Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Thursday, August 9, 2012

శిఖరాలు - లోయలలో శ్రీసాయి (రెండవభాగము) - 3

Posted by tyagaraju on 9:18 AM

                                           
                              

09.08.2012  గురువారము

ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శిఖరాలు - లోయలలో శ్రీసాయి (రెండవభాగము) - 3

21.  నీవు సంపాదించిన ఆస్థి పాస్తులను చూసి దొంగలు వాటిని దోచుకొని నీమనసుకు కష్ఠాన్ని కలిగించుతారు. నీవు సంపాదించిన ఆధ్యాత్మిక సంపదను చూసి భగవంతుడు నీమనసును దోచుకొని నీమనసుకు సుఖాన్ని కలిగించుతాడు. 

     - 31.10.95

22.  భార్యతో వైవాహిక జీవితము శరీరములోని చక్కెరవంటిది.  పరస్త్రీ వ్యామోహము వైవాహిక జీవితములో శరీరానికి వచ్చిన చక్కెర వ్యాధివంటిది. ఆచక్కెర వ్యాధిని కొనితెచ్చుకొని నీఆరోగ్యాన్ని ఎందుకు పాడుచేసుకొంటావు.                                    

      Diabetes : Diabetes Just Ahead Green Road Sign with Dramatic Clouds, Sun Rays and Sky.

23.  నీవు భగవంతుని అనుగ్రహము అనే మజ్జిగ త్రాగిననాడు, ఆమజ్జిగ రుచిని పదిమందికి చెప్పి, వారు కూడ భగవంతుని అనుగ్రహము అనే మజ్జిగ పొందేలాగ చూడాలి, అంతే గాని నీవు పొందిన ఆభగవంతుని అనుగ్రహము అనే మజ్జిగలో నీరు పోసి జనాలకు అమ్మరాదు. 

     - 22.11.95

24.  నాతత్వాన్ని తియ్యటి భాషలో చెప్పటము అంటే తియ్యటి నీరు ఉన్నబావిలోని చేపలకు చెప్పటమువంటిది.  నాతత్వాన్ని పామర భాషలో చెప్పటము అంటే సముద్రములోని చేపలకు చెప్పటమువంటిది.   

     - 27.11.95

25.  నీవు తలచే పామాణికాలు అనబడే శాస్త్రాలు, వేదాలు, ఉపనిషత్ లు స్వచ్చమైన నదీజలాలు, ఆఖరికి ఆనదీ జలాలు సాయిసాగరము అనే ఉప్పునీటి సముద్రములో కలవవససినదే.  సాయిసాగరములో జీవించుతూ ప్రామాణికాలు కోసము వెతకటములో అర్ధము లేదు.

     - 27.11.95

26.  ఈప్రాపంచిక విషయాలలో నీయజమాని సంతోషించుతాడు అనే ఆలోచనలతో అతని పిల్లలను నీవు ముద్దు చేస్తున్నావే! మరి నాయజమాని (భగవంతుడు) పిల్లలను (అనాధ పిల్లలను) నీవు ముద్దు చేసిననాడు నేను సంతోషించుతానే -

     - 23.07.95

27.  ధనవంతుల వెనుక వారి వంతపాడటము మాని భగవంతుని ముందు నీపాట నీవు పాడు. 
                                              

     - 28.07.95

28.  ధనగర్వముతో చెడు ఆలోచనలు గల పురుషునికి సౌందర్యగర్వముతో చెడు ఆలోచనలుగల స్త్రీకి నీవు దూరముగా యుండు.  

     - 30.08.95

29.  నేను ధులియా కోర్టు వ్యవహారములో చెప్పిన విషయాలు మాత్రమే నీకు తెలుసు.  నేను వెనకటి జన్మలో నాయజమాని శ్రీకృష్ణుని యింటిలో పురోహితుడుగా (గర్గముని) పని చేసినాను.  

                                             


     - 05.09.95

30.  భగవంతుడు ఈసృష్టిలో ముందుగా ఆత్మను సృష్టించినాడు.  ఆ ఆత్మ సంఖ్య పెరగదు, తరగదు.  ఆ ఆత్మ శరీరాన్న్ని వదలిన తర్వాత తనకోరిక ప్రకారము నూతన శరీరములో చేరుతుంది.  అందుచేత ఈసృష్టికి అంతములేదు.   

     -  05.09.95

(యింకా ఉంది)

సర్వం శ్రీసాయినాధార్పణమస్తు.

Kindly Bookmark and Share it:

1 comments:

Baba's Boutique! on August 9, 2012 at 10:17 AM said...

Omsairam
Baba bless all your devotional efforts!
Omsairam

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List