23.01.2011 ఆదివారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
బాబాగారు నానుంచి థన్యవాదములు తీసుకునుట
బాబా చరిత్రలో మనకు, యెవరన్న దక్షిణ పంపినప్పుడు మర్చిపోతే, అడిగి తీసుకునేవారని మనకు తెలుసు. అలాగే నానుంచి నేను చెప్పమన్న థన్యవాదములు తీసుకున్న లీల గురించి మీకు వివరిస్తాను.
మనము యెప్ప్పుడూ సాయి నామ జపం చేస్తూ ఉండాలి. మనలని యీప్పుడూ కాపాడేది అదే. సవకల సర్వావస్తలలోనూ ఆ నామ జపం వల్ల బాబా గారు మనలని రక్షించడానికి సిథ్థంగా ఉంటారు. యెందుకంటే ఆపద సమయాలలో కూడా అప్రయత్నంగా మన నోటివెంట బాబా అని మనం అనగానే మనలని ప్రమాదపు అంచులనుండి బయటపడేస్తారు.
ఇటువంటి విషయాలన్నిటిని కూదా సాయి బంధువులమనిన మనము, ప్రతివారం సత్సంగములలో చర్చించుకుంటూ ఉండాలి. యెక్కడయితే సత్సంగము జరుగుతూ ఉంటుందో అక్కడ బాబాగారు వచ్చి కూర్చుంటారు.
మేము సత్సంగ సభ్యులందరమూ ప్రతి శనివారం సా.4 గంటలనుంచి సాయత్రము 6 గంతలవరకు సత్సంగము చేస్తూ ఉంటాము. మరియొకసారి మేము సత్సంగము చేసే విథానము మీకు తెలియపరుస్తాను. ఒకసారి మేము సత్సంగము చేస్తూ కనులు మూసుకుని నామజపం 108 సార్లు చేస్తూ ఉన్నాము. ఆ సమయంలో ఒక భక్తురాలికి శ్రీమతి భేబీ సరోజినిగారికి బాబా గారు వచ్చి కూర్చునట్లుగా కనిపించింది. ఈమేకు బాబా గారు అంతకుముందు కొన్నాళ్ళ క్రితం కలలో కనపడి రొట్టెలు అడిగారు. అప్పటినుంచి ఆమె వారి ఇంటికి దగ్గరలో ఉన్న బాబాగారికి ప్రతిరోజు రాత్రి రొట్టెలు ఇస్తూ ఉంటారు.
మా సత్సంగ సభ్యులమందరమూ కూడా ప్రతిసంవత్సరము షిరిడీ వెడుతు ఉంటాము. రెండు సార్లు నేను వారితో వెళ్ళడం కుదరలేదు. ఈ సంవత్సరము నవంబరు 10 తారికున మేమందరము షిరిడి ప్రయణం పెట్టుకున్నాము. నేను, నా భార్య కూడా షిరిడీ ప్రయాణానికి వారితో పాటుగా రిజర్వ్ చేయించుకున్నాము. కాని అనుకోకుండా కొన్ని పరిస్తుతులు బాబా గారే కల్పించడంవల్ల మా మనవడి బారసాల విజయవాడ వద్దనున్న పల్లెటూరిలో జరిగిన తరువాత మా ఊరు నరసాపురం వెడదామనుకున్నము. కాని, తిరుగు ప్రయాణంలో విజయవాడలో ఆగి, నరసాపురం వెళ్ళవలసినవారం వెంటనె హైదరాబాదు వెళ్ళడం జరిగింది. అక్కడే నాకు హార్ట్ ప్రోబ్లం బయటపడి నవంబరు 2 న ఆపరేషన్ జరిగింది.
10 తారికున నేను డిస్చార్జ్ అయ్యి మా పెద్ద అక్కగారి ఇంటికి వచ్చాను. సరిగా ఆ రోజు మా సత్సంగము వారందరూ షిరిడీ వెడుతున్నారు. ఆరోజు రైలు స.4.30 కి సికందరాబాదు వస్తుందని తెలుసును కాబట్టి మాసత్సంగము ప్రారంభించిన శ్రీమతి మీనాక్షిగారికి షిరిడీలో బాబాగారికి నా ధన్యవాదములు తెలుపమని ఫోను చేసి చెప్పాను. ఆమె, నా క్షేమసమాచారములు అడిగి అలాగే చెపుతానని చెప్పారు.
వారందరూ షిరిడీ వెళ్ళాగానే, బాబాగారి దర్శనానికి వెళ్ళారు. సామాన్యంగా మనకి యెప్పుడు గుడిలోకి వెళ్ళగానే ఆసన్నిథిలో మిగతా విషయాలు యేమీ గుర్తుకు రావు. అల్లగే మీనాక్షిగారు కూడా బాబా గారికి నేను థన్యవాదములు చెప్పిన విషయం మరిచిపోయారుట. ఆమె కనులు మూసుకుని బాబాగారి సమాథి వద్ద నమస్కారము చేస్తున్నప్పుడు, ఆమె మనొనేత్రం ముందు, మా సత్సంగ సభ్యులువున్న వరుసలో మొదట నేను నుంచునివున్నట్లుగా కనిపించానుట. అప్పుడు ఆమెకు నేను చెప్పమన్న విషయం గుర్తుకువచ్చి బాబాగారికి నా థన్యవాదములు చెప్పినారట.
సర్వం శ్రీసాయినాథార్పణమస్తు
0 comments:
Post a Comment