29.03.2022 మంగళవారం
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ
సాయి దయాసాగరమ్ -
ముందుగా
నామాట
రెండు
నెలల తరువాత మరలా బ్లాగులో ప్రచురించే అవకాశం లభించింది. కొన్ని నెలల ముందు బాబా భక్తుల అనుభవాలతో ఉన్న రెండు
ఆంగ్ల పుస్తకాలను అనువాదం చేసి ప్రచురిద్దామన్నా కూడా రచయితలు అనుమతి నివ్వకపోవడం వల్ల
సాధ్యపడలేదు. బాబా తత్త్వ ప్రచారానికి అడ్డంకి
కాపీ రైట్. బ్లాగులో ప్రచురించడానికి మాత్రమె
అనువాదం చేసుకుంటాననీ, వ్యాపార దృష్టితో కాదని చెప్పినా కూడా అనుమతినివ్వలేదు. ఒక రచయితయితే చాలా నిబంధనలు పెట్టారు.
ఈ రోజునుండి BENOVELENCE OF SHRI SAI కి తెలుగు అనువాదం చేసి ప్రచురిస్తున్నాను. ఇందులో కొన్ని అనుభవాలు చిన్నవిగా ఉన్నా బాబా దయ ఎటువంటిదో మనం గ్రహించుకోవాలి. పుస్తకం అనువాదం చేసుకోవడానికి మరాఠీ మూలగ్రంధ రచయిత్రి, శ్రీమతి ఉజ్వల బోర్కర్ గారికి, ఆంగ్లంలోకి అనువాదం చేసిన శ్రీ ఉదయ్ అంబాదాస్ బక్షి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆయన తన మంచి మనసుతో కావాలంటె పుస్తకాన్ని తెలుగులో ప్రచురించినా (వ్యాపార దృష్టితో) తమకు అభ్యంతరం లేదని చెప్పారు. సాయి తత్త్వ ప్రచారం జనబాహుళ్యంలోకి వెళ్లడమే ఆయన ముఖ్యోద్దేశం. బాబా, వారికి వారి కుటుంబానికి అందరికి ఎల్లప్పుడు తమ అనుగ్రహాన్ని దయను ప్రసరింపచేయమని వినమ్రంగా ప్రార్ధిస్తున్నాను. గతంలో బాబా భక్తురాలయిన శ్రీమతి చంద్రాబాయి బోర్కర్ గారి గురించి ప్రచురించాను. పాఠకులు చదివే ఉంటారు.
ఇపుడు
ప్రచురింపబోయే పుస్తకం రచయిత్రి శ్రీమతి ఉజ్వలా బోర్కర్ గారికి చంద్రాబాయి బోర్కర్
గారు పెద్ద అత్తగారు. (ఉజ్వలా బోర్కర్ గారి అత్తగారి అత్తగారు). నేరుగా భక్తుల అనుభవాలను ప్రచురించకుండా ముందుగా
పుస్తకంలోని రచయితల యొక్క ముందుమాటలు కూడా అవసరం కాబట్టి వాటిని ప్రచురిస్తున్నాను.
శ్రీ
సాయి దయా సాగరమ్
మరాఠీ
మూలగ్రంధ రచయిత్రి --- శ్రీమతి ఉజ్వలా బోర్కర్, విలేపార్లే - ముంబాయి
ఆంగ్లానువాదమ్
--- శ్రీ ఉదయ్ అంబాదాస్ బక్షి
తెలుగు
అనువాదమ్ --- ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట,
హైదరాబాద్
(శ్రీ ఉదయ్ అంబాదాస్ బక్షి)
ఓమ్
శ్రీ సాయి ---
నా సోదరి శ్రీమతి ఉజ్వలా బోర్కర్ తన అత్తగారి అత్తగారయిన కీ.శే. చంద్రబాయి రాజారాం బోర్కర్ జ్ణాపకార్ధం మరాఠీ భాష్గలో ఈ పుస్తకాన్ని రచించింది. చంద్రాబాయి రాజారాం బోర్కర్ సాయిబాబాకు సోదర సోదరీమణుల సంబంధమని మనం బావించుకోవచ్చు. సాయి భక్తులెందరో ఈ పుస్తకాన్ని అమితాసక్తితో చదువుతున్నారు. అందువల్లనే ఈ పుస్తకాన్ని ఆంగ్లంలోకి అనువదించే బాధ్యతను తాయి నామీద పెట్టారు. ఆంగ్లంలో ప్రచురింపబడిన ఈ పుస్తకానికి ఎంతో ఆదరణ లబిస్తూ ఉంది. సాయిబాబాను నేను నా గురువుగా భావిస్తున్నందున నాకు లభించిన ఈ అవకాశాన్ని నా అద్రుష్టంగా భావిస్తున్నాను. ఈ అనువాద కార్యక్రమాన్ని నేను దాదాపు ఒక సంవత్సర కాలంగా చేస్తూ ఉన్నాను. ఈ మహాయజ్ణంలో నాకుమార్తె అపూర్వ, నా కుమారుడు ఆదిత్య ఇద్దరూ ఎంతో సహాయసహకారాలను అందించారు. బాబా అనుగ్రహం నాపైన ప్రసరింపబడినందువల్లనే ఈ అనువాద కార్యక్రమం సాధ్యమయింది.
సాయిబాబావారి మహిమలను తెలిపే మరొక పుస్తకాన్ని మరాఠీ భాషలో నా భార్య అనురాధ వ్రాస్తూ ఉంది. బాబా భక్తులందరూ సాయిసేవలో నిమగ్నమవడానికి కావలసిన శక్తిసామర్ధ్యాలను ప్రసాదించమని బాబాను మనఃస్ఫూర్తిగా ప్రార్ధిస్తున్నాను. నిజం చెప్పాలంటే ఈ పుస్తకంలో పొందుపరచిన అనుభవాలు ఏవీ కూడా కల్పితాలు కావు. అన్నీ భక్తులయొక్క స్వీయానుభవాలు. సాయి భక్తులందరికీ ఈ అనుభవాలు అన్నీ చేరాలనే ఉద్దేశ్యంతో ప్రప్రధమంగా మరాఠీ భాషనుండి ఆంగ్లంలోకి తర్జుమా చేసే ప్రయత్నం జరిగింది. ఒకవేళ ఎక్కడయినా తప్పులు ఉంటే మన్నించమని కోరుకొంటూ…
ఉదయ్
అంబాదాస్ బక్షి, (ఔరంగాబాద్)
(రేపటి సంచికలో పుస్తకం గురించి పరిచయ వాక్యాలు)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment