సత్సంగ ప్రారంభ లీల
ఓం సాయి శ్రీసాయి జయ జయ సాయి
మన మనసులో మంచి సంకల్పం ఉండాలే గాని బాబాగారి ద్వారా అవి నెరవరతాయనడంలో యెటువం
టి సందేహము అక్కరలేదు. మన మన్సు మంచిది అవ్వాలి, మన ప్రవర్తన మంచిగా ఉండాలి, మనమాటతీరు మృదువుగా ఉండాలి , మొహములో ప్రసన్నతా ఉండాలి. ఇవన్నీ కూడా ప్రతీ సాయి భక్తుదూ తప్పక ఆచరించతగ్గవి.
ఈ రోజు నేను ద్వారకామాయి సాయి బంధు సేవా సత్సంగ్ స్థాపించిన శ్రీమతి పి.వి. మీనాక్షి గారి బాబా లీలలను గూర్చి చెప్పుకుందాము.
లీలా నం. 1
ఈ లీలను చెప్పేముందు మొదటగా సాయి నాధుని ప్రార్థిస్తున్నాను. మేము ఈ సత్సంగాన్ని 2007 లో బాబాగారి దయతో ప్రారంభించాము. మేము ఆయన చూపే ఎన్నొ లీలలను చూస్తున్నాము. అందులో మొదటగ ఈ సత్సంగం ప్రారంభమయిన లీలను ఆమె మాటలలలోనే తెలుసుకుందాము.
*********************************************************************************
ఒకరోజున నేను, నా స్నెహితురాలు (ఈమె కూడా సత్సంగానికి 108 పాటలను వ్రాసారు) సత్సంగం కొత్తగా ప్రారంభించడం గురించి మట్లాడుకుంటున్నాము. ఆ సమయంలో సత్సంగానికి ప్రారంభపు సొమ్ము యేదీ లేదు. ఈ సత్సంగం తరఫున ఎన్నో సేవా కర్యక్రమములు చేద్దామనుకొన్నాము. కాని మొదటగా ప్రారంభపు సొమ్ము యేది లేదు. కాని యే భక్తునివద్దనించి సొమ్ము అడగకుండా ప్రారంభిద్దామని అనుకున్నాము. ఇలా మాట్లాడుకుంటూ మేము నడుస్తూఉన్నాము. దారిలో ఒక రంగుల షాప్ వద్దకు పనిఉండి వెళ్ళాము. అక్కడ కుర్చీలో ఒక 500 రూపాయల నోటు ఒకటి పడి ఉంది. నేను ఆ నోటు తీసుకుని పక్కన కుర్చీలో కూర్చున్న అతనిని "ఈ నోటు ఎవరిది అని అడిగాను. ఆ వ్యక్తి ఆనోటు తనది కాదు అని చెప్పాడు. మరలా నేను ఆ షొప్ యజమానిని అడిగాను. అతనుకూడా తనది కాదు అని చెప్పాడు. మేము ఆ షాపు యజమానితో మరలా రేపు వస్తాము, ఎవరయినా 500 రూపాయలు పోగుట్టుకున్నామని అడిగితే మాకు చెప్పండి అని మా వివరాలూ, చిరునామా అన్నీ ఇచ్చి ఆ నోటు తీసుకుని వచ్చేశాము. మరునాడు మేము ఆ షాపు కివెళ్ళి యెవరయినా నోటు పారేసుకున్నామని వచ్చారా అని అడిగాము. ఆ షాప్ యజమాని యెవరూ కూడా నోటు పారేసుకున్నామని రాలేదు అని చెప్పాడు. అప్పుడు మాకు అనుమానం వచ్చింది. అసలు ఇది మంచినోటేనా లేక దొంగ నోటా అని. అంధుచేత మేము ఆ సాయంత్రం బ్యాంక్ కి వెళ్ళి ఆ నోటు మంచిదా లేక దొంగనోటా అని అడిగాము. వారు ఆ నోటు మంచిదే అని చెప్పారు. అందుచేత ఆ సొమ్ము బాబాగారే మా సత్సంగం ప్రారంభించడానికి తన మొదటి చందాగా ఇచ్చినట్లు భావించాము. మరునాడు నేను, నా స్నేహితురాలు చివర సున్నా లేకుండా ,500 కి కొంత సొమ్ము వేద్దామనుకున్నాము. అంటే 500/- కాకుండా 501/- ఇలా మాట్లాడుకుంటూ వెడుతుండగా మాకు రోడ్డు మీద 5 రూపాయల నాణెం కనపడింది. ఈవిధంగా బాబాగారు మా సత్సంగానికి తమ మొదటి చందాగా 505/- రూపాయలు ఇచ్చారనటానికి నిదర్శనం. నాకు నాపేరు గాని విద్యార్హతలు గాని చెప్పుకోవడానికి ఇష్ట పడను. దాని వల్ల అహం పెరుగుతుంది. బాబాగారి భక్తురాలిగా ఉండడమే నాకు ఇష్టం. బాబాగారిని నాన్ను యెల్లప్పుడు రక్షించమని వేడుకుంటు ఉంటాను. నేను సాయి సత్సంగంలో సభ్యురాలిగా ఉండి సేవ చేయడమే.
లీల నం.2
మా శ్రీ ద్వారకామాయి సాయి బంథు సేవా సత్సంగ్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా 2008 అక్టోబర్ విజయదశమినాడు అన్నదానం చేయడానికి నిర్ణయించుకున్నాము. ఆరోజు 108 మంది బీదవారికి అన్నదానం జరుపుదామని నిశ్చయించాము. మేము వంటలు చేయడానికి వంటవారినెవరినీ పిలవకుండా మొత్తం పదార్థాలన్నీ మేమే స్వయంగా తయారు చేద్దామనుకున్నాము.
మా చిన్న చెల్లెలు (ఆమె కూడా సత్సంగంలో సభ్యులారు) ఇంకొక ఇద్దరము ప్రథానమయిన వంటవారు. నేను, మిగతా భక్తులం సహాయం చేస్తున్నాము. వంట ప్రారంభించేముందు నేను బాబాగారికి కొబ్బరికాయ కొడదామనుకున్నాను. ఈ యెర్పాటులన్నీ కూడా బాబాగారి గుడి ప్రక్కనే జరుగుతున్నాయి. మా చెల్లెలు తనకు 108 మందికి వంట చేయడంలో అనుభవం లేదని చెప్పింది. వంటలన్నీ ఎలాఉంటాయోనని మేము భయపడ్డాము, ఎందుకంటె బాబాగారికి నైవేద్యం పెట్టకుండా రుచి చూడలేము కదా. నేను కూడా చాలా భయపడ్డాను, ఎందుకంటే వంటలు ప్రారంభిచేముందు బాబాగారికి కొబ్బరికాయ కొట్టడం మర్చిపోయాను. అప్పుడు నేను కొబ్బరికాయ తీసుకుని బాబా గారి వద్దకు వెళ్ళి ఇలా ప్రార్హించాను," బాబా ఇదంతా కూడా నువ్వు తయారుచేసినదే, ప్రథాన సూత్రథారివి నువ్వే, మేము నిన్ను అనుసరించేవారిమి మాత్రమే బాబా."
మొదటగ ఈ సత్సంగం యెక్కడయితే ప్రారంభమయిందో ఆ గుడిలో అన్నదానం జరుగుతోంది. అన్నదానం జరిపేముందు మేము బాబాకి నైవేద్యం పెట్టాము. నైవేద్యం కాగానే మొదటి బాచ్ కి వడ్డించడం మొదలు పెట్టాము. ఆ మొదటి బాచ్ లో భొజనము చేస్తున్న ఒకవ్యక్తి పదార్థాలు చాల రుచిగా ఉన్నాయి అని చెప్పాడు. ఈ పదార్థాలన్నీ యేదయినా పెద్ద హోటల్నుంచి తెచ్చారా అని అడిగాడు. (ఈ మాటలు అన్నవ్యక్తి గేటు పక్కనే బాబా విగ్రహం యెదురుగా కూర్చునివున్నాడు.)
మేమంతా చాలా సంతోషించి "శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహరాజ్ కీ జై " అన్నాము.
సర్వం శ్రీసాయినాథార్పణమస్తు
0 comments:
Post a Comment