31.07.2012 మంగళవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు సాయి భక్తురాలు సునీల గారి బాబా అనుభవాలను తెలుసుకుందాము.
ఆపదలో ఆపద్భాందవుడు - బాబా
మొదటి సారి షిరిడి దర్శనం
1994 లో మొదటి సారిగ మేము షిరిడి ని దర్శించాలనుకున్నాము.1994 డిశంబర్ 24 న మేము కెకె.ఎక్స్ ప్రెస్ ట్రెయిన్ కి రిజర్వేషన్ చేయించుకున్నాము.కాని దురదృష్టవశాత్తు నాకు విపరీతంగ వీపు నొప్పి మొదలయింది. నేను బెడ్ మీదే కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది.కొన్ని అడుగులు కూడా వేయలేక పోయేదాన్ని. మేము షిరిడి కి రిజర్వేషన్ చేయించుకున్న ట్రెయిన్ టికెట్స్ క్యాన్సల్ చేసుకోవాల్సివచ్చింది. అప్పటికి బాబా నుండి మాకు షిరిడి కి పిలుపు రాలేదు. అనేక రకాల మెడిసన్స్ తీసుకుంటూ రెండు నెలలు ట్రీట్మెంట్ తీసుకున్నాను. మేము అప్పుడు రోహిని లో వుండే వాళ్ళము.రోహిని లో ప్రతి గురువారము బాబా గుడి కి వెళ్ళేవాళ్ళము. షిరిడి కి వెళ్ళాలని మేము ఎంతో ఆశతో వున్నాము.
మేము శివరాత్రికి షిరిడి కి వెళ్ళాలని నిర్ణయించుకున్నాము.దానిప్రకారం ట్రెయిన్ టికెట్స్ షిరిడికి (మన్మాడ్ ) రిజర్వేషన్ చేయించుకున్నాము. మాకు రెండు టికెట్స్ మాత్రమే రిజర్వేషన్ కి దొరికాయి. ఒకటి నాకు, మరొకటి మా అమ్మాయి కి (కాలేజీలో చదువుతోంది). మూడవ టికెట్ వెయిటింగ్ లిస్ట్ లో వుంది. రైల్వే హెడ్ క్వార్టర్స్ వాళ్ళు ప్రయత్నం చేసినా కూడా మూడవ టికెట్ కన్ ఫర్మ్ కాలేదు. మా అబ్బాయి, డ్రైవర్, మా వారిని ఆఫీసు నుండి కారు లో ఎక్కించుకొని వచ్చి మమ్మల్ని స్టేషన్ లో వదిలి పెట్టడానికి వచ్చారు.మేము వెళ్ళే ట్రెయిన్ న్యూ ఢిల్లీ స్టేషన్ నుండి రాత్రి 9.15 గంటలకు బయలుదేరుతుంది . స్టేషన్ కి చేరుకోవడానికి ఒక కిలో మీటర్ వుంది అనగా పహర్గంజ్ దగ్గర రాత్రి 8.45 గంటలకు మా కారు చెడిపోయింది. కారు అస్సలు స్టార్ట్ అవ్వలేదు. మా అబ్బాయి , మా వారు, డ్రైవర్ ముగ్గురు మూడు దిక్కులకు మెకానిక్ కోసం వెళ్ళారు. అప్పుడు రాత్రి 9 గంటలు అయింది .మా అమ్మాయి , నేను కారు లో కూర్చొని వున్నాము. మా అమ్మాయి ఈ సారి ఏమైన సమస్య వచ్చి షిరిడి కి వెళ్ళలేకపొతే ఇక ఎప్పుడు షిరిడి కి వెళ్ళము అని చెప్పింది. ఇంతకు ముందు కూడ చాలా సార్లు షిరిడి కి వెళ్ళాలని ఎంత ప్రయత్నించిన టికెట్స్ దొరకక వెళ్ళ లేకపోయాము. నేను , మా అమ్మాయి స్టేషన్ కి వెళ్ళడానికి రిక్షా లో ఎక్కి కూర్చున్నాము. అప్పుడు గూని తో వున్న ఒక ముసలాయన (ఆయనని చూస్తే చెత్త పోగుచేసుకునే వ్యక్తిలాగ వున్నారు) వచ్చి కారు రిపేరు చేస్తానని చెప్పాడు. మా ఆయన నీవేమి రిపేరు చేయగలవని గొణిగి, ఆఖరికి సరే ప్రయత్నించమని అన్నారు.
ఆ ముసలాయన బోనెట్ ని ఓపన్ చేసి ఇంజన్ ని తాకాడు. కారు స్టార్ట్ అయ్యింది. మా ఆయన ఆ పని చేసినందుకు ఆ ముసలాయనకి 20 రుపాయలు ఇచ్చారు. నేను,మా అమ్మాయి రిక్షా లో స్టేషన్ చేరాము. మా ఆయన, అబ్బాయి, డ్రైవర్ ముగ్గురు కారు లో స్టేషన్ కి వచ్చారు.ఆశ్చర్యంగ నేను స్టేషన్ బయటి నుండి ప్లాట్ ఫారం వరకు దాదాపు 300 మీటర్లు నడవగలిగాను. మేము ట్రెయిన్ లో కూర్చున్నాము. ఆ ముసలాయన శ్రీ సాయిబాబా తప్ప మరెవరూ కాదని మాకర్ధమయింది. నేను, మా అమ్మాయి మా బెర్త్ లో కూర్చున్నాము. కాని మా ఆయనకు బెర్త్ లేదు. ట్రెయిన్ బయలుదేరింది. మా కంపార్ట్ మెంట్ లో ఒక బెర్త్ ఖాళీ గా వుంది. రెండు స్టేషన్స్ వరకు ఆ బెర్త్ లోకి ఎవ్వరు రాలేదు. అందువలన మా ఆయన ఆ బెర్త్ లొ కూర్చున్నారు. ఆశ్చర్యంగ మా ప్రయాణము చివరి వరకు ఆ బెర్త్ లోకి ఎవ్వరు రాలేదు. మా ఆయన కూడ ప్రశాంతంగా ప్రయాణము చేయగలిగారు. ఇది అంతా బాబా దయ వలనే జరిగింది.
మరుసటి రోజు సాయంత్రము ఎటువంటి ఇబ్బందులు లేకుండ మేము షిరిడి చేరుకోగలిగాము.మొదటగా మేము బాబా సమాధి మందిరము ను దర్శించాము.అప్పుడు ఎక్కువ రష్ లేదు. అప్పట్లో సమాధి మందిరము, మందిరము చుట్టు ఇప్పుడు వున్న విధంగ ఎటువంటి కట్టడాలు లేవు అప్పుడు విజిటర్స్ కోసం వెయిటింగ్ హాల్ , స్పెషల్ దర్శనం కోసం స్పెషల్ లైన్స్ వుండేవి కావు. మరుసటి రోజు మధ్యాహ్నం ట్రెయిన్ కి షిరిడి నుండి బయలుదేరేముందు బాబా దర్శనం మరొక సారి చేసుకుందాం అనుకున్నాము.
మరుసటి రోజు ఉదయం దర్శనం కోసం వచ్చినపుడు చాలా రద్దీగా ఉండటంతో మేము ఆశ్చర్యపోయాము. ఆ రోజు శివరాత్రి కావడం వలన చాలా మంది వచ్చ్హారు. దర్శనం కోసం వచ్చిన భక్తులు క్యూ లైన్ లో ఖండోబా గుడి దాటి లెండిబాగ్ నుండి, మెయిన్ రోడ్ లో వున్న షాప్ లు, బజార్లు , బస్ స్టాండ్ వరకు క్యూ లైన్ లో వున్నారు. మేము ఆ క్యూ లైన్ లో వున్నాము. కాని మాకు బాబా దర్శనం అవుతుందని నమ్మకం లేదు. ఎందుకంటే క్యూ లైన్ నిదానంగా ముందుకు కదులుతోంది. మేము ట్రెయిన్ కి సరైన సమయానికి చేరుకోవాలంటే షిరిడి నుండి మధ్యాహ్నం 1.30 కి బయలుదేరాలి . మేము కనీసం మధ్యాహ్నం 1 గంట కల్ల లెండి బాగ్ ని దాట గలిగితే సమాధి మందిరం దర్శనం చేసుకోగలుగుతాం . లేకపోతే క్యూ లైన్ నుండి వెనక్కివచ్చేద్దాం అనుకున్నాం. మేము లెండి బాగ్ ని దాట లేకపోయాము.అందువలన క్యూ లైన్ నుండి వచ్చేద్దాం అనుకున్నాము. నంద దీపం దగ్గర మేము క్యూ నుండి అస్సలు బయటికి రాలేకపోయాము. చుట్టూ జనం ఎక్కువ వుండడం తో చిక్కుకుపోయి క్యూ లైన్ నుండి బయటికి రాలేకపోయాము. నంద దీపం దగ్గర కొంతమంది ఆడవాళ్ళు పూజ చేసుకుంటున్నారు . వాళ్ళు మాకు చాల పండ్లు ఇచ్చి ఎవరికైన పెళ్ళి అయిన ఆడవాళ్ళకు ఇమ్మని చెప్పారు. మేము క్యూ లైన్ నుండి ఎప్పటికప్పుడు బయట పడాలని చూశాము. కాని ఎప్పుడు ప్రయత్నించిన బయటికి రాలేక ఇంకా ముందుకు నెట్ట బడ్డాము. ఇలా జరుగుతుండగానే మాకు తెలియకుండానే సమాధి మందిరం గేట్ దగ్గరికి వచ్చాము. ఆఖరికి ఇక్కడ కూడా క్యూ నుండి బయటకు రావాలని చూశాము. కాని మమ్మల్ని సెక్యూరిటి గార్డ్ వాళ్ళు సమాధి మందిరం గేట్ లోపలికి తోసేసారు. అదంతా బాబాగారి ప్రేరణతోనే జరిగింది. ఒకప్రక్క మాకు శివరాత్రికి సాయిబాబా దర్శనం చేసుకోవాలని వున్నామరొకప్రక్క మన్మాడ్ లో మేము వెళ్ళాల్సిన రైలు ఎక్కడ తప్పి పోతుందోనని భయం వేసింది. మాకు సమాధి మందిరం లో బాబా దర్శనం చాలా బాగా జరిగింది. ఆ సంతోషం లో నాకు ఆనంద భాష్పాలు వచ్చాయి. ఆ అనుభూతి చాల గొప్పగా వున్నది.అంతా బాబా గారి దయ.
మేము మన్మాడ్ కి ట్రెయిన్ కి అందుకోవాలని ఆత్రంగా బయలుదేరాము.ఎటువంటి ఇబ్బంది లేకుండా మన్మాడ్ కి వెళ్ళడానికి సరైన సమయం లో వాహనాలు కూడా రెడీగ వున్నాయి. అంతా బాబా గారే ఏర్ప్పాటు చేసినట్లు బాగా జరిగింది. మేము సరైన సమయానికి వెళ్ళి రైలు అందుకోగలిగాము.అప్పటి నుండి దాదాపు ప్రతి సంవత్సరం బాబా దర్శనం చేసుకుంటున్నాము.
రెండవ అనుభవం:
ఢిల్లీలో ఒకసారి నేను కాళీమార్గ్ వద్దనున్న కాళీకాదేవి గుడినుంచి లోకల్ బస్సులో తిరిగి వస్తున్నాను. నేను దిగవలసిన బస్ స్టాప్ దగ్గర్లో వస్తుందనగా , నేను నా సీట్ నుండి లేచి బస్ ముందరుండే ఎగ్జిట్ గేట్ దగ్గరికి వచ్చాను. బస్ డ్రైవర్ బ్రేక్ సడన్ వేయడం వలన పెద్ద కుదుపు వచ్చేసరికి బస్ లో అందరు పెద్దగ అరిచారు. ఆ కుదుపుకు నేను బస్ మెట్ల మీదకి తోయబడ్డాను. నేను బస్ నుండి క్రిందకి పడిపోతానేమో అని, పెద్ద యాక్సిడెంట్ జరుగుతుందని ఎంతో భయపడి "బాబా"అని పెద్దగా అరిచాను . మరుక్షణం నేను బస్ చివరి మెట్టు మీద కూర్చొని ఉన్నానని తెలిసింది. ఏదో దైవ శక్తి నన్ను తీసుకొని పోయి చివరి మెట్టు మీద కూర్చోబెట్టినట్టు వుంది .చిత్రంగ నాకు ఒక్క గాటు కూడ పడ లేదు. సాయిబాబా నన్ను రక్షించారు.
మూడవ అనుభవం:
2010 వ సంవత్సరంలో ఢిల్లీ లో కరోల్ బాగ్ లో షాపింగ్ చేసేటప్పుడు ఎగుడుదిగుడు గా వున్న రోడ్ లో ఒక చోట కాలు పడి కింద పడ్డాను. నాశరీరం మొత్తం బరువంతా కూడా నామణికట్టుమీద, మోకాలుమీద పడింది. నా మోకాలికి దెబ్బ తగిలి రక్తం వచ్చింది. కుడి చేతికి చాలా చోట్ల గాట్లు పడ్డాయి. నేను నొప్పి భరించలేక ఏడుస్తున్నాను. అప్పుడు నా వయస్సు 62 సంవత్సరాలు . ఆ వయసులో సామాన్యంగ ఆస్టియోపొరోసిస్ (అంటే బోలు ఎముక వ్యాధి లేదా ముసలి తనంలో ఎముక మెత్త బడుట)వల్ల ఎముకలు బలహీనంగ వుంటాయి. నేను క్రింద బడటం వలన బహుశ నా ఎముకలు విరిగాయోమో అని చాల భయపడ్డాను.నేను ఆర్థొపెడిక్(ఎముకల డాక్టర్) దగ్గరికి వెళ్ళాను.నాకు ఇంజెక్షన్స్ ఇచ్చారు. ఎక్స్ రే తీసారు.ఏమి ఫ్ర్యాక్చర్ కాలేదని చెప్పారు. మోకాలు, చేతి వ్రేళ్ళు ఉబ్బాయి . ఆ వాపు మీద కట్టు(డ్రెస్సింగ్ చేసారు)కట్టారు.దెబ్బలు తగ్గాయి కాని నొప్పి ,కొన్ని చోట్ల చేతి మీద వాపు తగ్గలేదు. నొప్పి చేతికి మొత్తం పాకుతూ వచ్చింది.నేను చాలా మంది మంచి ఆర్థోపెడిక్స్ ని కలిశాను. వాళ్ళు నా చేతి యొక్క కార్టిలేజ్ దెబ్బ తినింది అని చెప్పారు. సహజంగా నేను అలోపతి మందులను వాడను. అవి నా శరీరానికి సరిపడవు. ఇది ఆర్ధరైటిస్ (కీళ్ళ వాపు)మొదటి స్టేజ్ లో ఉంది అని నాకు చెప్పారు. దీనికి నేను వాడే హోమియోపతి లో మందు లేదు అని చెప్పారు. నేను ఎంతో మంది ర్యూమటాలజిస్ట్ లను (కీళ్ళ మరియు వాటి కండర వ్యాధుల నిపుణుడు) కలిసాను. కాని వాళ్ళు నాకు రాసిచ్చిన మందులు ఏమి నాశరీరానికి పడవు. నాకు ఎసిడిటి , శ్వాస తీసుకోవడం లో ఇబ్బందులు, ఎప్పుడు వాంతికి వచ్చేటట్టు ఉండేది . అందువలన అలోపతి ట్రీట్మెంట్ మానివేయాల్సివచ్చింది. నొప్పి ఏమీ తగ్గడం లేదు. ఇంకా అంతా వ్యాపిస్తూ వచ్చింది.నాకు చాలా భాధ గా ఉండేది. ఎప్పుడు ఏడుస్తు ఉండేదాన్ని. మంచి హోమియోపతి డాక్టర్ దొరికేలా చేయమని బాబా ని ప్రార్థించాను. చివరగా బాబా దయ వలన ఒక మంచి హోమియోపతి డాక్టర్ దొరికారు. ఆయన ఈ ఆర్ధరైటిస్ మొదటి స్టేజ్ లోనే తగ్గించగలను అని చెప్పారు. కొన్ని నెలలు ఆయన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాక , ఆ డాక్టర్ ఇచ్చిన మందులు పని చేయడం మొదలుపెట్టడం గమనించాను. కొంచెం ఊరట కలిగింది. దాదాపు ఒక సంవత్సరం ట్రీట్మెంట్ తర్వాత నా చేతులకు కొంచెం శక్తి ,పటుత్వం వచ్చాయి. మంచి హోమియోపతి డాక్టర్ ని కలుసుకొనేలా చేసి నాఆర్ధరైటిస్ ని తగ్గించినందుకు బాబా మీకు శతకోటి ధన్యవాదాలు.
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment