Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Tuesday, August 23, 2011

సంత్.గాడ్గే మహరాజ్ తో అనుభవం

Posted by tyagaraju on 8:04 AM


23008.2011 మంగళవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంథువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు తార్ఖడ్ కుటుంబం వారి మరొక అద్భుతమైన లీలని తెలుసుకుందాము.

సంత్.గాడ్గే మహరాజ్ తో అనుభవం

ఓం శ్రీ సాయినాథాయనమః

యింతకు ముందు చెప్పినట్లుగా నా జ్ఞాపక శక్తిని విస్తరించుకునే ప్రయత్నం చేసి మహారాష్ట్రలో గొప్ప సాథువయిన గాడ్గే మహరాజ్ గారి గురించి తెలియచేస్తాను. ఆయన ఖార్ లో ఉన్న మా బంగళాకు తరచూ సాయంత్రమప్పుడు తనదైన ప్రత్యేకమయిన దుస్తులతో వస్తూ ఉండి మరలా వేకువజాముననే వెళిపోతూ ఉండేవారు. నేనాయనని స్వయంగా చూశాను. ఆయన రంగుల గుడ్డముక్కలతో కుట్టబడిన వస్త్రాన్ని థరించి తలకి ఒక గుడ్డ ముక్కని కట్టుకునేవారు. ఈ వేషధారణ వల్ల ఆయనని గోధాడీ మహరాజ్ , గొధడీ బాబా అని పిలిచేవారు. ఆయన కాళ్ళకు తోలు చెప్పులు వేసుకుని చేతిలో యెప్పుడూ వెదురు కఱ్ఱని తీసుకుని వెడుతూ ఉండేవారు. వెదురు కఱ్ఱకి అడుగున యినుపతొడుగు, కఱ్ఱ అరిగిపోకుండా బిగింపబడి ఉండేది.


ఆయన లార్డ్ విఠల్ (విష్ణుకి) పరమ భక్తుడు. యెప్పుడూ పాండురంగ...పాండురంగా...అంటూ ఉండేవారు. మహారాష్ట్ర అంతటా తన కీర్తనల ద్వారా సాయి మహిమను చాటిన దాసగణు మహారాజ్ ఆయనని మా కుటుంబానికి పరిచయం చేశారనుకుంటాను. గాడ్గే మహారజ్ గారి దృష్టి ముఖ్యంగా అట్టడుగు బీద ప్రజానీకానికి అన్ని విధాలుగా సహాయం చేద్దామని కేంద్రీకృతమయి ఉండేది. ఆయన వారికి శుభ్రత గురించిన ప్రాథాన్యాన్ని తెలియచేస్తూ తాను స్వయంగా ఆచరించి మహారాష్ట్ర అంతటా వీథులు ఊడ్చి, "'పరిశుభ్రతే దైవం' అనే నినాదంతో వివరిస్తూ ఉండేవారు. అదే, గ్రామాలని అంటు వ్యాథులబారి నుండి సురక్షితంగా ఉంచుతుందని గ్రామస్తులందరికీ ఆయన యిచ్చే సందేశం. ఈ క్రమంలో ఆయన థనవంతుల నుంచి ఆర్థిక సహాయం కూడా తెచ్చుకోగలుగుతూ ఉండేవారు. దానిని సేకరించి ఆయన గ్రామాల్లో అవసరయమయినవారికి పంచుతూ ఉండేవారు. సాయి బాబావారి మహాసమాథి తరువాత మా తాతగారు గాడ్గే మహారాజు సాథువుగారికి బట్టల తానులు విరాళంగా యిస్తూ ఉండేవారు. మా అమ్మగారు తన చేతులతో స్వయంగా 'గొధాడీ' కుట్టి గాడ్గే మహారాజ్ మాయింటికి వచ్చినపుడెల్లా ఆయనకు యిస్తూ ఉండేవారు. ఆయన ఆపుడు మా అమ్మగార్ని దీవించి, దానిని తన స్వంతానికి తీసుకుని వెడుతూ ఉండేవారు. ఆ కాలంలో ఉన్న అప్పటివారు అలా ప్రేమని, వాత్సల్యాన్ని, కురిపిస్తూ ఉండేవారు. ఈ రోజులలో కొనుగొనడం కష్టం.


యింతకు ముందు చెప్పినట్లుగా మానాన్నగారి చేత బలవంతంగా బంగళా కొనిపించడంలో సంత్. గాడ్గే మహరాజ్ కారకులు. ఆయన యెక్కువ సమయం కాలినడకనే అన్ని చోట్లకి తిరుగుతూ ఉండేవారు. ఖార్ లో ఆయన ఒక బంగళాని చూశారు. దానిని మా నాన్నగారు 1923 సం.లో మొత్తం మీద రూ.15,007/- లకి కొన్నారు. ఓల్డ్ ఖార్లో అప్పుడది ఒక్కటే ఏకైక కట్టడంగా ఉండేది. అక్కడినుంచి మేము రైల్వే స్టేషన్, మౌంట్ మారీ చర్చ్ మొదలైనవన్ని మా బంగళా మిద్దె మీంచి యెటువంటి అడ్డంకీ లేకుండా చూడగలిగేవారమని నాకు గుర్తు. యెప్పుడైనా గాడ్గే బాబా వచ్చినప్పుడు మా అమ్మగారితో, ప్రత్యేకమైన రోటీ, 'జ్వారీ' చేయమని ఆదేశించేవారు. ఆమె అలాగే ఆయన కోసం చేసేవారు. మేమంతా ఆ రాత్రికి 'ఝుంకా భకార్' తినేవాళ్ళం. ఆ పదార్థాల యొక్క గొప్ప రుచి మా జ్ఞాపకాలలో యిప్పటికీ ఉందంటే నమ్మండి. రాత్రి భోజనము ఆయిన తరువాత గాడ్గే బాబా సాథువు గారు, తాను వివిథ గ్రామాలకు చేసిన పాదయాత్రలలోని అనుభవాలన్నీ కలిపి మాకు వివరిస్తూ ఉండేవారు. గాడ్గే బాబా నిస్సందేహంగా సామాన్యమయిన వ్యక్తి కాదు. ఆయన భగవంతుని మరొక దూత. మా నాన్నగారు ఆయనతో కూడా పండరీపురం వెళ్ళినపుడు మా నాన్నగారికికలిగిన దివ్యమైన అనుభవాన్ని మీకిప్పుడు వివరిస్తాను.

గాడ్గే బాబా పుణ్యక్షేత్రమయిన పండరీపూర్ కి యెప్పుడూ యాత్రకి వెడుతూ ఉంటారు. ఆయన పాండురంగనికి నిజమైన భక్తుడు. ఆయన తన ఖాళీ సమయంలో పాండురంగా...పాండురంగా...అని ఆయన నామ జపం యెప్పుడూ చేస్తూ ఉండేవారు.ఒకసారి మా నాన్నగారు ఆయనని ఆయన జీవితంలో యెప్పుడయినా లార్డ్ పాండురంగని కలుసుకున్నారా అని అడిగారు. గాడ్గే బాబా మా నాన్నగారిని తనతో కూడా పుణ్యక్షేత్రమయిన పండరీపూర్ కి రమ్మన్నారు. ఆయన మా నాన్నగారితో, సౌఖ్యవంతమయిన బంగళాలో ఉండేటటువంటి అన్ని సుఖాలకు దూరంగా అక్కడ ఒక యాత్రికునిలా ఉండాలని చెప్పారు. అప్పుడు మా నాన్నగారు గాడ్గే బాబా సాథువుతో కలిసి పండరీపురానికి రెండవసారి ప్రయాణం కట్టారు.




చంద్రభాగా నదీ తీరంలో ఉన్న యిసుకలో వారొక గుడారంలో బస చేశారు. రోజంతా ఆయన మహరాజ్ తో కూడా తిరుగుతూ, ఆయన శుభ్రపరిచే కార్యక్రమాలు యెలా చేస్తున్నారో యింకా ఆయన పీడిత ప్రజానీకానికి యిచ్చే సలహాలు, వారంతా ఆయన చుట్టూ గుమిగూడి ఆయన చేసే జ్ఞానోపదేశాలని ఓపికగా వినడం యివన్నీ ప్రత్యక్షంగా చూశారు. సంత్.గాడ్గే మహరాజ్ చేసే సామాజిక కార్యక్రమాల మీద మా నాన్నగారికి చక్కని అవగాహన వచ్చింది. సాయంత్రానికి వారు తమ గుడారానికి తిరిగి వచ్చారు. గుడారంలోపల మూడు పక్కలు, ప్రతీదాని మీద ఒక కంబళీ (నలుపురంగుతో) తో వేయబడి, గుడారం మథ్యలో ఒక కిరోసిన్ లాంతరు వేలాడుతూ ఉండటం గమనించారు. గాడ్గే బాబా మా నాన్నగారిని విశ్రాంతి తీసుకోమని, తాను బయటకు వెళ్ళి (గ్రామంలో దొరికే ప్రత్యేకమయిన అహార పదార్థం) తినడానికి 'ఝంకా భకార్' తెస్తానని చెప్పారు. మా నాన్నగారికి తెలుసుకోవాలనే కోరికతో ఆయనని ఖాళీగా ఉన్న మూడవ పక్క గురించి అడిగారు. గాడ్గే మహరాజ్ తాను చెప్పడం మరచాననీ, ఆ రాత్రికి తనకొక అతిథి వస్తాడనీ రాత్రికి ఉండి, ఉదయానికి ముందే వెళ్ళిపోతాడనీ చెప్పారు. ఆ అతిథి తమకు యెటువంటి యిబ్బందీ కలిగించడనీ చెప్పారు. తానెప్పుడు పండరీపూర్ వచ్చినా ఈ అతిథి రాత్ర్తికి తనతో కూడా ఉంటాడనీ చెప్పారు. యిది చెప్పి గాడ్గే మహరాజ్ గుడారం నుంచి బయటికి వెళ్ళారు. గుడారంలో త్వరగా చీకటి పడింది, అలాగే ఉష్ణొగ్రత కూడా పడిపోయింది. మా నాన్నగారు కునికిపాట్లు పడటం మొదలెట్టి నిద్రపోయారు. మా నాన్నగారికోసం 'ఝంకా భకార్' తెచ్చిన గాడ్గే బాబా గారి పిలుపుతో మానాన్నగారు మేలుకొన్నారు. తాను తన అతిథితో అప్పటికే రాత్రి భోజనం చేసేశానని, మా నాన్నగారిని క్షమించమని చెప్పి, ఆయనకి చాలా ఆకలిగా ఉండవచ్చనీ భోజనం చేసేయమని చెప్పారు. ఈ లోపులో తాను నది ఒడ్డున తిరిగి వస్తానని చెప్పారు.

మా నాన్నగారు అతిథివైపు చూశారు. అతను 'ధోతారూ (ధోవతీ) కట్టుకుని పైన యెటువంటి ఆచ్చాదన లేకుండా ఉన్నాడు. అతని శరీరం కారు నలుపుగా భిల్ల జాతివాళ్ళలా ఉండి అతని కళ్ళు ఎఱ్ఱగా మండుతున్న బొగ్గులా ఉన్నాయి. అతని భుజం మీద కంబళీ ఉంది. బాగా ఆశ్చర్యకరమైన విషయమేమంటే గుడారం మొత్తం గాఢమైన కస్తూరి సువాసనతో నిండిపోయింది. మా నాన్నగారు యింతకు ముందెన్నడూ అటువంటి సువాసనని ఆఘ్రాణించలేదు. మా నాన్నగారు యింతకుముందెన్నడు ఆఘ్రాణించని గాఢమైన కస్తూరి సువాసనతో గుడారం మొత్తం నిడిపోయింది. వారిద్దరూ గుడారం నించి వెళ్ళిపోయారు. మా నాన్నగారు మథురమైన భోజనాన్నితినడం పూర్తి చేశారు. అటువంటి మథురమైన ఆహారాన్ని ఆయనెప్పుడూ రుచి చూడలేదు. కాకి అరుస్తున్న పెద్ద శబ్దానికి ఆయన పొద్దున్నే లేచారు. గాడ్గే బాబా గారు అప్పటికే లేచారు. ఆయన మా నాన్నగారితో నోటిని నీళ్ళతో పుక్కిలించి, ఆయన కోసం ఉంచిన మట్టికుండలో ఉన్న వేడి టీ ని త్రాగమన్నారు. మా నాన్నగారు అతిథి గురించి ఆరా తీశారు. గాడ్గే బాబా ఆయన అప్పటికే టీ తాగి వెళ్ళిపోయారనీ గుడి తెరిచేముందే ఆయన తన కర్తవ్యనిర్వహణకోసం అక్కడ ఉండాలని చెప్పారు. మా నాన్నగారు కొంచెం అమాయకంగా ఆ అతిథిని తనకెందుకు పరిచయం చేయలేదని గాడ్గే బాబాని అడిగారు. గాడ్గే బాబా అతనిని పండరీపూ ర్ లొ పరిచయం చేయాల్సిన అవసరం లేదనీ మా నాన్నగారు అతనిని గుర్తించి ఉంటారని అనుకున్నానని, మా నాన్నగారితో అన్నారు. మా నాన్నగారు అయనతో రాత్రి తాను అతనిని సరిగా చూడలేదనీ, ఉదయాన్నే మహరాజ్ అతను వెళ్ళిపోయేముందు తనకు పరిచయం చేస్తారనుకున్నానని అన్నారు. అప్పుడు మహరాజ్ మానాన్నగారితో ఆ అతిథి 'పండర్ పూర్' లార్డ్ విఠోబా తప్ప మరెవరూ కాదని చెప్పారు. ఆయన మా నాన్నగారిని, ఆయన బంగళాలో తనకి కలత బెట్టిన ప్రశ్నకు సమాథానం లబించిందా అని అడిగారు. యిపుడు మా నాన్నగారు ఆ మథురమైన, మంత్రముగ్థుడిని చేసిన ఆ కస్తూరి సువాసన ఆయననాక్రమించింది. కొంతకాలంగా ఆ కస్తూరి సువాసన తనని వెంబడించి లార్డ్ విఠొబా ఉన్నారనే భావం తనకి కలుగ చేస్తూ ఉండేదని మా నాన్నగారు చెబుతూ ఉండేవారు. సంత్.గాడ్గే బాబా ఒక మనొజ్ఞమైన అనుభవాన్ని యిచ్చారు. కాలం గడిచేకొద్దీ ఆయన వృధ్ధాప్యంలోకి వెళ్ళారు. ఆయన మా బంగళాకు ఆఖరి రాక కూడా మరచిపోలేనిది. ఆయన యెప్పుడు తన కంబళీ, కఱ్ఱ వీటితో వస్తూఉండి వెళ్ళిపోయే టప్పుడు వాటిని కూడా తన వస్తువులతో పాటుగా తీసుకుని వెడుతూ ఉండేవారు. ఆయన ఆఖరుసారి వచ్చినపుడు తనతో కఱ్ఱ తీసుకుని వెళ్ళడం మరచిపోయారు. నిజానికి ఆయన తనతో తీసుకుని వెళ్ళడం మరచిపోలేదు, ఉద్దేశ్యపూర్వకంగానే తన గుర్తుగా దానిని వదిలేశారు. నేనిది యెందుకు చెబుతున్ననంటే ఆయన నడక తీరు కఱ్ఱ సహాయం లేకుండా నడవలేరన్నట్లుగా ఉండేది. నా తల్లిదండ్రులు తమలో తాము చర్చించుకుని ఆయన ఆచూకీ తెలుసుకుని ఆయన కఱ్ఱని ఆయనకు తిరిగి యిచ్చేద్దామనుకున్నారు. కాని ఆయనని వెతకడం సాథ్యం కాలేదు. కారణం నిజంగా చెప్పలంటే ఆయన మహారాష్ట్రలో యెప్పుడూ సంచారం చేస్తూ ఉండే సాథువు. అట్టడుగు ప్రజానీకానికి యెప్పుడూ సేవ చేస్తూనే ఉండేవారు. నా తలిదండ్రులు ఆ కఱ్ఱని యెంతో పవిత్రమైన వస్తువుగా భావించి దానిని చందనపు మందిరం దగ్గరలో ఉంచారు. నా తల్లిదండ్రులు ఆయన చిత్ర పటాన్ని ఒకటి కొని దానికి కూడా ప్రతీరోజూ పూజలు చేయడానికి చందనపు మందిరంలో ఉంచారు. ఆయన కూడా వారికొక దేవతని, మీరు కూడా అభినందిస్తారు.

ప్రియ పాఠకులారా ఈ సంఘటన కూడా మీకు ఖచ్చితంగా ఆసక్తికరంగా ఉంటుందని నాకు తెలుసు. నేను మరొక్కసారి అనుకునేదేమంటే ఈ రోజున మనకి అటువంటి సాథువులు గాని, దేవ దూతలుగాని మన మథ్య లేరు, యింకా సాథువులకు నిస్వార్థ సేవ చేసే అంకిత భక్తుల ఉనికి కూడా మనకి తక్కువగానే ఉంది.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List