Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, August 11, 2012

శిఖరాలు - లోయలలో శ్రీసాయి (రెండవభాగము) - 4

Posted by tyagaraju on 9:39 PM
 



                            



 12.08.2012  ఆదివారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శిఖరాలు - లోయలలో శ్రీసాయి (రెండవభాగము) - 4
31.  ఆధ్యాత్మిక జీవితములో సాక్ష్యాలు - ఆధారాలు ఉండవు.  అనుభవాలు, అనుభూతులు మాత్రమే యుంటాయి.  

     - 05.09.95

32.  నీవు ప్రాపంచిక రంగములో నీఆస్థిని, సంపాదనను భీమా చేసి నిశ్చింతగా యుంటావే, మరి ఆధ్యాత్మిక రంగములో నీవు సంపాదించినది నాదగ్గర భీమా చేయి.  నేను నీ ఆత్మను పరమాత్మ దగ్గరకు చేర్చుతాను.    

     - 31.10.95

33.  ఆనాడు అరిషడ్ వర్గాలు అనే హేమమాలిని "వాలి" తన మెడలో ధరించి పతనము చెందినాడు నీవు నీలోని అరిషడ్ వర్గాలును విడనాడి "భగవంతుని" మెడలోని వైజయంతిమాలగా మారిపో.

     - 02.11.95

34.  నీవు నీజీవితములో కష్టాలబాటలో ప్రయాణము సాగించుతున్నపుడు సాయి సత్ చరిత్ర అనే పసిపాపను నీఒడిలో ఉంచుకో. 
 
 ఆపాప చిరునవ్వు నీకష్టాల బాధను మరిపింప చేస్తుంది.  ఆచిరునవ్వు నీకు మానసిక, శారీరిక శక్తిని ప్రసాదించి కష్టాలను దాటించుతుంది.

     - 14.12.95

35.  నీవు నీశత్రువుని శిక్షించటానికి ధనవంతుల సహాయము, స్త్రీల సహాయము కోరవద్దు.  నీశత్రువునుండి నీవు దూరముగా యుంటు వారిని మరచిపోవటము నీశత్రువుకి తగిన శిక్ష. 

     - 27.15.95

36. నీగుమ్మములోనికి ధనవంతులు దాహముతో వచ్చిన నీవు ఈర్ష్య, ద్వేషాలులేకుండ వారికి చల్లని మంచినీరు యివ్వగలిగిన నీవే నిజమైన ధనవంతుడివి. 

     - 29.12.95

37. నీజీవితములో అరిషడ్ వర్గాలతో జీవించటము అనారోగ్యమునకు మూలము.  ఆమూలాన్ని విడనాడటము ప్రశాంత జీవితానికి ఆరంభము. 

     - 30.12.95

38. మరణము నీనీడలాగ నిన్ను వెంటాడుతూ  ఉంటుంది. నీనీడనుండి నీవు ఎంత దూరము పారిపోగలవు.  అందుచేత నీనీడను చూసి (మరణాన్ని) భయపడకు. 

     - 02.01.96

39.  నీయింట దొంగలు పడితే పోలీసులకు ఫిర్యాదు చేసుకొంటావు.  మరి నీమనసులో మమతలు, మమకారాలు అనే దొంగలు పడితే ఎవరితో ఫిర్యాదు చేసుకోవాలి అనే విషయము ఆలోచించు. 

     - 11.01.96

40.  మోక్షసాధనలో నీవు నీస్వధర్మము మీదనే ఆధారపడు.  స్వధర్మము బావిలోని నీరువంటిది. పరధర్మము ఎండమావులువంటివి.  ఎండమావుల వెనుక పరిగెత్తటములో అర్ధము లేదు. 

     -13.01.96


(యింకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List