరువాత ఆమెవచ్చి తన బిడ్డను తీసుకొని నీకు కూడా ఇలాంటి బిడ్డ కలుగుతాడులే వేచి ఉండు అని చెప్పి వెళ్ళిపోయింది. బాబాయే ఆవిధంగా శ్రీమతి తోసర్ ను ఆశీర్వదించారని నాకనిపించింది. ఈ సంఘటన తరువాత ఆమెకు బాబామీద అపరిమితమయిన భక్తిప్రపత్తులు కలిగాయి. బాబా తప్పకుండా తనకు సంతానాన్ననుగ్రహిస్తారనె నమ్మకం కలిగింది. మేము షిరిడీలో రెండురోజులుండి తిరిగి భోపాల్ కు చేరుకొన్నాము.
మూడు నెలల తరువాత తోసర్ దంపతులిద్దరూ మా ఇంటికి వచ్చారు. నెహ్రూనగర్
లో సాయిబాబా మందిరం కట్టారు, మీరు కూడా రండి అని మమ్మల్ని కూడా రమ్మన్నారు. సాయిబాబా మందిరంలో
సంధ్యాహారతి
తరువాత అక్కడి పూజారి శ్రీమతి తోసర్ ను ‘సంతానప్రాప్తిరస్తు’ అని ఆశీర్వదించాడు.
ఆమెకు
సంతానం లేదనే విషయం ఆపూజారికి తెలియదు. ఇదంతా
బాబాలీల కాక మరేమిటి?
సాయిబాబా తన భక్తుల కోర్కెలను తీర్చడానికి ఎవరో ఒకరిని మాధ్యమంగా చేస్తారు. 12 సంవత్సారాలుగా సంతానం లేని తోసర్ దంపతులకు 1995 లో అబ్బాయి జన్మించాడు. అపారమయిన ఆనందాన్ని కలిగించిన ఈ సంఘటన షిరిడీలో జరిగిన విషయాన్ని గుర్తుకు తెచ్చింది. అప్పటినుండి తోసర్ దంపతులకి సాయిబాబా మీద అపారమయిన భక్తి శ్రధ్ధలు కలిగాయి. సాయిబాబా ఎన్నిరకాలయిన కోరకలను తీసుస్తున్నారో చూడండి. ఆయన తన భక్తులమీద అపారమయిన అంతుచిక్కని ప్రేమ. సంతానప్రాప్తి, ధనప్రాప్తి, అన్నీ ఏదికావాలంటే దానిని ఆయన అనుగ్రహిస్తారు. దేవేంద్రప్రకాష్ తివారి, భోపాల్
(ఈ సందర్భంగా ఒక సంఘటన గురించి వివరిస్తాను.
నాలుగు
సంవత్సరాల క్రితం మా అమ్మాయికి కూడా సంతానప్రాప్తి కోసం ప్రతిమంగళవారము నాడు సుబ్రహ్మణ్యేశ్వరుడికి
అభిషేకాలు ఆరు మంగళవారాలు చేయాలనిపించి సుబ్రహ్మణ్యషష్టినుండి మొదలుపెట్టి ఇక్కడ ఆంజనేయస్వామి ఆలయంలో ఉన్న పెద్ద నాగేంద్రులవారి విగ్రహం వద్ద పూజలు అభిషేకాలు నిర్వహిస్తూ వచ్చాము. మా అమ్మాయి మరొక దేశంలో ఉన్న కారణంగా అమ్మాయి తరపున మాదంపతులిద్దరిచేతా పూజారి గారు అభిషేకాలు చేయించారు. ఇక ఆఖరి మంగళవారం అభిషేకం పూర్తయిన తరువాత మేమిద్దరం గుడి ప్రాంగణంలో గట్టు మీద కూర్చున్నాము. ఆ రోజు మంగళవారం కావడం వల్ల భక్తులు చాలామంది ఉన్నారు.అందరూ ఆంజనేయస్వామిని, శివుడిని, నాగేంద్రులవారిని దర్శించుకోవడానికి వచ్చారు. కొంతసేపటి తరువాత ఒకామె వచ్చి తన ఆరునెలల పాపాయిని నాభార్య చేతిలో పెట్టి కాస్త మా అమ్మాయిని ఒళ్ళో పెట్టుకుని చూస్తూ ఉండండి, అమ్మాయిని
ఎత్తుకుని ప్రదక్షిణలు చేయడం కష్టంగా ఉందని చెప్పి ఆంజనేయస్వామి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయడానికి వెళ్ళింది.
గుడికి
ఆమె ఒక్కత్తే వచ్చింది.
మేమెవరమో
ఆమెకి తెలియదు ఆమె ఎవరో మాకు తెలియదు.
అమ్మాయి
చేతికి బంగారు మురుగులు, మెడలో గొలుసు ఉన్నాయి. పాప చక్కగా తెల్లగా అందంగా ఉంది. నా భార్య ఒడిలో ఏడవకుండా నా భార్య గాజులతో ఆడుకుంటూ ఉంది. ప్రదక్షిణాలు
పూర్తయిన తరువాత ఆమె తన అమ్మాయిని తీసుకొని వెళ్ళింది.
అనగా
సుబ్రహ్మణ్యేశ్వరుడు
మా అమ్మాయికి సంతాన ప్రాప్తిని కలిగిస్తున్నానని ఆశీర్వదించాడని సంతోషించాము.
ఈ
సంఘటన తరువాత మా అమ్మాయి శుభవార్త చెప్పడం జరిగింది. ఆడపిల్ల జన్మించింది….దీనిని బట్టి భగవంతుని అనుగ్రహం మనం
ఊహించని రీతిలో జరుగుతుందని మనం గ్రహించుకోవచ్చు… త్యాగరాజు)
(రేపటి సంచికలో ఆణిముత్యాలు)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
(రేపటి సంచికలో ఆణిముత్యాలు)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
1 comments:
Sairam..Sir..Mee ammayiki kuda same experience jaragadam baba krupa.
Post a Comment