27.12.2020 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
సాయిబాబా – పరిశోధనా వ్యాస
గ్రంధము – 19 వ.భాగమ్
(పరిశోధనా వ్యాస రచయిత… శ్రీ ఆంటోనియో
రిగోపౌలస్ – ఇటలీ)
తెలుగు అనువాదమ్ :
ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫొన్ : 9440375411 & 8143626744
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com
షిరిడీ- కోపర్ గావ్ – షిరిడీ
శనివారమ్ – అక్టోబరు, 19, 1985
నా డైరీలోని సారాంశాలు
ప్రశ్న --- సాయిబాబావారు ఉన్న కాలంలో మీరు యుక్తవయసులో ఉన్నారు
కదా, అపుడు మీరేమి చేసేవారు?
జవాబు --- ఆరోజుల్లో నేను తరచుగా మసీదుకు వెడుతూ ఉడేవాడిని. బాబాకు సంబంధించిన అన్ని పనులలోను ఆయనకు సహాయం చేసేవాడిని. ఉదాహరణకి బాబా చిలుము పీల్చాలనుకున్నపుడు దానిని
సిధ్ధం చేసి ఇచ్చేవాడిని.
ప్రశ్న --- మీరు, మీతండ్రిగారు ఇద్దరూ సాయిబాబాకు సహాయం చేసేవారా?
జవాబు --- అవును.
మేమిద్దరం సాయం చేస్తుండెవాళ్ళము. మానాన్నగారు
పూర్తిగా బాబా సేవకే అంకితమయ్యారు. మేమందరం
ఆయనతో చాలా సన్నిహితంగా ఉండేవారము. మేము ప్రతిరోజు
ఆయన దర్శనం చేసుకునేవారం.
ప్రశ్న --- ఇపుడు నేను చూస్తున్న ఈ ఫొటోలో సాయిబాబాతో ఉన్నవారందరూ
మీకుటుంబమేనా?
జవాబు --- అవును. (ఆయన నాకొక ఫోటోని చూపించారు. అందులో బాబా మధ్యలో నుంచుని ఉన్నారు. ఆయనకు ఎడమవైపున మహల్సాపతి, కుడివైపు మహల్సాపతి భార్య,
అనగా మార్తాండగారి తల్లి ఉన్నారు) మా అమ్మగారి
పేరు శివబాయి. ఈ ఫొటో ఖండోబా మందిరం దగ్గర
తీయించుకొన్నాము.
ప్రశ్న --- మీనాన్నగారు సాయిబాబాను మొట్టమొదటిసారి కలుసుకొన్నపుడు
ఆయన భావాతిశయంతో ప్రముఖంగా పలికిన మాట గురించి ఏమయినా చెబుతారా?
జవాబు --- బాబా షిరిడికి రెండవసారి వచ్చినపుడు మా నాన్నగారు
ఆయనను ‘ఆవోసాయి’ అని ఆహ్వానం పలికారు. అనగా
‘రండిసాయి’ అని అర్ధం. మానాన్నగారు ఎల్లపుడూ
ఖండోబా మందిరంలోనే ఉండేవారు. ఆయన ఆగుడి పూజారి. బాబా ఆయనకు అక్కడె కనిపించారు. బాబాకు మానాన్నగారే ‘సాయి’ అని పేరుపెట్టారు.
ప్రశ్న --- ‘సాయి’ అంటే అర్ధమేమిటి?
జవాబు --- ‘సాయి’ అనగా భక్తులకు దీవెనలు ఇచ్చుట. సన్యాసిగా గాని, సాధువుగా గాని ఎవరయితే ఉంటారో వారిని సాయి అని అంటారు.
ప్రశ్న --- అంటే మీఉద్దేశ్యం ప్రకారం ఒక సన్యాసిని ‘సాయి’
అని అనవచ్చా?
జవాబు --- అనవచ్చు.
ప్రశ్న --- ఆవిధంగా పిలవడం అంటే ఒక గౌరవప్రదమయిన సంబోధనా?
జవాబు --- అవును.
అది గౌరవం
ప్రశ్న --- ఆయన ‘సాయి’ అనే పిలిచారు. సాయిబాబా అని అనలేదు అవునా?
జవాబు --- అవును.
‘ఆవోసాయి’ అనే అన్నారు. ఆతరువాతనుంచి
అందరూ ఆవిధంగానే ‘సాయి, సాయి, సాయి,’ అని పిలవసాగారు. బాబాకు వయసు పెరుగుతున్న కొద్దీ ఆయనకు బాబా అనే
పదాన్ని జోడించి ‘సాయిబాబా’ అని పిలవడం ప్రారంభించారు. ఆయన షిరిడికి రెండవసారి వచ్చినపుడు ఆయన వయస్సు
21 సంవత్సరాలు. అందువల్లనే మహల్సాపతి ‘ఆవోసాయి’
అని మాత్రమే అన్నారు. ఆతరువాత 20, 25 సంవత్సరాల తరువాత ఆయన పెద్దవుతున్న కొద్దీ ప్రజలందరూ సాయిప్రక్కన బాబా అనేపదాన్ని చేర్చారు.
ప్రశ్న --- అది గౌరవంగా పిలిచే పదమా?
జవాబు --- అవును గౌరవంతో పిలవడం. బాబా అంటే అర్ధం ‘పెద్దాయన’ అలాగన్నమాట.
ప్రశ్న --- సాయిబాబా గురించి ప్రముఖంగా గుర్తుంచుకోవలసిన ముఖ్యమయిన
విషయం మీరు చెప్పదలచుకొన్నది ఏమయినా ఉందా?
జవాబు --- నాలో ఎన్నో జ్ఞాపకాలున్నాయి. కాని నేను చాలా బలహీనంగా ఉండటం వల్ల మాట్లాడలేకపోతున్నాను. ఇంతటితో మన సంభాషణ ముగిద్దాము.
ప్రశ్న --- నేను మీఫొటో తీసుకోవచ్చా?
జవాబు --- తప్పకుండా అలాగే తీసుకోండి.
ప్రశ్న --- ఆఖరిగా ఒక ప్రశ్న… సాయిబాబా మీఉద్దేశ్యంలో ఎవరు? ఆయన భగవంతుడా, లేక బ్రహ్మస్వరూపమా?
జవాబు --- కొన్ని సంవత్సరాల తరువాత బాబా భగవంతుడే అని నిర్ధారణకు
వచ్చాము. మామనస్సు ఆవిధంగా చెప్పింది. శ్రీరామచంద్రుడు, కృష్ణపరమాత్మ లాగానే ఆయనకూడా ఒక
అవతార పురుషుడని గ్రహించుకొన్నాము. అందువల్లనే
మేమాయనను పూజించుకునేవారం. ఆయన మీద ఎంతో గౌరవంతో
మానాన్నగారు ఆయనకు ఆరతినిచ్చేవారు. ప్రతిరోజు
మధ్యాహ్న ఆరతి సమయంలో మానాన్నగారు బాబాకి నైవేద్యం సమర్పిస్తూ ఉండేవారు. బాబా కొంతస్వీకరించి మిగిలినదాన్ని మసీదులో ఉన్న
భక్తులందరికీ పంచిపెట్టేవారు.
ప్రశ్న --- ఇంకా మీరేదైనా
చెప్పదలచుకున్నది ఉందా?
జవాబు --- సరిగా ఆయన సమాధిచెందడానికి పదిహేను రోజులముందు
బాబా మానాన్నగారితో ఈ విధంగా చెప్పారు. “నేను
వెళ్ళిపోతున్నాను. 15 నుండి 20 రోజులలోపల నేను
వెళ్ళిపోతున్నాను.” ఆయన అన్నట్లుగానే 15 రోజులు
లేక ఆతరువాత బాబా తమ దేహాన్ని వీడి వెళ్ళిపోయారు.
ప్రశ్న --- బాబాగారు కాలంచేసిన వెంటనే ఏమి జరిగింది?
జవాబు --- బాబా దేహాన్ని మూడురోజులపాటు ఒక చెక్కబల్లమీద ఉంచారు. వాదోపవాదాలు చెలరేగాయి. మహమ్మదీయులు “బాబా మాకు సంబంధించినవారు” అన్నారు. హిందువులు “కాదు, బాబా మాకు సంబంధించినవారు” అన్నారు. అపుడు కోర్టు కమీషనర్ షిరిడీ వచ్చారు. ఆయన బాబా హిందువు అని నిర్ధారించి ఏమి చేయాలో నిర్ణయించారు. ఆవిధంగా బాబా దేహాన్ని హిందువులకప్పగించారు.
తుకారామ్ --- బాబాగారు లంగోటీ ధరించిన కారణం చేత ఆయన శరీరాన్ని
హిందువులకు అప్పగించాలనే నిర్ణయానికి వచ్చారు.
ప్రశ్న --- లంగోటీని ధరించారని ఎపుడు గమనించారు?
జవాబు --- మూడురోజుల తరవాత
ప్రశ్న --- ఏవిధంగా చూసారు?
తుకారామ్ జవాబు
--- కమీషనర్ గారు సాయిబాబా శరీరాన్ని
పరీక్షించారు. అపుడె గమనించి నిర్ణయానికి వచ్చారు. బాబాగారు ధరించిన లంగోటీ హిందూ మతానికి సంబంధించినది.
ప్రశ్న --- సాయిబాబా హిందువని మార్తాండ బాబా నమ్ముతున్నారా
అని ఆయనను అడిగండి?
తుకురామ్ --- సహజంగానే ఆయన నమ్మకం.
ప్రశ్న --- సాయిబాబా హిందువే అని మీరు నమ్ముతున్నారా? ఆయన తరచూ భగవంతుని గూర్చి చెప్పేముందు అల్లా అని
ఫకిర్ అని అంటుండెవారు. మరి దీని గురించి మీరు
ఏవిధంగా వివరిస్తారు?
జవాబు --- బాబా హిందువే. కాని బాబా అందరినీ ప్రేమించేవారు. వారు హిందువులయినా మహమ్మదీయులైనా ఆయన అందరినీ సమంగానే
చూసేవారు. వారు ఫకీరులైనా, సాధువులయినా, యోగులైనా,
మహమ్మదీయులైనా ఎవరయినాగాని అందరినీ సమదృష్టితోనే చూసేవారు. ఆయన అందరిని ప్రేమించేవారు.
ప్రశ్న --- సాయిబాబాగారి లీలల గురించి చెబుతారా?
జవాబు --- బాబా తన భక్తులకు ఆశీర్వాదాలను మాత్రమే ఇచ్చారు. భక్తులకు ఇచ్చినట్లుగానే తనను దర్శించుకోవడానికి
వచ్చిన వారందరికీ ఆయన ఊదీని ఇస్తూ ఉండేవారు.
ఊదీనిచ్చి దీవించేవారు.
ప్రశ్న --- ఆయన తన చేతిని వారి తలలపై ఉంచేవారా? లేదా?
తుకారామ్ జవాబు
--- కొన్నిసార్లు ఆయనే భక్తుల నుదుటిమీద
ఊదీని రాసేవారు. ఏసందర్భంలోనయినా సరే ఆయన ఎప్పుడూ
ఊదీనిస్తూ ఉండేవారు. ఇదే ముఖ్యమయిన విషయం. బాబా ఆశీర్వాదాలు.
తుకారామ్. అవును. కష్టాలు ఎటువంటివయినా సరే, బాబా ఇచ్చే అభయంతో అన్నీ
సమసిపోయేవి. ఇక ఆభక్తునికి ఎటువంటి చింతా ఉండేది
కాదు.
నేను (ఆంటోనియో)--- (నాదుబాసీ స్వామి శేఖరరావు). మార్తాండబాబాగారికి ధన్యావాదాలు చెప్పండి. ఆయనకి కొంత దక్షిణ సమర్పిద్దాము. ఆయనతో మాట్లాడటం ఎంతో గౌరవంగా భావిస్తున్నామని చెప్పండి.
వెళ్ళేముందు ఆయనతో కొన్ని ఫొటొలు తీసుకుంటానని చెప్పాను. మార్తాండబాబాగారు అంగీకరించారు. సాయిబాబాతో తను, తన తండ్రి తీయించుకొన్న ఫొటోలు
కొన్ని చూపించారు.
(మార్తాండబాబా షిరిడీలొ 1986వ.సం.లో మరణించారు)
(రేపటి సంచికలో బాలాజి పిలాజి గురవ్ తో స్ంభాషణలు)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment