25.02.2011 శుక్రవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
ఈ రోజు మనము సాయి లీల1975 సంచికలో శ్రీ ఏ.శ్రీనివాసులు సికందరాబాదు వారు వ్రాసిన సాయి లీలను తెలుసుకుందాము.
బాబా గారు యిక్కడ ఉన్నారు, అక్కడవున్నారు, అన్ని చోట్లా ఉన్నారు, అతటా ఉన్నారు, సర్వాంతర్యామి.
1969 సెప్టెంబరులో నేను ట్రైనింగ్ నెమిత్తం హైదరాబాదునుంచి భుసావల్ వెడుతున్నాను. ప్రొద్దున్న 9 గంటలకి మన్మాడ్ లో దిగాను. నేను ట్రైనింగ్ క్లాసులో మరునాడు ఉదయం జాయినవాలసి ఉండటం వల్ల అప్పటికప్పుదు షిరిడి వెడదామని నిర్ణయించుకున్నాను.నా సామానంతా క్లోక్ రూంలో పడేసి షిరిడి వెళ్ళే బస్ యెక్కాను. వాతావరణం బాగా మబ్బుపట్టి పెద్ద వర్షం కురుస్తానని బెదిరిస్తున్నట్లుగా ఉంది. మథ్యాహ్న్న హారతికి చేరుకునేలా చేయమని నాలో నేనే ప్రార్థించుకున్నాను. బస్సు మట్టి రోడ్ గుండా వెడుతోంది. వాతావరణం కళ్ళకి కనువిందు చేస్తోంది. మేము, చెఱకు తోటల గుండా, పళ్ళతోటల గుండా, గ్రామాలూ, బజారుల గుండా, ఆఖరికి 11.30 కి షిరిడీ చేరుకున్నాము. బాబా గారు సమయానికి షిరిడీ చేరుకునేలా సహాయం చేశారు. ఆయన నా ప్రార్థనలని మన్నించారు. తొందరగా స్నానం చేసి మందిరం హాలులోని గుంపులో కి ప్రవేసించాను. ప్రసాదం తీసుకున్న తరువాత సంస్థానం వారు నడిపే ప్రసాదాలయంలో భొజనం చేశాను. మంచి విందుభోజనం చేసిన తరువాత కాట్టేజ్ కి 3 గంటలకి తిరిగి వచ్చాను. బాబాగారు నన్ను దర్శనం పూజా సమయానికి షిరిడి చేర్చినందుకు చాలా సంతోషించాను. బాబాగారి వద్ద సెలవు తీసుకుని సాయంత్రము 4 గంటలకి మన్మాడ్ వెళ్ళే బస్ యెక్కాను. ఆ సమయంలో పెద్ద పెద్ద ఉరుములతో కూడిన వర్షం పడుతోంది. ప్రథాన రహదారి వెంటనె బాగుచేయాలి అన్నంతగా పాడైపోయింది. యెముకలు విరిగిపోయాయేమో అన్నంత దారుణమైన ప్రయాణం తరువాత కోపర్గావ్ కి 3 కిలో మీటర్ల దూరంలోనున్న పట్టణానికి చేరుకున్నాము.
500 గజాల మేర రోడ్డు కొట్టుకుపోయి పెద్ద కందకం యేర్పడిఉంది. భారీ వాహనాలు ఆ ప్రదేశాన్ని దాటి వెళ్ళలేనంతగా ఉంది అక్కడి దృశ్యం. పక్కనించి తప్పించుకుని వెళ్ళడానికి కూడా వీల్లేనంతగా అక్కడక్కడ యేర్పడిన కందకాలన్ని నీటితో నిండి ఉన్నాయి.అవతలివైపుకి నడవడానికి కూడా సాథ్యము కానంతగా రోడ్డు జారుడుగా ఉంది. క్రమంగా చీకటి పడుతూ ఆప్రాం తమంతా అడవిని తలపిస్తోంది. ప్రయాణీకులంతా, భయం మరియు తడివాతావరణానికి వణుకుతూ ఉన్నారు. సహాయక చర్యలు జరిగే సూచనలేమీ కనపడటల్లేదు. కొంతమంది ప్రయాణీకులు గట్తిగా బాబా నామాన్ని ఉచ్చరిస్తున్నారు. నేను కూడా సాయినామాన్ని స్మరిస్తున్నాను. నేను మరునాడు ట్రైనింగ్ కి వెళ్ళాలంటే మన్మాడ్ వేళ్ళి భుసావల్ రైలుని అందుకోవాలి. అదే నా ఆదుర్దా. కాని ఇప్పుడీ కష్టాన్నుండి బయటపడేదెలా?
రాత్రి 7 గంటల తరువాత పి.డ్బ్ల్యు.డీ. వారి జీపు వచ్చింది. అది చూడటానికి సర్కస్ వెహికిల్ లా ఉంది. అనుకున్న ప్రదేశానికి చేరాలన్న ఆ వెహికిల్ సర్కస్ ఫీట్లు చేయక తప్పదు. డ్రైవర్ నా దగ్గిరకి వచ్చ్చి నన్ను జీపులోకి రమ్మన్నాడు. అతను ఇంకా కొంతమందిని యెక్కించుకుని జాగ్రత్తగా పట్టణానికి డ్రైవు చేసుకుంటూ వచ్చాడు. మేము ఈ జీపులో కోపర్ గావ్ బస్ స్టాండ్ కి వచ్చాము. డబ్బులిస్తే తీసుకోడానికి డ్రైవరు నిరాకరించి "బాబా మిమ్మల్ని దీవిస్తారు" అని వెళ్ళిపోయాడు. యెవరితను? అతను స్వయంగా బాబాయేనా?
నేను మన్మాడ్కి ఇంకొక బస్ యెక్కాను. అది నన్ను భుసావల్ వెళ్ళే ఎక్స్ ప్రెస్ రైలుకు సమయానికి చేర్చింది. నేను సమయానికి ట్రైనింగ్ కి చేరుకోగలిగాను.
ఇది బాబా లీల కాదా?
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు
0 comments:
Post a Comment