28.06.2021 సోమవారమ్
షిరిడి
సాయిబాబా – గురునానక్
ఒక
భక్తుని అనుభవమ్
సాయి భక్తులు తమ అనుభవాలను పంపించినట్లయితే బ్లాగులో ప్రచురించడం జరుగుతుంది.... ఓమ్ సాయిరామ్
ఆరిజోనా
(అమెరికా) నుండి సాయిభక్తుడయిన శ్రీ శ్రీనివాసరావుగారు తమ అనుభవాన్ని ఈ రోజు పంపించారు. ఇది చదివిన సాయిభక్తులకు యోగులందరూ ఒక్కటేనని వారంతా
భగవంతుని దూతలుగా ఈ భూమిపై అవతరించి తమ అవతార కార్యక్రమాన్ని పూర్తి చేస్తారని మనకు
అర్ధమవుతుంది. వారు చెప్పే బోధనలు కూడా అన్నీ
ఒకటేనని వారు బోధించేవన్నీ ప్రపంచ మానవాళిని ఉధ్ధరించడానికేనని మనం గ్రహించుకోగలమ్.
ఇక
ఆయన పంపించిన అనుభవమ్
ఓమ్
సాయిరామ్,
సాయి
బంధువులకు నమస్కారం.
నేను విదేశంనుండి నా అనుభవాలు మీతో పంచుకునే అవకాశాన్నిచ్చిన ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా ధన్యవాదములు.
బాబా ఎల్లప్పుడూ తన భక్తులను కాపాడుతున్న అనుభవాలను
సాయి బంధువులందరూ తెలుసుకోవాలని, వారికి బాబా పట్ల శ్రధ్ధ మరింత ఇనుమడించాలని బాబా
సేవలో తరిస్తున్నటువంటి సాయి శ్రీ త్యాగరాజుగారికి మరొకసారి నా ధన్యవాదములు.
ప్రపంచవ్యాప్తంగా
కొవిడ్ – 19 మహమ్మారి ఎంతోమంది ప్రజల జీవితాలను అతలాకుతలం చేసింది. దాని ప్రభావం వల్ల నాకు ఉద్యోగం కూడా పోయింది. ఈ మధ్యకాలంలో నేను సాయిబానిసగారి (శ్రీ రావాడ గోపాలరావు గారు, హైదరబాద్ వారి పుస్తకం) “ శ్రీ షిరిడీ
సాయితో ముఖాముఖి” (Face to Faci with Shiridi Sai), శ్రీ సాయి సత్ చరిత్ర, ‘శ్రీరామ
విజయం’ ఇంకా ఆధ్యాత్మిక యోగుల జీవిత చరిత్రలను చదవసాగాను.
నా
విద్యార్హతలకు అనుగుణంగా ఏది అనుకూలంగా ఉంటుందో అలాంటి ఉద్యోగాలకోసం దరఖాస్తు చేస్తూ
వచ్చాను. ఇంటర్వ్యూలలో కొన్ని మొదటి రౌండ్
లోనే పరాజయాన్ని ఎదుర్కొన్నాను. కొన్ని రెండవ
రౌండ్ లో ఉత్తీర్ణుడిని కాలేకపోయాను ఒక ఇంటర్వ్యూలో
నేను బాగా చేసాను. ఇక నిర్ణయాధికారాన్ని బాబాకే
వదిలిపెట్టాను.
కొన్ని
రోజుల తరువాత మధ్యవర్తి ద్వారా తెలిసినది ఏమిటంటే ఇంటర్వ్యూ లో నేను బాగా చేసాననీ,
నాపరంగా ఎటువంటి లోపాలు లేవని. కాని ఆ ఉద్యోగంలో
ఇంతకుముందే ఒకవ్యక్తి పనిచేసాడనీ ప్రస్తుతం అతను మరొక ఉద్యోగంలో చేరాడనీ, అందుచేత అనుభవం
ఉన్న వ్యక్తి కాబట్టి అతనికే మొదటి ప్రాద్యాన్యత ఇస్తారని చెప్పాడు. అతను కూడా ఇదే
ఉద్యోగంలో మరలా చేరే ఉద్దేశ్యంలో ఉన్నాడు. ఆ వ్యక్తి తన ఉద్యోగాన్ని వదిలి ప్రస్తుతం
మరొకదానిలో చేస్తున్నాడు. ఒకవేళ అతను తిరిగి
ఈ పాత ఉద్యోగానికే వస్తే నాకు ఇది వచ్చే అవకాశం ఉండదు.
వివిధ
బ్లాగులలో ప్రచురింపబడుతున్న ఆధ్యాత్మిక విషయాలు, బాబా లీలలు చదువుతూనే ఉన్నాను. బాబా లీలలు అనంతం. ఆయన మన ఇష్టప్రకారం చేయరు. మనకి ఏదిమంచిదో దాని ప్రకారం ఆయన విధానంలో మనకి
మేలు చేస్తారు. మన ఆలోచనలను బట్టి గాని, నమ్మకాలను
బట్టి గాని బాబా మనకు సహాయ పడతారు లేదా మనం అనుకున్నవాటికి ఆయన కొన్ని మార్పులు చేస్తారు. సాయి శ్రీ త్యాగరాజుగారి బ్లాగు కూడా చదువుతూనే
ఉన్నాను. కొద్ది రోజుల క్రిందట ఈ బ్లాగులో
ఒక కొత్త విషయం గురునానక్ గారి గురించి ప్రచురించినదానిని చదివాను.
అంతకు
ముందు నేను ఇతర బ్లాగులలో గురునానక్, వారి శిష్యుల గురించి చదవడం జరిగింది. ఇపుడు ఈ బ్లాగులో గురునానక్ గురించి చదివిన తరువాత
నాలో కొన్ని ఆసక్తికరమయిన ఆలోచనలు రేగాయి.
‘Face to Face With Shiridi Sai’ అనే పుస్తకంలో కూడా బాబా, సాయిబానిసగారిని గురుద్వారాకు
వెళ్ళి గురునానక్ గారి ఆశీర్వాదాలను తీసుకోవమని ఆదేశించారు. బాబా ఆయనను ఆవిధంగా ఎందుకని ఆదేశించారో నాకు అర్ధం
కాలేదు. అదికూడా బాబా బోధనలలో ఒక భాగమని, అన్ని మతాల సారం ఒకటేనని బాబా అభిప్రాయం కావచ్చునని
భావించాను.
ఆతరువాత
మధ్యవర్తి నాకు ఫోన్ చేసి ఇంతకుముందు పని చేసిన వ్యక్తి ఈ ఉద్యోగంలో చేరడంలేదని, అందుచేత ఆ ఉద్యోగాన్ని యాజమాన్యం నాకే ఇద్దామనే ఉద్దేశ్యంలో ఉన్నట్లు చెప్పాడు. బాబా
ఆశీర్వాదం వల్ల ఈ ఉద్యోగం నాకు లభించింది.
ఈ
ఉద్యోగం నాకు రావడానికి గల కారణాన్ని విశ్లేషించుకుంటే ఒక ఆసక్తికరమయిన విషయం తెలుసుకున్నాను. గురునానక్ గురించి కొద్ది రోజులు చదివిన తరువాత
బాబా, గురునానక్ ఇద్దరూ ఒకటే అనే విషయం నాకు బోధ పడింది. బాబా, సాయిబానిసగారిని గురుద్వారాకి ఎందుకని వెళ్లమని
ఆదేశించారో అని నాకు కలిగిన సందేహాలన్నీ నివృత్తి అయ్యాయి. నా సందేహానికి సమాధానం లభించడమే కాకుండా ఇంకా మరేదో
ఉన్నట్లు నాకనిపించింది. అది నా ఉద్యోగానికి
సంబంధించినది. గురునానక్ గారే నాకు ఈ ఉద్యోగాన్ని
ఇచ్చారని నాకనిపించింది.
దీనిని
ఏవిధంగా గురునానక్ గారే ఇచ్చారని నిర్ధారించుకోవాలి? నన్ను ఇంటర్వ్యూ చేసిన వ్యక్తిని చూసినట్లయితే ఏ
మతానికి చెందినవారో తెలుసుకోలేము. కారణం ఇంటర్వ్యూ
చేసినది ఒక మహిళ. నేను సహోద్యోగులని కూడా అడగలేను. నన్ను ఇంటర్వ్యూ చేసిన మహిళ చివరి పేరును బట్టి
ఏదయినా ఆధారం లభిస్తుందేమోనని గూగుల్ లో వెతికాను. దొరికింది.
నన్ను ఇంటర్వ్యూ చేసిన మహిళ శిక్కు మతస్థురాలు. నేను బాబాను ప్రార్ధించాను. బాబాయే గురునానక్. ఆయన తన భక్తులను ప్రేరేపించి నాకు ఉద్యోగం ఇప్పించారు.
ఏక్
ఓంకార్
శ్రీ
సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహరాజ్ కి జై
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment