18.08.2012 శనివారము
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి
శిఖరాలు - లోయలలో శ్రీసాయి
(రెండవభాగము) - 7
56. నీకు ఆకలి వేసినపుడు
నీదగ్గర ఉన్న
ధనాన్ని ఖర్చు
చేసి భోజనము
చేస్తున్నావే - అపుడు నీకు తెలియలేదు ఆ
అన్నము పెట్టినవాని
కులము.
ఎవరో ప్రేమతో నిన్ను భోజనానికి పిలిచినపుడు
ఆపిలిచినవాని కులము, మతము గురించి ఆలోచించుతున్నావే,
యిది ఎక్కడి
న్యాయము.
- 14.10.96
57. భగవంతుడు నీకు సహాయము
చేయదలచినపుడు మానవ రూపములో గాని,
జంతురూపములో
గాని నీదగ్గరకు
రాక తప్పదు.
భగవంతుని
రాకను నీవు
గుర్తించిననాడు నీవు చాలా అదృష్టవంతుడివి. అటువంటి
అదృష్టము నూటికి, కోటికి ఒకరికి లభించుతుంది.
- 11.11.96
58. నీకు అపకారము చేసినవారిని
నీవు దూషించటము
మానివేసిన రోజున
నేను నీకు ఉపకారము
చేయటానికి ఏదో ఒక రూపములో వస్తాను. నీజీవితములో
నీకు సుఖశాంతులు
ప్రసాదించుతాను.
- 12.11.96
59. డబ్బు వ్యవహారాలలో మిత్రులు,
బంధువులు, శత్రువులుగా మారే అవకాశముయున్నది. అందుచేత
డబ్బు వ్యవహారాలు
ఆచరణలో పెట్టేముందు
ఒకటి రెండుసార్లు
ఆలోచించాలి. హడావిడి
పనికిరాదు.
- 27.11.96
60. చదువు తెలివితేటలు ఉండికూడా
భగవంతుని మరచిపోయి వ్యసనాలకు బానిసలుగామారి జీవిత
నౌకను కష్టాలకడలిలో
నడిపించుతారు కొందరు. చదువు తెలివితేటలు
లేకపోయినా సద్గురుని నమ్ముకొని తమ జీవిత
నౌకని సుఖసంతోషాలతో
ఆనంద సాగరములో
నడిపించుతారు మరికొందరు.
- 13.11.96
61. సంసారము సాగించటానికి
ధన సంపాదన
ముఖ్యమే, అలాగ అని బాధ్యతలు విస్మరించి,
ధన సంపాదన
కోసమే జీవించితే,
ఆధన సంపాదనకు
అర్ధము లేదు. అందుచేత
నీబరువు బాధ్యతలను
పూర్తి చేయటానికి
కావలసిన ధనము
సంపాదించి బాధ్యతాయుతమైన జీవితము గడపాలి.
- 22.11.96
62. ఇతరుల ఆధ్యాత్మిక రంగ
ప్రయాణములో నీవు సలహా మాతమే యివ్వాలి. అంతేగాని
వారితో కలసి
ప్రయాణము చేయటానికి ప్రయత్నించటము
తలనొప్పి కొని తెచ్చుకోవటములాంటిది.
- 27.11.96
63. నీ పుట్టినరోజు
పండుగరోజున విష్ణుసహస్రనామ పారాయణ గావించు.
నీకు.
నీపితృదేవతల ఆశీర్వాదాలు లబించును.
- 28.11.96
64. సంసార సాగరములో
జీవితనౌక ఒడిదుడుకుల మధ్య ప్రయాణము సాగిస్తుంటే,
అనౌక మీద
విష్ణుసహస్రనామము అనే జండా
ఎగరవేయి. అపుడు
ఆ జీవితనౌక
ప్రశాంతముగా ఆసాగరములో ప్రయాణము సాగించుతుంది.
- 28.11.96
65. ప్రకృతిలో ఉన్న
శక్తిని మానవుడు
విద్యుత్ శక్తిగా మార్చి ప్రాపంచిక సుఖాలు
పొందుతున్నాడు.
అదే మానవుడు ప్రకృతిలో
ఉన్న ఆధ్యాత్మిక
శక్తి (భగవంతుని
శక్తి) ని
గుర్తించలేక కష్టాలు, అశాంతి పొందుతున్నాడు.
- 01.12.96
(యింకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment