08.08.2012 బుధవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శిఖరాలు - లోయలలో శ్రీసాయి (రెండవభాగము) - 02
11. ఓటమిలో గెలుపును, గెలుపులో ఓటమిని చవి చూడటానికి వీలుగా శ్రీరామనవమి రోజున కుస్తీ పోటీలను ఏర్పాటు చేసినాను.
- 09.04.95
12. ఈప్రాపంచిక సుఖాలు పొందటానికి ఎవడి కాళ్ళు అయిన పట్టుకోవటానికి వెనకాడడు, ఈ మానవుడు. నీకు కావలసిన సుఖ శాంతులు భగవంతుని పాదాలు పట్టుకొంటే వస్తాయి అని నేను గట్టిగా చెప్పినా వినడే ఎవడూ, ఎంతటి వెర్రివాళ్ళు ఈమానవులు.
- 11.04.95
13. ధనవంతుని ద్వేషించకు - బీదవానిని అవమానించకు. ధనవంతుని యింట జన్మించటము - బీదవాని యింట జన్మించటము అనేవి పూర్వజన్మలో చేసుకొన్న కర్మఫలము మీద ఆధార పడియున్నది. నీకు కర్మ సిధ్ధాతము మీద నమ్మకము ఉన్ననాడు రాబోయే జన్మగురించి జాగ్రత్తపడు.
- 15.05.95
14. పాత స్నేహితులతో మాట్లాడటము అంటే జీవితములో పాత భవనాలును చూసి వాటిలో నివసించినవారి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవటము మాత్రమే. ఆభవనాలు నేడు నివసించటానికి ఉపయోగపడవు అని గుర్తుంచుకో.
15. యింటి యజమాని తన కుటుంబ సభ్యులను అందరిని ప్రేమతో పోషించగలడు. కాని ఆకుటుంబ సభ్యులలో అసూయ, ద్వేషాలు తలెత్తినపుడు వారు యింటియజమానిపై విశ్వాసాన్ని చూపలేరు. యిది అనాదిగా ఉన్న విషయమే. దీని గురించి ఎక్కువగా ఆలోచించనవసరము లేదు.
- 02.06.95
16. భగవంతుని నమ్మండి అని "నమ్మకము" అనే యిటుకలు తయారు చేసి నాభక్తులకు ఇస్తూ ఆశిరిడీ మట్టిలో కలసిపోయినాను. నేను ఆశిరిడీ మట్టిలో ఉన్నాను అనే నమ్మకము నీలో యుంటే శిరిడీకి వచ్చి ఆమట్టితో నీవే "నమ్మకము" అనే యిటుకలు తయారు చేసుకొని భగవంతుని దయకు పాత్రుడివు అగు.
17. శరీరానికి అనారోగ్యము కలిగినపుడు, దెబ్బలు తగిలినపుడు భరింపరాని బాధ కలుగుతుంది. ఆనొప్పి, బాధ, శరీరానికి మాత్రమే పరిమితమైనది. అటువంటపుడు ఆత్మ శరీరాన్ని ఓదార్చి ఆబాధను మరిచేలాగ చేయాలి. ఎలాగ అంటే నీఒడిలో అనారోగ్యముతో బాధపడుతున్న పసిపాపను నీవు ఓదార్చినట్లుగా శరీరాన్ని ఓదార్చి బాధను మరిచేలాగ చేయాలి.
- 17.10.95
18. నీవు శరీరానికి చక్కని వస్త్రధారణ చేసిన సుగంధ లేపనాలు పూసిన ఆశరీరము సంతోషించదు. అలాగే ఆవస్త్రాలను తీసివేసిన, సుగంధ లేపనాలు తుడిచి వేసిన ఆశరీరము విచారించదు. సంతోషము, విచారము అనేవి నీమనసుకు పరిమితమైనవి. నీమనసుకు నిజమైన సుఖ, సంతోషాలు, వివేక వైరాగ్యాలు తెలుసుకోవాలి అనేకోరిక ఉంటే నాదగ్గరకు రా. నేను తెలియ చేస్తాను.
- 17.10.95
19. కొంతమంది తమ యోగసాధనతో తమ శరీరాన్ని మంచులోనూ ఉంచగలరు, అగ్నిలోను ఉంచగలరు. కాని జ్ఞాని అనేవాడు తన శరీరాన్ని భగవంతుని సేవకే పరిమితము చేసి నిజమైన యోగి అనిపించుకొంటాడు.
- 17.10.95
20. బీదవాడిలాగ వేషధారణ చేసి గొప్ప గొప్ప భవనాలలో సర్వ సుఖాలు అనుభవించేవాడు, భగవంతుని సేవకులము అని చెబుతూ సర్వ సుఖాలు అనుభభవించేవాడు - యిద్దరు ఒక జాతికి చెదినవారే. వారినుండి దూరంగా యుండు.
- 17.10.95
(యింకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment