Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, September 16, 2011

సాయితో సాయి.బా.ని.స. అనుభవాలు - 8

Posted by tyagaraju on 5:25 PM


ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు సాయి బా.ని.స. అనుభవాలలో 8 వ.అనుభవాన్ని తెలుసుకుందాము.

సాయితో సాయి.బా.ని.స. అనుభవాలు - 8

శ్రీ షిరిడీ సాయి సశరీరంతో షిరిడీలో ఉన్న రోజులలో బాబా గారి అనుమతితో షిరిడీ ప్రజలు బయట గ్రామాలకు వెళ్ళేవారుమరియు వారిని దర్శించుకోవడానికి వచ్చినవారు వారి అనుమతి ఆశీర్వచనాలనూ తీసుకున్నతరవాతనే తిరిగి తమస్వగ్రామాలకు వెళ్ళేవారు. అది ఒక నియమంలా ఉండేది. పధ్ధతిని పాటించినవారంతా యెటువంటి కష్టాలూ లేకుండాతమ యాత్రలను పూర్తి చేసుకునేవారు. శ్రీ సాయి ఆదేశాలను పాటించనివారు అనేక కష్టాలను యెదుర్కోవలసి వచ్చేది. విషయాలన్ని శ్రీ సాయి సచ్చరిత్రలో విపులీకరంగా చెప్పబడింది. 1992 లో బాబాగారి ఆదేశానికి వ్యతిరేకముగా నేనుకొనసాగించిన ప్రయాణము వివరాలు మీకు తెలియపర్చదలచుకున్నాను.

అది 1992 సంవత్సరము ఏప్రిల్ నెల. నాభార్య బలవంతము వలన నంద్యాల పట్టణములో ఉన్న నాకు కాబోయేఅల్లుడి గురించిన వివరాలు సేకరించడానికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాను. అప్పటికే వివాహము నిశ్చయముఅవడం వల్ల అలాచేయడం భావ్యం కాదనుకున్నాను. కాని నా భార్య వెళ్ళితీరవలసిందే అని పట్టు పట్టింది. సందిగ్ధావస్తలో నాకు సలహాను ఇమ్మని శ్రీ సాయిని ప్రార్థించి కళ్ళుమూసుకుని శ్రీ సాయి సచ్చరిత్రలో ఒక పేజీ తెరిచాను. అది 9 అధ్యాయములో 84 పేజీ. అందులోని సందేశము "పల్లె విడిచి బయటకు పోవలదు “. సందేశముద్వారాబాబా నన్ను నంద్యాల పట్టణానికి వెళ్ళవద్దని ఆదేశించుచున్నారని గ్రహించాను. కాని నా భార్య బలవంతం మీద నాకాబోయే అల్లుడి వివరాలు తెలుసుకొనుటకు రాత్రి నంద్యాల పట్టణమునకు బయలుదేరాను. మరుసటి ఉదయమునాడు (మహాశివరాత్రి పర్వదినము ) నా అల్లుడుగారి యింటికి వెళ్ళాను. ముందుగా తెలియపరచకుండా హటాత్తుగా వారియింటికి చేరుకోవటము వారికి కొంచెం ఇబ్బంది కలిగించింది. నేను మహానందిలో మహాశివరాత్రి పుణ్యదినమునపూజలు చేయించడానికి మహానందికి వెడుతూ అతనిని చూడటానికి వచ్చినానని అబధ్ధము చెప్పినాను. ఆయనఆరోజున తన స్నేహితులతో కలిసి అహోబిలం వెళ్ళడానికి నిశ్చయించుకుని నన్ను కూడా వారితో కలిసి రమ్మనిచెప్పినారు. నేను వారి ఆహ్వానానికి అంగీకరించి వారితోను వారి స్నేహితులతోను కలిసి అహోబిలము చేరుకున్నాను. అహోబిలములో శ్రీ నరసిం హస్వామికి పూజలు పూర్తి చేసుకుని మధ్యాహ్న్నము 12 గంటల తరువాత బస్సు స్టాండ్ కువచ్చినాము. సాయంత్రము 4 గంటల వరకు తిరుగు ప్రయాణానికి బస్సులు లేవని తెలుసుకుని అందరమూ 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామానికి కాలినడకన బయలుదేరాము. మండుటెండలో నేనునడవలేకపోవుచున్నాను. బాగా అలసిపోయి నిస్సత్తువగా ఉన్నాను. తాగడానికి మంచినీరు లేదు. సేదతీర్చుకుందుకూ చెట్లకు ఆకులు లేక నీడ కూడా లేదు. మార్గము గుండా పోవుతున్న చిన్న వాహనములవారుఎవ్వరూ మాకు సహాయము చేయడాని తమ వాహనాలను ఆపలేదు. నాకు కాబోయే అల్లుడు అతని మిత్రులువడివడిగా ముందుకు నడవసాగారు. నేను మండుటెండలో నడవలేక రోడ్డుకు అడ్డముగా నిలబడి శ్రీసాయినామమును జపింప సాగినాను. నా అదృష్టము వశాత్తు ఒక లారీ నా ముందు ఆగినది. నేను కనులు తెరిచి లారీ వైపు చూసినాను. లారీపై శ్రీ షిరిడీ సాయినాధులవారి అభయహస్తముతో ఉన్నపటము మరియు శ్రీ షిరిడీసాయి లారీ సర్వీసు

అనే అక్షరములు చూసి తన్మయత్వములో కళ్ళు తిరిగి రోడ్డు మీద పడిపోయినాను. నా కాబోయేఅల్లుడు వారి మిత్రులు లారీ డ్రైవరు అందరూ కలిసి నన్ను లారీలో పరుండబెట్టినారు. లారీ డ్రైవరు మమ్ములనిదగ్గరలో ఉన్న గ్రామములో చేర్చినాడు. లారీ డ్రైవరు నన్ను దగ్గిరలో ఉన్న హోటలుకు తీసుకుని వెళ్ళి తాగడానికి ఒకసోడా కొని పెట్టి తన చేతి సంచీనుండి ఒక గజ నిమ్మపండు ఇచ్చి నా చేత నిమ్మరసము తాగించాడు. లారీ డ్రైవరుమమ్మలని అక్కడ వదలిపెట్టి వెడుతూ అన్నమాటలు " ఇక మీదట నీగురువు మాటలను పెడచెవిని పెట్టి యిటువంటికష్టాలను కొని తెచ్చుకోవద్దు." మాటలకు నేను నిశ్చేష్టుడినయ్యాను. సాక్షాత్తూ శ్రీ సాయినాధులవారే లారీ డ్రైవరురూపములో వచ్చి నన్ను కాపాడినారని తలచి వారికి నా రెండు చేతులతో నమస్కరించి కృతజ్ఞతలుతెలియచేసుకున్నాను.


సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు



Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List