30.07.2012 సోమవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
చాలా రోజుల తరువాత మరల మీకందరికీ బాబావారి అనుభవాలను అందిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు పేరు చెప్పడానికి యిష్ట పడని ఒక భక్తురాలి గాధను చదువుకుందాము.
కొన్ని సంవత్సరాల క్రితం నేనెప్పటినుంచో కలలు కంటున్న ప్రముఖ ఐ .బీ .ఎమ్ .కంపనీలో ఉద్యోగంలో చేరాను. కాని, దీనికి ముందు నేను నాభర్తతో కలిసి వేరే రాష్ట్రంలో ఉన్నాను కాని కొన్ని ఆర్థిక సమస్యల వల్ల ఐ .బీ .ఎమ్ లో చేరడానికి నేను వేరే రాష్ట్రానికి వెళ్ళవససివచ్చింది. ఎంతో ఆనందంగా ఐ .బీ .ఎమ్ కంపనీలో చేరాను ఐ .బీ .ఎమ్ లో నాకు అప్పగించిన ప్రాజెక్ట్ కొత్తది. ఐ .బీ .ఎమ్ కంపనీ నిజంగా చాలా బ్న్రహ్మాండమైన కంపినీ. కానీ వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన మా లేడీ టీం లేడర్ వల్ల నాకు కఠినమైన సంస్యలు తలెత్తాయి. ప్రవేశించిన మొదటి రోజునుంచే ట్రైనింగ్ లో నామీద అరవడం మొదలుపెట్టింది. ఒక బాధ్యత గల ఉద్యోగినిగా అది తగనిది. సంవత్సరము న్నరపాడు ఆమె నన్ను చాలా బాధపెట్టింది. లోలోపల ఎంతో దుఖించాను. ఎటువంటి కారణమ్ లేకుండా నామీద అలా ఎందుకు అరుస్తోందో చెప్పమని అన్నీ వివరించడం మొదలు పెట్టాను. ఆమెకు కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆకారణం చేత ఆమె నన్ను, నేను బాగా పనిచేస్తున్నా కూడా నన్ను మానసికంగా చాలా బాధపెడుతూ ఉండేది. నాఉద్యోగ బాధ్యతలలో నేను చూపే ప్రతిభ తారాస్థాయిలో ఉండటం వల్ల నాకు ప్రశంసలు కూడా లభించాయి. నా ఆత్మ గౌరవాన్ని చంపుకోవడానికి యిష్టం లేక నాకు ఆత్మహత్య చేసుకోవాలనిపించేది. కాని, ఒక విధంగా ఆలోచిస్తే నేను ఉద్యోగానికి కూడా రాజీనామా చేయలేని పరిస్థితి. నేనెంతగానో ప్రేమిచే నాభర్త ఎప్పటినుం చో కలలు కంటున్న కొత్త యిల్లు కొనుక్కోవాలనె కల నిజమయే పరిస్థితి. యింకొక విధంగా ప్రస్తుతం నేను పని చేస్తున్న కంపనీలో ఒక సంవత్సరం పూర్తి కాకూండా మరొక కంపనీలో చేరడానికి వీలులేని పరిస్థితి. నేను చాలా సున్నితమైన మనస్కురాలిని కావడమ్ వల్ల ఎవరినీ కూడా నొప్ప్పించలేను. ఎవరితోనూ కఠినంగా మాట్లాడలేను. యితరులతో నేను చాలా దయగానూ సున్నితంగాను ప్రవర్తిస్తాను. ప్రతి రాత్రీ , పగలూ నాకు ఏడవటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. మరొక దారి లేని పరిస్థితిలో కొట్టుమిట్టడుతూ ఉన్నాను. సంవత్సరం న్నరపాటు నేనెంతగానో క్షోభ అనుభవికంచాను. కంపనీ ద్వారాను,. ఎల్ ఐ. సీ ద్వారాను యిన్సూరెన్స్ పాలసీలు ఉన్నందు వల్ల కొన్ని సార్లు ఆత్య్మ హత్యకు కూడా ప్రయత్నించాను. వచ్చే సొమ్ము నాభర్త యిల్ల్లు కొనుక్కోవడానికైనా పనికి వస్తుందనే ఉద్దేశ్యం.
చాలా సార్లు బాబా ముందు రోదిస్తూ ఉండేదానిని. కాని, ఆయన నా మొఱ ఆలకించలేదు. ఈలోపులో మా టీం లీడరు మూడు నెలలు ప్రసూతి సెలవులో వెళ్ళింది. టీంలో ఉన్నవారందరూ ఎంతో సంతోషించారు. అందరికీ కూడా ఆమె అంటే అయిష్టం అని తరువాత తెలిసింది. నేను ఆమె ప్రక్కనే కూర్చుండటంవల్ల నేనే ఆమె వల్ల ఎక్కువగా బాధపడ్డాను.
ఆమె మనస్తత్వం అటువంటిది కాబట్టి నేనామెని నిందించలేను. అదే సమయంలో ఎవరూ కూడా ఎదటివారి మనోభావాలని గా యపరచకూడదు. పరిస్థితులను లెక్కచేయకుండా నేను చాలా ఎక్కువ కష్టపడి పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నాను. కాని, పనిచేసే చోట యిబ్బంది విషయానికి వస్తే ఉద్యోగస్తుల సమస్యలని ఐ.బీ.ఎం పరిష్కరించలేకపోయేది. యిందులో మానేజర్ పాత్ర ఏమీ లేకపోవడంతో ఆసమస్యలు అలా ఉంటూనే ఉన్నాయి. అది నిజంగా చాలా హింస.
నా భర్త ఎప్పుడు తనున్న చోటికి తరచూ ప్రయాణం చేస్తూ ఉండేవారు.అందుచేత నేను ఒంటరిగా ఉండవలసి వచ్చేది . ఒక రోజు రాత్రి అనుభవాలతో ఉన్న బాబాగారి వెబ్ సైట్ చూడటం తటస్థించింది. అపుడు 9 గురువారాల వ్రతం గురించి తెలిసింది . యిందులో తమ తమ అనుభవాలను ప్రచురించిన వారిందరికీ నేనెంతో కృతజ్ఞురాలిని. ఐ.బీ.ఎం.లో నేను సంవత్సరం పైగా పనిచేశాను. నౌకరీ.డాట్ కాం లో నేను నా రెజ్యూం ని పంపించడం ప్రారంభించాను. పరిస్తితుల ప్రాబల్యం వల్ల నేను బాబామీద ఆశ వదలుకున్నాను. కాని యింకా బాబామీద ఒక్క ఆశవుంది.
జీవితంలో నాకు నమ్మకం పోయింది . ఒంటరితనాన్ని అనుభవించాను. నావ్యక్తిగత జీవితంలో కూడా ఒకామే వల్ల యిదేవిధమయిన హింసను ఎదుర్కొన్నాను. యింట్లో నాకు నిద్ర పట్టేదికాదు. ఆఫీసులో కూడా అదే పరిస్థితి. మనుషులంటేనే నాకు భయం ఏర్పడిపోయింది. నిద్రలో మధ్యలో లేస్తూ ఉండేదానిని. దానివల్ల మానసికంగా చాలా బలహీనపడ్డాను. వ్రతం చేయడానికి ప్రయత్నించాను. కాని దురదృష్టవశాత్తు ఒకామే నన్ను యింటివద్ద వ్రతం చేసుకోవడానికి ఒప్పుకోలేదు. ఆమెకు నేను అడ్డుచెప్పలేకపోయాను . ప్రతిసారి బాబా నాఓర్పుని పరీక్షిస్తున్నారు. . ప్రతీసారి నేనింతగానో ఏదిచేదానిని. కాని ఒక గురువారమునాడు
నేను ఉపవాసము ఉండి మొదటి గురువారం తరువాత రెండవ గురువారం పూర్తిచేశాను. నాస్వస్థలానికి ట్రాన్స్ ఫర్ కి మామేనేజర్ నుంచి అనుమతి లబించింది. నేను నాభర్త కలిసి ఉండవచ్చు. యిదంతా బాబా దయవల్లనే జరిగిందని నాభర్తకు చెప్పాను. ఆయన నమ్మలేదు. కాని చాలా సంతోషించారు. రెండవ గురువారం తరువాత నంబర్ వన్ అమెరికన్ కంపెనీనుంచి నాకు ఆఫర్ లెటర్ వచ్చింది. అది చాలా మంచి కంపెనీ. జీతం కూడా ఎక్కువగానే ఉంటుంది. నాసంతోషాన్ని మాటలలో వివరించలేను. ఆకంపెనీ కూడా నాభర్త స్వస్థ్లంలోనే ఉంది. నేను ఆశించినదానికంటే వారు ఎక్కువ ప్యాకేజీ, జీతం కాక యింకా ఎక్కువ లాభా లు కూడా ఉన్నాయి. మేము యింటికోసం తీసుకున్న అప్పు తీర్చడానికి దోహదపడుతుంది. యింకా నేను నాభర్త వద్దే తను పని చేస్తున్న చోటే ఉండచ్చు. నేను చాలా సంతోషంగా 9 గురువారాల వ్రతం పూర్తి చేసి బాబాను దర్శించుకున్నాను. మావారికి కూడా బాబా అంటే చాలా యిష్టం. బాబా సద్గురువు. ఆయనని నమ్ముకుంటే మనం ఆశించినదానికన్నా ఎక్కువ ప్రసాదిస్త్రారు. మనం యింకొకరి మనోభావాలని గాయపరచకుండా ఉండటానికి ప్రయత్నించాలి.
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment