సాయి బంధువులందరికి బాబావారు అశ్శిస్సులు అందచేయు గాక.
నాకు నవంబరు 2 తారీకున బైపాస్ సర్జరీ అయింది. బాబాగారి కృపతో శ్రీమతి ప్రియాంకా రౌ తేలా గారి ద్వారా బాబా లీలలను మీకందరికి తెల్యియచేసే భాగ్యం కలిగింది. ప్రియాంకాగారు ముందు ఆరోగ్యం కూడా చూసుకోమని జాగ్రత్తలు చెప్పారు. కాని ఊరికే కూర్చోలేక కొంత సమయం దీనికి కేటాయిస్తున్నాను. ప్రైరోజు ఒక లీల పోస్ట్ చేద్దమని నాఉద్దేశ్యం. ఒకోసారి ఆలస్యం అవవచ్చు. యెక్కడా తప్పులు దొల్ర్లకుండా సాథ్యమయినంత వరకు జాగ్రత్తలు తీసుకొవడం జరుగుతోంది. ఒకవేళ యెక్కడయిన అక్షరాలు పొరపటుగ
నా దృష్టి పథం నుంచి తపూకుని వుంటే అన్యథా భావించవద్దని నా మనవి. చేసేదెవడు చేయించేదెవడు. అంతా బాబాగారే
************
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
22.01.2011 శనివారం
బాబా గారియొక్క దర్శనము గాని, లీలలు గాని మనకు అనుకోకుండా జరుగుతాయి. ఇవే మనలని బాగారివైపు దృష్టి సారించేలా చేస్తాయి. ఇక మనం బాబాగారిని వదిలిపెట్టము ఆయన మనలని వదిలిపెట్టరు. కావలసిందల్లా అనన్యమైన భక్తి, ఓర్పు, శ్రథ్థ, సహనం.
ఈరోజు మనము సాయిలీల డిసెంబరు 1973, సంచికలో ప్రచురింపబడిన, శ్రీ వి.బి. నంద్వాని, మాహిం, ముంబాయి-16, వారు వ్రాసిన అనుభవం గురించి తెలుసుకుందాము.
*********
బాబా దర్శనానుభవము
1973, మే, 7 వ. తారీకున, 14 సం. మా అబ్బాయితో షిరిడీ చేరుకున్నాను. సెలవు రోజులలో బాగా రద్దీగా ఉంటుందనే ఉద్దేశ్యంతో , సంస్థ్థాన్ వారికి, మాకు కావలసిన గది తెలుపుతూ రిజర్వు చేయమని ముందుగానే ఉత్తరం వ్రాయడం జరిగింది. అకామడేషన్ ఇన్ చార్జ్ కి ఆ ఉత్తరం ఇంతవరకు అందకపోయినప్పటికీ, ఆయన నాకు నేను అనుకున్న గదే ఇచ్చాడు. ఆ రోజు ఆయన మమ్ములను మథ్యాహ్నం 2 గంటలకు భోజననికి కూడా పిలిచాడు. కాని, కొన్ని కారణాల వల్ల మమ్మల్ని భోజన గృహానికి తీసుకువెళ్ళడానికి 3 గం. దాటుతుండగా వచ్చాడు.అప్పటికి మ అబ్బాయి ఆకలితో వడుకున్నాడు.
నేను మా అబ్బాయిని అంతకుముందే బయటకు వెళ్ళి ఏదయినా తిని రమ్మని చెప్పాను. కాని ఒప్పుకోలేదు. ఇప్పుడు మేమిద్దరము భోజనానికి వెడదాము లేవమని చెప్పినా, కోపంతో నాకేమీ వద్దు అని తిరస్కరించాడు. వాడికి పెందరాళే భోజనం చేయడం అలవాటని నాకు తెలుసు అంచేత నేను వాడినివదిలి సంస్థాన్ ఆఫీసర్ గారితో భోజనానికి వెళ్ళాను.
మా అబ్బాయి 4 గం. లకు లేచి, "నేను సమాథి మందిరానికి వెళ్ళను, బాబాగారికి తలవంచి నమస్కరించను. నేనిక్కడ ఉండను. ఒంటరిగానయినా సరే నేను బొంబాయి తిరిగి వెళ్ళిపోతాను" అని కోపంగా అన్నాడు. ఇదంతా కూడా ఆకలి, కోపం వల్ల వచ్చిందని నాకు తెలుసు. అందుకే మౌనంగా ఊరుకున్నాను.
కొంచెం సేపు అయినతరువాత ఏమయిన తిందామని లేచి బయటకు వెళ్ళాడు. హోటల్లో తినకుండా 4 దోశలు పట్టుకువచ్చి నన్ను కూడా ఒకటి తీసుకోమన్నాడు. వాడి తృప్తి కోసం నేను ఒక దోశ తీసుకుకున్నాను. వాడు రెండు మాత్రమే తినగలిగాడు. ఇంకొకటి ముట్టుకోకుండా మిగిల్చ్చాడు. దానిని ఒక బిచ్చగానికి ఇచ్చాడు.
మేము ఉన్న గది, అకామడేషన్ ఆఫీస్ కి సమాంతరముగా ఉన్న రోడ్డుని ఆనుకుని వున్న గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. రెండు వరుసలు ఉన్న గదుల మథ్య "ఎల్" ఆకారంలో నడవా ఉంది. ప్రవేశించే దారి పొడవుగా ఉంది. పొట్టిగా ఉన్న నడవాలొ స్నానపు గదులు ఉండి ఒకవైపు మూసేసి ఉంది. అందుచేత మేము గది తలుపు తెరుచుకుని కూర్చుంటే నడవాలోంచి ఎవరు వచ్చినా, వెళ్ళినా మాకు కనపడుతుంది.
దోశ తిన్నాక మా అబ్బాయి ప్లేటు కడగడానికి స్నానపు గదులువున్న వైపు వాష్ బేసిన్ వద్దకు వెళ్ళాడు.
ఈ వాష్ బేసిన్ గదులకి బయట ఉంది. హటాత్తుగా మా అబ్బాయి గదిలోకి వచ్చి, స్నానపు గదులు ఉన్న నడవాలో బాబాలా ఉన్న ఒక వ్యక్తి చేతిలో కఱ్ఱ పట్టుకుని ఉన్నాడు, అందుచేత భయపడి వచ్చేశాను అని చెప్పాడు. ఇదంతా కూడా మా అబ్బాయి తలుపు తీసి ఉన్న మా గది గుమ్మంలో నుంచుని చెప్పాడు. నేను గదిలో కూర్చున్న స్థితిలో మా గది ముందునుంచి ఎవరు వెళ్ళినా, వచ్చినా ఖచ్చితంగా కనపడి తీరవలసిందే. నేను వెంటనే లేచి, మా అబ్బాయితో స్నానపు గదులు ఉన్న చోటికి వెళ్ళి చూడగా అక్కడ ఎవరూ కనపడలేదు. మా అబ్బాయి కి దర్శనమిచ్చినది బాబాగారే అని నాకనిపించింది. నడవాలోంచి, ఎవరూకూడా నడిచి వెళ్ళడం నా కంటికి కనపడలేదు. ఎవరు అలా గాలిలో మాయమయిపోగలరు? మిగతా గదులలో ఎవరూ కూడా అలా బాబా దుస్తులలో లేరు.
ఇంకా ప్రశ్నించిన మీదట మా అబ్బాయి, ఆ వ్యక్తి ఒక చేతివైపు, క్రింద బాగా చిరిగిన కఫ్నీ థరించి ఉన్నాడని చెప్పాడు. అతను సట్కాతో సమాథి మందిరం వైపు చూపించాడని చెప్పాడు.
తరువాత సాయంత్రం 6 గం. మా అబ్బాయి నాతో కూడా సమాథి మందిరానికి, ద్వారకామాయికి, చావడికి వచ్చి ప్రతీ చోటా బాబాగారికి నేను చేసినట్లే నమస్కారం చేశాడు. మేమున్న వారం రోజులలో చాలా సంతోషంగా గడిపి స్నేహితులను కూడా సంపాదించుకున్నాడు.
సర్వం శ్రీసాయినాథార్పణమస్తు.
0 comments:
Post a Comment