బాబా గారు నమ్మకం లేనివారికి కూడా తలుచుకున్న వెంటనే తన లీల చూపించి తనకు దగ్గరగా చేసుకుంటారు.
దానికి సంబంథించిన లీలను ఈ రోజు మనం తెలుసుకుందాము.
మనం చదివిన లేదా విన్న ప్రతి బాబా లీలను ఎల్లప్పుడూ తలుచుకుంటూ ఉంటే మనం బాబాగారికి దగ్గరిగా ఉంటామనడంలో ఎటువంటి సందేహము లేదు.
బాబా సర్వంతర్యామి అని మనకు తెలుసు. మనకి ముందర నమ్మకం లేకపోయినా సరే ఆర్తితో ఒక్కమారు పిలిచినా చాలు లేద ఆయన నామాన్ని స్మరించినా చాలు. నేను ఉన్నాను నీకు అంటూ తన లీలను చూపిస్తారు. ఇక మనం ఆయన్ని మనం వదలం బాబా గారు మనలని వదలరు.
గోపీచంద్
తెలుగులో ప్రముఖ నవలా రచయిత శ్రీ త్రిపురనేని గోపిచంద్ . ఆయన తండ్రి నాస్తికుడు. తన తండ్రి అడుగుజాడలలోనే గోపీచంద్ నడిచాడు. 1954 లో కర్నూలులో ఏ పీ గవర్నమెంట్లో డైరెక్టర్ ఆఫ్ పబ్లిసిటీ గా పని చేశారు. ఆయన భార్య ప్రసవం కోసం గవర్నమెంట్ ఆస్పత్రిలో అడ్మిట్ అయింది. నొప్పులు వస్తూ చాలా హార్డ్ లేబర్ గా ఉంది. 3 రోజులు అయినా గాని రిలీఫ్ లేదు. గోపీచంద్ నిద్రలేని రాత్రులు, పగళ్ళు గడిపాడు. మూడవ రోజున తుంగభద్ర నది ఒడ్డున ఉన్న బాబా గుడి వద్దనుంచి నడుస్తూ వెళ్ళడం తటస్థించింది.
ఇక తీవ్రమైన దుంఖము, ఆవేదనతో నిండి ఉన్న గోపీచంద్ బాబాని ఉద్దైశించి ఇలా అన్నారు. "ప్రజలంతా నువ్వు దేవుడవని అంటారు. నీలో చాలా శక్తులు ఉన్నాయి. ఆర్తులను నువ్వు ఆదుకుంటావని అంటారు. ఇదేకనక నిజమయితే నువ్వు నాకు సహాయం చెయ్యి. నా భార్యకు నొప్పులు లేకుండా సుఖ ప్రసవం అయ్యేటట్లు చూడు. అప్పుడే నేను నిన్ను సర్వంతర్యామివని నమ్ముతాను. ఇలా అనుకుంటూ ఆస్పత్రికి వెళ్ళారు.
ఆయన ఆస్పత్రికి వెళ్ళేటప్పటికి ఆయన భార్యకు తేలికగా సుఖ ప్రసవం అయింది. మగ పిల్లవాడు జన్మించాడు. కొంత సేపటి తరువాత ఆయన గదిలో ఉన్న భార్య వద్దకు వెళ్ళారు. అప్పుడు ఆమె జరిగిందంతా చెప్పింది.
"ఒక ముసలాయన గడ్డంతో అంగరఖా తొడుక్కుని వుండి సటకాతో వచ్చాడు. మంచం మీద ప్రక్కన కూర్చుని "బిడ్డా బాథ పడవద్దు. నీకు నెప్పులు లేకుండా సుఖప్రసవం అవుతుంది ఇప్పుడే అని చెప్పి నా నుదుటిమీద ఊదీ పెట్టారు. నీటిలో ఊదీ కలిపి నాచేత తాగించారు. నేను ఆనీటిని త్రాగగానె మగ పిల్లవాడు జన్మించాడు.
నాకు ఇప్పుడు ఏవిథమయిన నొప్పులూ లేవు. నేను క్షేమంగా ఉన్నాను అని చెప్పింది. గోపీచంద్ ఆయన ఏ సమయంలో వచ్చారు అని అడిగారు. ఆమె ఆ ముసలాయన వచ్చిన సమయం చెప్పింది. గోపిచంద్ బాబాతో ఏ సమయంలో అయితే తన మనస్సులో సవాల్ చేశారో అదే సమయంలో ఇక్కడ ఆస్పత్రిలో బాబా ప్రత్యక్షమయి తను సర్వంతర్యమినని చాటారు. గోపిచంద్ తన కొడుకికి సాయిబాబా అని నామకరణం చేశారు.
సర్వం సాయినాథార్పణమస్తు
1 comments:
🕉 sai Ram
Post a Comment