17.12.2012 శుక్రవారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శిఖరాలు - లోయలలో శ్రీసాయి(రెండవభాగము) - 6
47. పిల్లలు పుట్టలేదనిపసి పిల్లలనుతెచ్చి పెంచుకొంటారుకొందరు. ఆపసిపిల్లలుతమ పిల్లలుకారుకదా అనేఆలోచనలతో ఆపెంపుడు తల్లిదండ్రులు,
తమ పిల్లలుఎలాగ పెరుగుతున్నారుఅనే ఆలోచనలతోకన్న తల్లిదండ్రులు,
ఆలోచనా తరంగాలలోబాధపడుతూ ఉంటారు. అందుచేత భగవంతుడుప్రసాదించిన
జీవితాన్ని అర్ధము చేసుకొని తలనొప్పిలేనిజీవితాన్ని గడపాలి తల్లితండ్రులు.
- 01.09.96
48. క్రీ.శ.1918 నాటికే సినీమాల ప్రభావము సమాజముపై పడినది. ఆనాటిసినీమాలు నేటి (1996) సమాజములో నైతిక విలువలుపాడవటానికి పునాదిరాళ్ళుగా మిగిలినవి.
- 08.09.96
49. క్రీ.శ.1918ముందు తల్లిదండ్రులుపిల్లల భవిష్యత్గురించి ఎక్కువగాఆలోచించేవారు కాదు. వారికి భగవంతునిపైచాలా నమ్మకముయుండేది. భగవంతుడువారి పిల్లలనుచక్కగా తీర్చిదిద్ది చక్కనిభవిష్యత్ ను ప్రసాదించేవాడు.
- 08.09.96
50. నాపై నీకునమ్మకము కలగటానికినేను నీగతించినజీవిత చరిత్రనునీకు చెబుతాను. దానితోనీకు నాపై నమ్మకముకలిగి భవిష్యత్లో నేనుచూపే మంచిమార్గములో నీవు ప్రయాణము చేస్తావు.
- 15.09.96
51. సాయి పేరిటఎంతసేపు భజనచేసినాము అనేది ముఖ్యము కాదు. సాయి పేరుతో ఏవిధముగా జీవించుతున్నాము అనేది ముఖ్యము.
- 28.09.96
52. ప్రాపంచిక రంగములోనిప్రయాణము ఆఖరులో కాలికి అంటుకొన్న బురదనుకడుగుతాము. ఆధ్యాత్మికరంగములోని ప్రయాణము మొదటిలో మనసుకు అంటుకొన్నబురదను కడుగుతాము.
- 28.09.96
53. నీగత జీవితఅనుభవాలను పునాదిరాళ్ళుగా చేసుకొనిఈవర్తమానంలో చక్కటి మేడను నిర్మించు. అందు ప్రశాంతముగా జీవించుతు మంచి భవిష్యను ఆశించు.
- 10.10.96
54. నీవు జితేంద్రునిదగ్గర నమ్మకముగాపని చేసినరోజున వేరేగాఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోనవసరములేదు.
- 11.10.96
55. దొంగలు నీయింటినిదోచుకుంటారు. బందుమిత్రులునీశరీర కష్టాన్నిదోచుకుంటారు.
నీభార్యపిల్లలు నీమనసునుదోచుకుంటారు.
రోగాలు నీశరీరాన్ని దోచుకొంటాయి.
యిక మిగిలినది నీఆత్మ.
నీఆత్మగురించి తెలుసుకోవటముఅంటే నిన్నునీవు తెలుసుకోవటం.
- 05.10.96
(యింకాఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment