02.04.2022 శనివారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
శ్రీ
మాత్రే నమః
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శుభకృత్
నామ సంవత్సర శుభాకాంక్షలు
శ్రీ
సాయి దయా సాగరమ్ 5 వ, భాగమ్
మరాఠీ
మూలగ్రంధ రచయిత్రి --- శ్రీమతి ఉజ్వలా బోర్కర్, విలేపార్లే - ముంబాయి
ఆంగ్లానువాదమ్
--- శ్రీ ఉదయ్ అంబాదాస్ బక్షి
తెలుగు
అనువాదమ్ --- ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట,
హైదరాబాద్
1898 వ.సంవత్సరంలో నా వయసు 28 సంవత్సరాలప్పుడు మొట్టమొదటిసారిగా బాబాను దర్శించుకునే అవకాశం లబించింది. దాదాపుగా 15 సంవత్సరాలపాటు సాయిబాబా సేవలో ఉన్న తరువాత 1913 వ.సం.లో గురుపూర్ణిమనాడు బాబా నాకొక క్రొత్త బాధ్యతను అప్పచెప్పారు. నన్ను ఖండోబా మందిరానికి వెళ్ళి కాశీనాధ్ శాస్త్రిని సేవించుకోమని చెప్పారు. ఇది చాలా కష్టమయిన పని. చాలా శ్రమించాలి. కాని నేను నా కర్తవ్యాన్ని సరిగా నిర్వర్తించాను.
సాయి నన్ను పూజకు కావలసిన సరుకులను, నైవేద్యానికి
కావలసినవి అన్నీ తీసుకుని కాశీనాధ్ శాస్త్రి వద్దకు వెళ్ళమని చెప్పారు. అది చాలా కష్టమయిన పని. కారణమేమిటంటె కాశీనాధ్ శాస్త్రి తనను పూజించడానికి ఎవ్వరినీ ఎప్పుడూ అనుమతించేవారు కాదు. కాని నేను ఆపని చేయగలిగాను. నేను ఒక ఐరన్ లేడీ అని బాబా ఉద్దేశ్యం. అందువల్లనే బాబా నాకు చాలా కష్టమయిన పనులు
అప్పజెబుతూ ఉండేవారు. బాబా చెప్పినందువల్లనే
నేను ఈ పనులు చేస్తున్నానని కాశీనాధ్ శాస్గ్త్రికి చెప్పిన తరువాత ఆయన నన్ను అనుమతించారు. ఆయనకు నేను ఆరతి కుడా ఇస్తూ ఉండేదానిని. కాశీనాధ్ బాబా ప్రవర్తన వల్ల ప్రజలు ఆయనను ద్వేషించేవారు. దీని తరువాత నేను ఆయనకు ఎప్పుడూ పూజ సలపలేదు. కారణం ఆయన నా గురుబంధువు. సాయిబాబా ఎవ్వరినీ ద్వేషించవద్దని ఎల్లపుడూ చెబుతూ
ఉండేవారు. అందుచేత అందరూ ద్వేషించేటట్లుగా
నేనెప్పుడూ కాశీనాధ్ శాస్త్రిని ద్వేషించలేదు.
ఆతరువాత కాశీనాధ్ బాబా ఉపాసనీ బాబాగా ప్రసిధ్ధి చెందారు.
బాయిజాబాయి,
బాబా కూడానే ఉంటూ ఆయనకి భోజన ఏర్పాట్లు చేస్తూ ఉండేది. ఆమె భర్త ఆమెకు సహాయపడుతుండేవారు. తాత్యాకోతే పాటిల్ సాయిబాబా ప్రక్కనే కూర్చునేవాడు. తాత్యాకు సంతానాన్ని ప్రసాదించమని నేను బాబాని అర్ధిస్తూ
ఉండేదానిని. అపుడు బాబా తాత్యాకే కాదు నీకు
కూడా సంతానం కలుగుతుంది అని అన్నారు. నాకపుడు
47 సం. వయస్సు. “బాబా అదెలా సాధ్యం” అన్నాను. కాని బాబా అన్నట్లుగానే నాకు కుమారుడు జన్మించాడు. మూడు సంవత్సరాల తరువాత నాకు పీరియడ్స్ ఆగిపోయాయి. పరీక్ష కోసం నేను డా.పురందరే దగ్గరకు వెళ్ళాను. ఆయన పరీక్ష చేసి నా కడుపులో కణితి ఉందనీ దానిని
శస్త్రచికిత్స చేసి తీసేయాలని చెప్పారు. కాని
నేను ఒక్క పదినెలలు ఆగుదామని ధృఢంగా నిశ్చయించుకున్నాను. 51 సం.దాటిన తరువాత గర్భం దాల్చడం అసంభవమని వైద్యుడు
అన్నారు.
బాబా
తన దీవెనలతో సాధ్యం చేసారు. నాకు బిడ్డ జన్మించినపుడు
చెంబూరులో ఉన్నాను. అక్కడ ఆ సమయంలో వైద్యులు
గాని నర్సు గాని లేరు. రోజంతా పనిచేసుకుంటూనే
ఉన్నాను. నాకు సుఖప్రసవం అయింది. చాలా రోజులు నేను ఉపవాసం ఉండటం వల్ల నాకు చాలా సమస్యలు
వచ్చాయి. కాని నేను ఊదీని సేవిస్తూ ఉండేదానిని. బాబా అనుగ్రహం, దీవెనలతో నాకు మగశిశువు జన్మించాడు. వాడికి రాజారాం రామచంద్ర బోర్కర్ అని నామకరణం చేసాము. అలాగే తాత్యాకోతేకి కూడా మగపిల్లవాడు జన్మించాడు. వాడికి
బాజీరావు కోతే అని పేరు పెట్టారు.
నాభర్త
6 నెలలకు చనిపోతారనగా ఆసంఘటనను తట్టుకునేలా
బాబా నన్ను ముందుగానే తయారు చేసారు. బాబా నాకు
స్వప్నంలో కనిపించి రామచంద్రను తనతో తీసుకుని వెడుతున్నట్లుగా చెప్పారు. అపుడు నేను బాబాతో నా భర్తకి బదులుగా నన్ను తీసుకువెళ్లమని
అన్నాను. కాని బాబా “లేదు, నువ్వింకా చేయవలసిన
పని ఎంతో ఉంది” అన్నారు. నాకు వచ్చిన కల గురించి
నా భర్తకు చెప్పినపుడు తను పెద్దగా ఆవిషయాన్ని పట్టించుకోలేదు. రెండు నెలల తరవాత నా భర్తకి కిడ్నీలో సమస్యలు ఏర్పడ్డాయి. తొందరలోనే ప్రమాదకర స్థితి ఏర్పడింది. కనీసం చైత్రమాసం పూర్తయేవరకయినా నా భర్తని బ్రతికించమని
బాబాని వేడుకున్నాను. మరుసటి రోజే నా భర్త
కోలుకోవడం మొదలయి తొందరలోనే మామూలు మనిషయ్యారు.
ఆతరువాత కార్తీక పౌర్ణమి వెళ్ళిన తర్వాత ప్రతిపాద రోజున నా భర్త నన్ను తేనీరు
ఇమ్మని అడిగారు. తేనీరు త్రాగిన తరువాత ఆరతినివ్వమని
చెప్పి విష్ణుసహస్ర నామ పారాయణ చేయసాగారు.
మరునాడు ఉదయం వరకు అలా పారాయణ చేస్తూనే ఉన్నారు. ఉదయం ఆయనకు గంగాజలం ఇచ్చాను. అది త్రాగిన తరువాత “రామ్ – రామ్” అంటూ ఈ ప్రపంచాన్ని
వీడి వెళ్ళిపోయారు. ప్రపంచాన్ని వదలి వెళ్ళేముందు
ఆయన రామనామాన్ని జపిస్తూనే ఉన్నారు. బాబా నాభర్త
జీవితాన్ని కొంతకాలం పొడిగించారు.
కీ.శే.
శ్రీమతి చంద్రాబాయి బోర్కర్ చెప్పిన వివరాలు.
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment