Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, August 25, 2012

శిఖరాలు - లోయలలో శ్రీసాయి (రెండవభాగము) - 12

Posted by tyagaraju on 7:20 AM


                                               

25.08.2012  శనివారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శిఖరాలు - లోయలలో శ్రీసాయి (రెండవభాగము) - 12

111.  ప్రకృతిలో స్త్రీపురుషుల కలయికను
- జనన మరణాలను సమదృష్టితో చూడాలి అంతే గాని వివాహము తర్వాత జననము అయితే సంతోషపడటము, మరణము సంభవించితే విచారించటము మంచి పధ్ధతి కాదుజనన మరణాలను ప్రకృతి ధర్మముగా పరిగణించాలి.   

      - 02.10.1993

112.  పరిపూర్ణ జీవితము గడిపిన వ్యక్తి చావు భోజిలోని (వైకుంఠ సమారాధన భోజనము) ప్రసాదము భగవంతుని పేరిట యివ్వబడే ప్రసాదముకంటే గొప్పది అనే విషయము మర్చిపోవద్దు.

      - 02.10.1993

113.  సంసార సాగరములో మానసిక జ్వరముతో బాధపడేవాళ్ళను శారీరిక జ్వరముతో బాధపడే వాళ్ళను ప్రశాంతముగా ఈతకొట్టనిచ్చి వాళ్ళను గట్టు ఎక్కించే బాధ్యత నాది

      - 02.11.93

114.  చక్కెరవాధి ఉన్న రోగి డాక్టర్ చెప్పిన మాట ప్రకారము మిఠాయి తినరాదురొట్టెను మాత్రమే తినాలికాని ఆరోగి రొట్టెమధ్య మిఠాయిని పెట్టుకొని ఎవరు చూడటములేదని మిఠాయిని తింటే ఎవరికి నష్టము.  
అలాగే సద్గురువు చెప్పిన మాటలు వింటూ దానికి వ్యతిరేకముగా తనపని తాను చేసుకొనిపోతే ఎవరికి కష్ఠము ఆలోచించు.   

      - 05.11.93

115.  నీపూర్వీకులు అందరు చనిపోయినారువాళ్ళను ఈరాతిబండమీద దహనము చేసినారుఆఖరికి ఆరాతి బండకూడా వేడికి పగిలిపోయినదియింకా ఆరాతి బండమీదనే నీవాళ్ళను దహనము చేసినారు అనే విచారము దేనికి - మరచిపో.  

      - 18.11.93

116.  నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి సహాయము చేయటానికి వెళ్ళినపుడు ముందు వాళ్ళు నీరాకకు భయపడటము సహజముఅటువంటి భయానికి కూడా తావు యివ్వకుండ ఎవరికి తెలియని విధముగా నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి సహాయము చేసి వారిని మర్చిపో.

      - 20.11.93

117.  భగవంతుని ఏవిధముగా పూజించినా ఫరవాలేదుపూజ తర్వాత భగవంతుని అనుగ్రహము సంపాదించాలి కాని అప్పులవాళ్ళ బాధను మాత్రము కాదు.

      - 30.11.93

118.  మనిషి జీవితము నాగుపాము జీవితమువంటిదిఅహంకారము అనే కుబుసాన్ని వదలిపెట్టి ఈశ్వరుని మెడలో హారముగా మారాలి.

      - 06.01.94

119.  ఆత్మ లింగము పేరిట స్పటికలింగాలు ప్రదర్శించటము ఒక గారడీ విద్య.  

ఆత్మకు స్వరూపములేదుఆత్మలింగము ప్రశ్నేలేదు

      - 11.03.94

120.  ఈజగత్తులో ప్రాణము నిలుపుకోవటానికి ముఖ్యమైనది నీరు.  
అదే జీవశక్తికి మూలాధారముఅదే పరమేశ్వరుడు ప్రసాదించిన జీవశక్తి.

      - 11.03.94

(యింకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు



Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List