బాబా మీద మనసు నిలిపి ధ్యానం చేయండి
08.01.2011 శనివారం పిలిస్తే పలుకుతారు బాబాఓం సాయి శ్రీసాయి జయ జయ సాయి
తెలుగులో బాబా లీలలు పోస్ట్ చేసే అవకాశాన్ని నాకు బాబా గారు ఇచ్చినందుకు వారికి నేను యెల్లప్పుడు కృతజ్ఞుడిని.
2 నెలల క్రితం నాకు హైదరాబాదులో బైపాస్ సర్జెరీ జరిగింది. బాబాగారి దయ వలన ముందరే బ్లాక్స్ ఉన్నట్లు తెలిసింది.
శ్రీమతి ప్రియాంకాగారి ద్వారా బాబాగారు నాకు ఈ తెలుగు బ్లాగులో మన సాయి బంథువులందరికీ బాబాగారి లీలలను తెలియచేసే భాగ్యాన్ని ఇలా అనుగ్రహించారు.
బాబా లీల -- నా ప్రత్యక్ష అనుభవం
మేము ప్రతి శనివారమునాడు సాయంత్రం 4 గంటలకు బాబా సత్సంగం చేస్తూ ఉంటాము. ఆ సత్సంగం వలననే నాకు బాబా గారి యొక్క బోథలు, లీలలు అన్నీ అవగాహనకు వచ్చాయి.
బాబా చరిత్ర మనము మాములుగా పారాయణ చేసి వదిలివేడము కాదు. అందులో ఆయన చెప్పిన విషాయాలన్నిటిని గుర్తు చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మన ఆలోచనలు కూడా బాబాగారి మీదే కేంద్రీకృతమయి ఉంటాయి. సజ్జన సాంగత్యాన్ని మించిన సాంగత్యం మరొకటి లేదు.
2 సంవత్సరాల క్రితం జరిగినది ఈ లీల. ఒక గురువారమునాడు నేను మామూలుగ బాబాగారికి పూజ చేసుకుని సాష్టాంగ నమస్కారము చేసి మా ఆవిడతో ఇవాళ బాబాగారు మన ఇంటికి భోజనానికి వస్తారు అని అన్నాను. బాబాగారు ఎందుకు వస్తారండి రోజు ఆయనకి మనం నైవేద్యం పెట్టే భోజనం చేస్తున్నము కదా అంది. ప్రతి గురువారమునాడు మా ఆవిడ భోజనము చేయదు. నాకు మాత్రమే వండి ఉంచుతుంది. ఆరోజు నేను మొత్తము భోజనం చేసి పాత్రలు ఖాళి చేస్తూ మనసులో ఇలా అనుకున్నాను. బాబా గారు ఇవాళ భోజనానికి వస్తే ఏమి పెడుతుంది అనుకున్నాను. తరువాత నేను ఆఫీస్ కి వెళ్ళిపోవడం జరిగింది. మాఅవిడ నేను వెళ్ళాక దాసుగణు వ్రాసిన స్థవనమంజరి చదువుకుంటూ ఉండగ ఇద్దరు బ్రాహ్మణులు వచ్చి తలుపు తట్టారు. మాఅవిడ లేచి వారిని లోపలకు రమ్మని సోఫాలో కూర్చోపెట్టింది. తరువాత వారు ఆశీర్వచనం చదివి దక్షిన అడిగారు. మాఅవిడ ఇద్దరికి కలిపి 22 రూపాయలు ఇచ్చింది. అప్పుడు వారు అమ్మా మొత్తం 30 రూపాయలు ఇవ్వండి హోటలులో భోజనం చేస్తాము అని అడిగి 30 రూపాయలు తీసుకుని " మీకు ప్రహ్లాదుడులాంటి మనవడు పుడతాడమ్మా అని దీవించి వెళ్ళారు.
ఈ జరిగిన సంఘటన విన్నాక ఆవచ్చినవారు బాబా గారు, దాసుగణు తప్ప మరియెవరూ కాదు అనిపించింది.
బాబా గారు భోజనానికి వస్తారు అనగానె అదే రోజు రావడం చాల ఆనందం వేసింది. ఆరోజు ఇంటిలొ ఇక పదార్థాలు లేవని వారికి తెలుసు. సర్వాంతర్యామి కదా అందుకే ఇంకా డబ్బులు ఇవ్వండి హోటలులో భోజనం చేస్తాము అని అడిగి మరీ తీసుకున్నారు.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు
0 comments:
Post a Comment