Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Sunday, August 19, 2012

శిఖరాలు - లోయలలో శ్రీసాయి (రెండవభాగము) - 8

Posted by tyagaraju on 8:26 AM
  



                                                                   
19.08.2012  ఆదివారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శిఖరాలు - లోయలలో శ్రీసాయి (రెండవభాగము) - 8

66.  నీకు యిష్టములేని వ్యక్తులను నీవు నీయింటికి పిలిచి వారికి అమర్యాద చేసేకంటే నీవే వారినుండి దూరముగా యుండటము మేలు.

     - 09.11.96

67.  గృహస్థాశ్రమములో దైవ భక్తి ముఖ్యము.  దానికంటే చాలా ముఖ్యమైనది, ఈర్ష్యాద్వేషాలను విడనాడటము.  అపుడే గృహస్థ ఆశ్రమములో ప్రశాంతత లభించుతుంది.

     - 07.12.96 

68.  నీవు యవ్వనములో యుండగా నీశరీరము అందము చూసుకొని మురిసిపోయినావు.  ఈనాడు వృధ్ధాప్యములో నీశరీరము జామిపండులాగ యున్నది అని మురిసిపోతున్నావు.  

మరి ఆజామిపండు నేలమీద రాలిపోయినపుడు అందు పురుగులు చేరుతాయి అనే విషయము గుర్తుకు వచ్చినదా! ఆలోచించు.    

     - 15.12.96 


69.  చెడుసహవాసాలును ప్రోత్సహించే వారితో స్నేహము చేయుటకన్నా  మంచి మార్గములో ప్రయాణము సాగించుతున్నవారి పాదాల క్రిందపడి నలిగి మరణించటము మిన్న. 



     - 15.01.97

70.  నీస్నేహితులు, బంధువులు నీనుండి నీసుఖశాంతులను దోచుకోగలరు. కాని, నీకున్న భగవంతుని అనుగ్రహాన్ని దోచుకోలేరు.  ఆనుగ్రహముతో నీవు ప్రశాంతముగా జీవించగలవు.   

     - 24.01.97

71.  పరుల సొమ్ముపై ఆశ వదిలించుకోవాలి అంటే నీవు కష్టపడి సంపాదించిన ధనాన్ని ముందుగా దాన ధర్మాలుకు వినియోగించాలి.  

     - 29.01.97

72.  నావిగ్రహానికి పూజలు చేసేకంటే, మానసికముగా నానామము ఉచ్చరించుతూ, నాలీలలను జ్ఞాపకం చేసుకొంటూ  నాదగ్గరకు వచ్చేవారే నాకు యిష్ఠులు.   



     - 20.03.97

73.  ఎక్కడ అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నా వాటిని బయట పెట్టేది నేనే. ఆటువంటిపనులు చేసేవారిని శిక్షించేది నేనే.  అందుచేత నీకు అన్యాయము, నీపై అక్రమము జరుగుతున్న సమయములో నన్ను తలచుకో.  నేను ఏదో ఒకరూపములో ప్రత్యక్షమై నీకు సహాయము చేస్తాను, సలహాను యిస్తాను.  

     - 29.03.97  


74.  ఈప్రాపంచిక రంగములో శరీరము ప్రాపంచిక సుఖాలు అనుభవించటానికి మాత్రమే ఉపయోగపడి ఆఖరికి మట్టిలో కలసిపోతుంది.  ఆధ్యాత్మిక రంగములోని ఆధ్యాత్మిక సుఖాలను అనుభవించేది నీఆత్మ.  ఆత్మకు నాశనములేదు.  అటువంటి నాశనములేని ఆత్మ గురించి తెలుసుకోవటము మంచిది కదా.
  
     - 01.04.97


75.  పంజరములో బందీ అయిన చిలుక తన యజమాని యిచ్చిన ఫలాలు తిని జీవించుతున్నది.  

శరీరములో బందీ అయిన ఆత్మ తన యజమాని (భగవంతుడు) కి యిష్టమైన నవవిధ భక్తి అనే ఫలాలు తిని జీవించుతున్నది.


     - 10.04.97 


(యింకా ఉంది)
సెర్వం శ్రీసాయినాధార్పణమస్తు 






Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List