26.02.2011 శనివారము.
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి.
బాబా మందిర నిర్మాణము
బాబా మందిరం నిర్మించాలంటే దానికి యెంతో పుణ్యం చేసుకోవాలి. చాలా శ్రమతో కూడుకున్న బృహత్కార్యం. కాని బాబా అనుగ్రహం ఉండాలే కాని అసాథ్యం మాత్రం కాదు. సికందరాబాదులో మందిర నిర్మాణానికి బాబా గారు తమ అనుగ్రహాన్ని యెలా వర్షంలా కురిపించారో ఈ లీల చదివితే ఒడలు పులకరిస్తుంది. ఈ లీల సాయి లీల పత్రికలో 1983, అక్టోబరు సంచికలో ప్రచురితమైంది. ఈప్పుడు బాబా గారి అనుగ్రహాన్ని మనముకూడా తనివితీర చదివి ఆనందిద్దాము.
*****
ఒక సామాన్యమైన మథ్యతరగతి కుటుంబం బాబా మందిరం నిర్మించడమంటే యెవరైన కలలో కూడా ఊహించలేరు. కాని బాబా గారి అనుగ్రహం మా మీద ఉండటం వల్ల యిది కష్టం లేకుండా సాథ్యమయింది. మా కల తక్కువ సమయంలోనే అంటే 5 నెలలలోనే పూర్తి అయింది.
మేము హైదరాబాదులో బిర్లా మందిరంలో 3 అడుగుల యెత్తు ఉన్న కృష్ణుని పాల రాతి విగ్రహాన్ని, ఆరుబయట అందమైన తోటలో చూసినప్పుడు మా మనసులో కి ఈ కోరిక అంటే బాబా మందిరం నిర్మించుదామని వచ్చింది. సికందరాబాదులో ఉన్న నవగ్రహ మందిరం ఆవరణలో బాబా మందిరాన్ని నిర్మించాలన్న కోరిక మామనస్సులో గాఢంగా నాటుకుంది. మాలో ఈ కోరికకి బీజం పడింది.మందిరం నిర్మించడానికి శంఖుస్థాపనకి మంచి ముహూర్తం కోసం చూస్తున్నాము.
నన్ను యెక్కువ ఆశ్చర్య పరిచే సంఘటన జరిగింది. నేను నా స్కూటర్, మోటార్సైకిల్ స్పేర్ పార్ట్ లు అమ్మే కవుంటరులో ఉన్నాను. ఇద్దరు కస్టమర్లు స్కూటర్ స్పేర్ పార్ట్ లు కొనుక్కోవడానికి నా షాపు కి వచ్చి, నా వేలికి ఉన్న బాబా ఉంగరం చూసి, నేను బాబా భక్తుడినా అని అడిగారు. నేను వారితో మామూలుగా అవును అని చెప్పాను. ఇంకా బాబా మందిరం కట్టిద్దామనుకుంటున్నాను అందుకోసం శంఖుస్థాపనకి మంచి ముహూర్తం కోసం చూస్తున్నానని చెప్పాను. వెంటనే వారు, డిశెంబరు 9 తా.1982 మంచి రోజు, ఆ రోజునమేము బాబా విగ్రహాన్ని మల్కాజిగిరిలో ప్రతిష్ఠిస్తున్నాము అని చెప్పారు.
నేను నా భార్య యిది బాబా గారు నిర్ణయించినదే అనుకుని శంఖుస్థాపనకి నిర్ణయించాము. కార్యక్రమం చాలా చక్కగా జరిగింది. అప్పటినించి యెటువంటి ఆటంకాలూ లేకుండా నిర్మాణపు పనులు జరిగాయి. ప్రతివారు బాగా సహకారం అందించారు. మందిరం 9" x 3' లో సగ భాగం తోట, మిగిలిన భాగం బాబా విగ్రహాన్ని పీఠం మీద ప్రతిష్ఠించడానికి నిర్మాణం పూర్తి అయింది.
ఇక్కడ నేను చెప్పేది అతిశయోక్తి కాదు. బాబాగారి అనుగ్రహం మామీద యెంతగా ఉందంటే మేము యే విషయంలోనూ కష్టపడలేదు. పనులు జరుగున్నంత కాలం ప్రతీదీ మా దగ్గిరకే వచ్చేది. దీనికింకా తార్కాణం
మల్కాజిగిరిలోని మందిరంలో బాబా విగ్రహావిష్కరణకి వచ్చిన శిల్పి,నన్ను కలవడానికి మా యింటికి వచ్చి,
బాబా విగ్రహం తయారుచేయడానికి ఆర్డర్ తీసుకుని, సకాలంలో మంచి అందమైన విగ్రహాన్ని తయారు చేసి ఇచ్చాడు.
ఇంకా భక్తులకి ఆసక్తికరమైన విషయమేమంటే ఇండియన్ ఎయిర్ లైన్స్ లో పని చేసే మా శ్రేయోభిలాషి ద్వారా బాబా విగ్రహం జైపూర్ నుంచి సికందరాబాదుకి విమానం ద్వారా మా వద్దకే వచ్చింది. బాబా గారు తనంతట తాను నా వద్దకు రావడం నాకు చాలా సంతోషం వేసింది. యెందుకంటే ఇదంతా ఆయన నిర్ణయం ప్రకారమే జరుగుతూ ఆయన అనుగ్రహం మామీద ప్రతి విషయంలోను లభించింది. ప్రతి పనీ యే కష్టమూ లేకుండా జరిగి మే 15, 1983 న దంపత సంస్థాపన జరిగింది. చాలా మంది భక్తులు, దంపతులూ ఆరోజు పూజలో పాల్గొన్నారు. మొత్తం అంతా కూడా చాలా సవ్యంగా జరగడం ఊహకందని విషయం.
ఇదంతా కూడా బాబాగారి అనుగ్రహం తప్ప మరేమీ కాదు. మేమంతా కూడా బాబా మందిరంలో నిజమైన ఆనందాన్ని అనుభవిస్తూ స్వర్గాన్ని చూస్తున్నాము.
ఇటువంటి పవిత్రమైన కార్యంలో మమ్ములని వాడుకున్నందుకు బాబా వారి చరణాలకు ప్రణమిల్లుతున్నాము.
షిరిడీ సంస్థానం నించి కోర్ట్ రిసీవర్ గారు, మా ఆహ్వానానికి కృతజ్ణతలు తెలుపుతూ పంపిన సందేశానికి కూడా మేము థన్యవాదాలు తెలుపుకుంటున్నాము.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు
0 comments:
Post a Comment