09.01.2011 ( ఆదివారం)
భక్త పరాథీన
ఎన్నోజన్మల బంథం ఉంటేగాని సాయి భక్తుడివి కాలేవు. సాయి భక్తుడయినవాడు ఎల్లప్పుడు సాయి నామస్మరణ చేస్తూ ఉంటే బాబాగారు మనవెంటే ఉంటారు. మనలని కంటికి రెప్పల కాపాడుటూ ఉంటారనడంలో యెటువంటి సందేహము లేదు.
మరి బాబా తత్వం అర్ధం చేసుకొవడం యెల?
బాబా సచ్చరిత్ర పారాయణ చెయ్యాలి. అందులోని విషయాలని గ్రహించి వాటి ప్రకారం నడచుకోవాలి. మరి ఈవిషయాలన్ని విపులంగా ఆకళింపు చేసుకోవాలంటే సత్సాంగత్యాన్నీ మించింది లేదు. సత్సంగం వల్ల యెన్నో మంచి మంచి విషయాలు తెలుస్తాయి. బాబా లీలౌ ఒకరికొకరు చెప్పుకొని పంచుకుంటూఉంటే మనలో బాబా మీద భక్తి మరింతగా యెక్కువ అవుతుంది. అది అనుభవించినవారికే తెలుస్తుంది.
మరోసారి సత్సంగం గురించి విపులంగా తెలుసుకుందాము.
**************************************************************************************
సాయి బంధువులందరికీ బాబాగారి సుభాశీశ్శులు
బాబా ప్రేమని ఎవరూకూడా వర్ణించలేరు. దానిని యెవరికి వారు అనుభవిస్తే తప్ప తెలిసికోలేరు. తల్లికి బిడ్డకి మధ్యన ఉండే వాత్స్యల్యంలాంటిది. ఈ రోజు మనం బాబాగారు చిన్నపిల్లవాడిలో ప్రవేశించి తన ఫొటో ఎక్కడ వుందో చెప్పిన వైనం గురించి తెలుసుకుందాము.
మాది నరసాపురం పశ్చిమగోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేష్.
మేము అనగా సాయి బంధువులందరమూ ప్రతి శనివారము బాబా సత్సంగము చేస్తూ ఉంటాము. ఒక రోజు అనగా 13.12.2008 నాడు మేమందరమూ కలిసి మాఊరికి 35 కి.మీ. దూరములో ఉన్న జగ్గన్నపేటలో సత్సంగం చేయడానికి నిర్ణయించుకున్నాము. మొదటగా అప్పనపల్లి వెదదామని ప్లాన్ చేసుకున్నాము. అప్పనపల్లి వెంకతేశ్వరస్వామి ఆలయంతో చాల ప్రసిథ్థి చెందిన పుణ్య క్షేత్రం. జగ్గన్నపేటలొ సాయంత్రం 3 గంటలకు సత్సంగం చేయడానికి నిర్ణయించుకున్నాము. సత్సంగంలో బాబాఫొటో పెట్టి చేస్తూ ఉంటాము. ప్రతిసారి కొత్త ఫొటొ కొని మా సత్సంగంలో సభ్యురాలయిన శ్రీమతి మీనాక్షిగారు తెస్తూ ఉంటారు. మేము ఆరోజు ప్రొద్దున్న 8 గంటలకు బస్ శ్టాండ్ నుంచి బయలుదేరదామని అనుకున్నాము. క్రితం రోజు మీనాక్షిగారు బాబా ఫొటొ కొని ఉంచారు. వారి ఇంటిలో మొత్తం 6 గదులు ఉన్నాయి. బయలుదేరే సమయానికి ఫొటొ కోసం చూస్తే యెక్కడ పెట్టారో కనపడలేదు. యెక్కడ పెట్టరో మరిచిపోయారు. ఇంటిలోని ప్రతీ గదీ వెతికారు. బస్ కి సమయం కూడ కావస్తోంది. 8.15 అయింది, 8.30 కి బస్.
ఆఖరికి ఇంటిలో ఉన్న బాబా ఫొటొ ముందు మోకరిల్లి ఆయన సహాయం కోసం అర్థించారు. బాబా, బస్ కి సమయం కావస్తోంది. నీ ఫోటో అక్కడ సత్సంగం లో ఇవ్వాలి. ఫొటో నువ్వే వెతికి నాకు చూపించు బాబా అని కన్నీటితో సహాయాన్ని అడిగింది. ఆమె అలా ప్రార్థించగానే ఆమె సోదరి కొడుకు ఒకటిన్నర సంవత్సరములు ఉంటాయి, వచ్చి ఆమె చేయిపట్టుకుని ఒక గదిలోనికి తీసుకెళ్ళాడు. అక్కడ గదిలో ఉన్న బాబాఫొటో వైపు కుడిచేతితో చూపించాడు. అదిచూసి మీనాక్షిగారికి చాలా ఆశ్చర్యంవేసింది, ఈ లీలను చూసి. చూసారా బాబాగారు కేవలం ఊహతెలియని చిన్నబాలుడిలో ప్రవేసించి యెటువంటి చిత్రం చేసారో. ఆచిన్న బాబుకి బాబా యెవరో తెలియదు, పైగా మీనాక్షిగారు బాబా ఫొటొ గురించి బాథపడుతున్నారని తెలియదు. మరి ఈ లీల
యెవరిద్వారా జరిగింది. భాబాగారు తప్ప యెవరు చేయగలరు.
సర్వం శ్రీసాయినాథార్పణమస్తు
0 comments:
Post a Comment