

16.09.2011 శుక్రవారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు సాయి.బా.ని.స. అనుభవాలలో 7 వ అనుభవాన్ని తెలుసుకుందాము.
సాయితో సాయి.బా.ని.స. అనుభవాలు - 7
సాయి ఆపదలో ఉన్న తన భక్తుల పిలుపుకు వెంటనే స్పందిస్తారని మనకందరకూ తెలుసు. బలరాంమా న్ కర్మశ్చీందర్ ఘర్ లో ధ్యానము చేసుకున్న తరువాత దాదర్ లోని తన యింటికి బయలుదేరాడు. పూనే రైల్వే స్టేషన్ కి చేరుకుని దాదర్ కువెళ్ళే రైలు కోసం యెదురుచూడ సాగాడు. రైలు టిక్కట్టు కొనడానికి ప్రయత్నించినా విపరీతమైనజన సమూహంలో టిక్కట్టు కొనలేకపోయాడు. మానసిక ఆందోళనతో తాను తన యింటికి వెళ్ళలేనని బాధపడసాగాడు. తనను ఆ కష్టాన్నుండి గట్టెక్కించమని సాయిని ప్రార్థించాడు. మరుక్షణమే సాయి ఒక పల్లె టూరివానిరూపములో ప్రత్యక్షమై తన వద్ద దాదరు వరకూ టిక్కట్టు ఉన్నదని కొన్ని కారణాంతరాలవల్ల తను ప్రయాణంచేయలేకపోతున్నానని చెప్పి ఆ టిక్కట్టునతని చేతిలో పెట్టాడు. మాన్ కరుకు యేమి జరిగిందో తెలుసుకునేలోపల ఆ అపరిచిత వ్యక్తి జన సందోహంలో మాయమయిపోయినాడు. ఆ పల్లెటురివాడిచ్చిన టిక్కట్టుతో మాన్ కర్ తన యింటికిక్షేమంగా చేరుకున్నాడు. ఇది సాయి సచ్చరిత్ర 31 వ అధ్యాయంలో వివరింపబడింది.
సరిగా నాకు కూడా యిటువంటి అనుభవమే కలిగింది.  సాయి భక్తులందరితోనూ దానిని నేనిప్పుడు పంచుకోదలిచాను.  1991 వ సంవత్సరంలో గోదావరీ నది  పుష్కరాలకు వెళ్ళి రాజమండ్రీ రైల్వే స్టేషన్లో  సికందరాబాదు రైలుకోసంనిరీక్షిస్తున్నాను.  మన భారత దేశంలోని అన్ని నదులకు 12 సంవత్సరాలకు ఒకసారి యిటువంటి పుష్కరాలుజరుగుతాయి.  రాజమండ్రీ రైల్వేస్టేషన్లో నా బంధువు ఒకరు  నాకు ఒక పెట్టెను ఇచ్చి దానిని సికందరాబాదులోని తనబంధువుల యింటికి చేర్చమని కోరినాడు.  నేను ఈ పని చేయటానికి అంగీకరించాను.  రైలు మరునాడు ఉదయముఏడు గంటలకు సికందరాబాదు స్టేషనుకు చేరుకున్నది.  నేను కూలివాని సహాయంతో ఆ పెట్టెను తీసుకుని స్టేషనుబయటికి వెళ్ళడానికి గేటు దగ్గిరకు వచ్చినప్పుడు అక్కడ టిక్కట్టు కలెక్టరు నన్ను ఆపి ఆ పెట్టి 30 కిలోలకన్నయెక్కువ బరువు ఉండునని,  దానిని తూకము వేయవలెనని ఆదేశించినాడు.  నా దగ్గి రున్నసంచీ మరియు ఆ పెట్టెనుతూకము వేయగా 39 కిలోల బరువుంది.  ఆ అదనపు బరువుకు 150 రూపాయలు అపరాధ రుసుము చెల్లించవలెననిఆజ్ఞాపించినాడు.  ఆ సమయములో నా వద్ద 20 రూపాయలు మాత్రమే ఉంది.  నేను ఆ టిక్కట్టు కలెక్టరును యెంతప్రాధేయ పడినా అతను నన్ను గేటు బయటకు వెళ్ళడానికి అంగీకరించలేదు.  తోటి ప్రయాణీకులందరూ నన్ను ఒకదొంగగా భావించి పలు రకములైన వ్యాఖానాలు చేయసాగారు.  అటువంటి ఆపద సమయములో నేను మనసారా శ్రీసాయిని ప్రార్థించి ఈ కష్టమునుండి గట్టెక్కించమని వేడుకున్నాను.  ఆ సమయం లో ఆ టిక్కట్టు కలెక్టరుయొక్క పైఅధికారి అటువైపు వచ్చి నా భుజముపై చెయ్యి వేసి దగ్గిరలో ఉన్న ఫ్రిడ్జ్ లో నించి ఒక గ్లాసు మంచినీరు ఇచ్చి ఈ పెట్టినీది కాదన్న విషయం నాకు తెలుసు.  నీవు ఆందోళన చెందవలదు అని చెప్పి ఆ టిక్కట్టు కలెక్టరుతో ఏదో మాట్లాడి గేటుబయట వరకు వచ్చి నన్ను యింటికి వెళ్ళమని చిరునవ్వుతో చెప్పినాడు.  ఆ క్షణములో నా సాయినాధులవారే ఈటిక్కట్టు కలెక్టరు పై అధికారి రూపములో వచ్చి నన్ను ఆకష్టమునుండి రక్షించి నన్ను ఆశీర్వదించారనే భావనకలిగింది.  నన్ను ఈ విధంగా రక్షించిన ఆ పెద్ద ఆఫీసరు నా సాయి తప్ప మరెవరు?  చేతులు జోడించి సాయికిమనస్పూర్తిగా నమస్కరించాను.
                 
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు









0 comments:
Post a Comment