22.02.2011 మంగళవారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
ఈ రోజు మనము శ్రీ అనిల్ పండిత్, యిండొర్ గారు వ్రాసిన షిరిడీ బాబా ఊదీ లీలని గురించి తెలుసుకుందాము. ఈ లీల సాయిలీల సంచికలో 1974 జూన్ నెలలో ప్రచురితమైనది.
నేను సుమారు గత 13 సంవత్సరాలనుండి సాయి భక్తుడిగా ఉన్నాను. నేను యెల్లప్పుడూ ఆయనని పూజిస్తూ ఉంటాను. ఆ కాలంలో నేను చాలా చిత్రమైన అనుభవాలు కలిగాయి. వాటిలో కొన్ని సాయిలీల మరాఠి పత్రికలో, గతంలో ప్రచురింపబడ్డాయి.కాని 1972 ఏప్రిల్లో జరిగిన బాబాగరి శక్తి మరియు షిరిడీ లోని బాబా ఊదీ మహాత్మ్యం మాకు మరిచిపోలేని అనుభూతి. ఆ లీలని ఇప్పుడు సాయిభక్తులందరికి వివరిస్తాను.
ఏప్రిల్, 1972 లో హటాత్తుగా, మా పెద్దాబ్బాయి కూతురు భావనకి సుస్తీ చేసింది. ఆమెని మేము సంజీవని అని ముద్దుగా పిలుస్తాము. మా ఫామిలీ డాక్టర్ పరీక్షించి వేసవికాలము వల్ల కొంచెం వడ దెబ్బ లేక వాతావరణం వేడి వల్ల కొంచెం సుస్తీ చేసి ఉండవచ్చు అని అభిప్రాయపడ్డారు. జ్వరం తగ్గకుండా అలాగే ఉండటంతో ఆహారం యేమీ తినడంలేదు.అమ్మాయి పొత్తికడుపు పెద్దదయి బయ టకు తెలుస్తోందీ. డాక్టర్ గారు మాములుగా వడదెబ్బకనే వైద్యం చేస్తూ సీరియస్ నెస్స్ ని చూడలేదు.అమ్మాయి రోజు రోజుకి క్షీణిస్తోంది. కళ్ళు లోతుకు వెళ్ళాయి, పొట్ట ముట్టుకుంటే బాగా నొప్పి, అల్లా వుంది పరిస్థితి. ఆఖరికి మేము అమ్మాయిని యిండొర్ లోని పెద్ద ఆస్పత్రిలో చూపించదలచాము. మేము ఆదివారము రాత్రి ఆప్స్పత్రిలో చేర్పించాము. ప్రథాన డాక్టర్ గారు ఆరోజు సెలవులో ఉన్నారు.ఆస్పత్రిలో చేర్పించేముందు అమ్మాయికి నుదిటిమీద షిరిడీలోని బాబా ఊదీ చిటికెడు పెట్టాము. మరునాడు ప్రథాన డాక్టర్ గారు పరీక్షించి, ప్రేవులకి సంబంధించిన టైఫాయిడ్ అని నిర్థారించారు. లోపల ప్రేవులలోని గోడకి చిల్లు పడిందని చెప్పారు. ఇటువంటి కేసులు చాలా ప్రమాదకరంగా ఉంటాయి, ఆపరేషన్ చెయ్యవలసిఉంటుంది, కాని, అమ్మాయి ఆపరేషన్ కి తట్టుకోలేదు అని డాక్టర్ గారు చెప్పారు. గ్లూకోజ్ సెలైన్ యెక్కించమని సలహా ఇచ్చారు. మేమంతా కూడా చాలా అందోళనగా ఉన్నాము.మా కుటుంబ సభ్యులమంతా అమ్మాయి గురించి భయపడుతున్నాము. ఆస్పత్రిలో వైద్యం మొదలు అయింది. ఇది జరిగేముందు నేను మరాఠిలో బాబా చరిత్ర చదువుతున్నాను. ఆ సమయానికి నేను 8 అథ్యాయం పూర్తి చేసి 9 లోకి వచ్చాను. నాకు బాబా మీద నమ్మకం ఉంది. నేను ఆయనకి విన్నవించుకున్నాను " ఓ బాబా మామీద ఇటువంటి ఉపద్రవం పడిందేమిటి, దీనినుంచి తప్పిచగలవాడవు నువ్వే"
మార్చ్ నెలలో నేను షిరిడిళొ ఉన్నాను అప్పుడు సంస్థాన్ ఆఫీస్ నుండి కొన్ని బాబా ఫోటోలు తీసుకువచ్చాను. అందులో ఆశీర్వాదము ఇస్తున్నట్లుగా ఉన్న ఫోటో చూసినప్పుడల్లా, బాబాగారు చింత వద్దు, ప్రతీదీ మంచే జరుగుతునది అని మాకు అభయము ఇస్తున్నట్లుగా మాకు అనిపిస్తూ ఉంటుంది. ఆ ఫోటొ ని ఆస్పత్రికి తీసుకువెడామని అనిపించింది నాకు. ఆ ఫోటోని, కొంత ఊదీని ఆస్పత్రికి తీసుకు వచ్చాను. ఫోటోని భావనా తలగడ కింద పెట్టి ఊదీని ఒళ్ళంతా రాశాను. అప్పుడు నాలో భావోద్వేగాలు చాలా గాఢం గా ఉండి యేడవదం తప్ప నిస్సహాయంగా ఉన్నాను. అప్పుడు అక్కడ ఉన్న మా కుటుంబ సభ్యులందరిముందు ఇలా అన్నాను "ఓ! బాబా భావనాకి కనుక ఈ రోగం నయం కాకపోతే ఇక ముందు నీ చరిత్ర చదవను" . నా సర్వశ్య శరణాగతి వేడికోలు, ఆనాడు షామా ఒకామెకు సంతానము కలగకపోతే తన నెత్తిమీద కొబ్బరికాయ కొట్టుకుంటాను అని చెప్పినదానికి పోలి ఉంది.
ఈ లోగా నేను చరిత్ర చదువుతూ ఉన్నాను. ప్రతి గురువారము ఆరతి,పూజ చేస్తూ ఉన్నాను.
ఆపరేషన్ లేకుండా రోగం నయం అయ్యేటప్పటికి డాక్టర్స్ ఆశ్చర్యపోయారు. అది పేషంట్ సాథించిన విజయమా కాకు అది బాబా గారి శక్తి, ఊదీ మహత్యం. క్రమంగా అమ్మాయి జ్వరం తగ్గింది, ప్రేవులలోని గోదకి ఉన్న చిల్లు కూడా మానింది. 2, 3 వారాల తరువాత అమ్మాయి యింటికి తిరిగి వచ్చింది.
నాకనిపిస్తుంది, బాబా మీద నమ్మకం చూపే లీల అమోఘం. కాని ఆయన అంద్నిచే అనుగ్రహ ఫలితాన్ని మనం కోల్పోతూ ఉంటాము.
(1973 జూలై మరాఠీ
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు
0 comments:
Post a Comment