11.01.2011 మంగళవారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
ఈరోజు మనం ఇంకొక బాబా భక్తుని అనుభవాన్ని ఆయన మాటలలోనే తెలుసుకుందాము. బాబాగారు యెవరికి యేరూపంలో కనపడతారో ఎవరికీ తెలియదు. ఆయన భౌతిక రూపంలో కనపడడం చాలా అదృష్టం. అప్పుడు మనలో భక్తిభావం ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఇక బాబాని మనం వదిలిపెట్టం.
బాబా తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలే గాని ఆయనని మించిన శక్తి ఏదీకూడా లేదని మనకి అవగతమౌతుంది. బాబాతో మనకి అనుబంధం పెరగాలంటే బాబా లీలలు ఒక్కటే చదవడం, తెలిసికోవదం కాకుండా బాబా భక్తులందరూ తమ తమ అనుభవాలన్నీ మిగతా సాయి భక్తులందరితో పంచుకుంటూ ఉండాలి.
ఇది శ్రీ నడుపల్లి సూర్యనారాయణ గారు, నర్సాపురం వారు చెప్పినది. నా చిన్న తనంలో నేను హైస్కూల్ లో చదువుకునేటప్పుడు ఆయన మాకు మాస్టారు. ఇప్పుడు ఆయన విశ్రాంత ఉపాధ్యాయులు. ఆయన కుడా బాబా భక్తులు,
నేను ఇప్పుడు ఆయన చెప్పిన అనుభవాన్ని ఆయన మాటలలోనే మీముందు ఉంచుతున్నాను.
*************************************************************************************
1995 నుంచి కుడా నేను హార్ట్ ప్రోబ్లెంతోబాధ పడుతున్నాను. 2001 సం.లో దిసంబరులో హార్ట్ ఆపరేషన్ చేయించుకునేముందు బాబా గారిని దర్సనం చేసుకుందామని షిరిడి వెళ్ళడం జరిగింది. మరునాడు ప్రొద్దున హారతికి వెళ్లాను, కాని మధ్యా హ్నం హారతికి ఉండలేకపోయాను. నేను నాభార్యతో కలిసి లాడ్జి కి తిరిగి వస్తూ నడుస్తున్నాను. 20 మీటర్ల దూరంలో నాభార్య నడుస్తూ వస్తోంది. హటాత్తుగా వెనకనుంచి నా ఫాంట్ ని పై నుంచి కిందదాకా ఎవరో తడుముతున్నట్లుగా అనిపించింది. ఎవరో దొంగ నా పర్సు మరి యూ డబ్బులు దొంగిలించుదామని నా జేబులు తడుముతున్నాడని భావించాను. వెంటనే వెనక్కి తిరిగి చూసాను. వెనకాల 15 అడుగుల బాబా గారి విశ్వరూపం కనపడింది. బాబా గారు తన రెండు చేతులతో నన్ను ఆశీర్వదిస్టున్నట్లుగా కనపడింది. నేను వెనక వస్తున్న నా భార్యని బాబాగారి విరాట్ స్వరూపాన్ని చూసావా అని అడిగాను. నా భార్య తను చూడలేదని చెప్పింది. నాకు మాత్రం బాబాగారు తన రెండు చేతులతో నన్నుదీవిస్తున్నట్లుగా కనపడింది. 2006 ఫిబ్రవరి 6 తారీకున నాకు హార్ట్ సర్జరీ అయింది. రెండు రోజులు కోమాలో ఉన్నాను. రెండవరోజున నేను కళ్ళు తెరిచేముందు, ఇద్దరు యమకింకరులు నేను ఉన్న గదిలో ఒకరితరువాత ఒకరుగా నన్ను పైకి కిందకి తమతమ బల్లాలతోఎ గరవేయడం మొదలుపెట్టారు వారు తమబ ల్లాలతో నన్ను పైన తిప్పుతూ హటాత్తుగా నా శరీరం గదిగోడలకు తగిలే ఉద్దేశ్యంతో బల్లాలను తీసివేయడం మొదలుపెట్టారు. ఆ సమయంలో నేను "సాయి రామా" అని జపించుకుంటూ ఉన్నాను. సాయి నాధుని అనుగ్రహంతో నేను పైనుంచి మెల్లగా కిందకి పడడం మొదలుపెట్టాను. ఈ విధంగా చాలా సార్లు జరిగింది. ఇద్దరు కింకరులు ఇక నేను చావనని విసిగి వెళ్ళిపోయారు. 2 నిమిషాల తరువాత నేను మెల్లగా ఉపిరి పీల్చుకుని కళ్ళు తెరిచాను. 6 రోజులతరువాత నన్ను ఐ సీ యు లోనుంచి జనరల్ వార్డ్ తీసుకునివచ్చారు. 9 రోజులతరువాత హాస్పటల్నుంచి డిశ్చార్జ్ అయ్యాను. బాబాగారి దయ వలన నా స్నేహితులు ఆపరేషన్ కి కావలసిన ధన సహాయం చేసినాప్రాణాన్ని నిలబెట్టారు. 1994 నుంచి నేను బాబాగారికి బాగా భక్తుడిని అయిపోయాను. మూడు నెలల తరువాత నేను హైదరాబాదులో ని బీరమ్గూడలో ఉన్న బాబా గుడికి వెళ్లాను. బాబా కళ్ళలోకి సూటిగా చూస్తూ ఇలా అన్నాను. బాబా 2001డిశంబరు నుంచి నాకు ఎందుకు కనపడటల్లేదు? నేను ఏమి తప్పు చేశాను? హటాత్తుగా బాబాగారి కళ్ళు నీలంగా మారిపోయి తన పాదాల వంక చుదమన్నట్లుగా సంజ్ణ చేస్తున్నట్లుగా అనిపించింది. కొన్ని నిమిమిషాలు ఆయన అలా కళ్ళు తిప్పారు. నాకు తెలియకుండానే నాక ళ్ళవెంట కన్నీరు నా చెంపలమీదుగా కారింది.
దీని అర్ధం ఏమిటంటే నా పాదాలని ఎప్పుడు విడవకు అని చెప్పడం. ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే బాబా గారు కళ్ళు తెరిచారు అని మరునాడు దిన పత్రికలలో చదవడం తటస్థించింది.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు
0 comments:
Post a Comment