20.02.2013 బుధవారము
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంచువులకు బాబావారి శుభాశీస్సులు
సాయిబంధులకు ముఖ్య గమనిక. రేపు అనగా 21.02.2013 భీష్మ ఏకాదశి. దక్షిణ కాశీగా పేరు పొందిన అంతర్వేది పుణ్య క్షేత్రంలో శ్రీలక్ష్మీ నరసిం హస్వామివారి కల్యాణ మహోత్సవం ఈ రోజు రాత్రి జరుగుతుంది. రేపు అందరూ కూడా శ్రీవిష్ణు సహస్రనామం పఠించి ఆయన కృపకు పాత్రులు కండి.
ఓం సాయిరాం
శ్రీ విష్ణు సహస్ర నామం 37వ.శ్లోకం, తాత్పర్యం
శ్లోకం: అశోకస్తారణస్తారః శూరశ్శౌరిర్జనేశ్వరః
అనుకూలశ్శతావర్తః పద్మీపద్మనిభేక్షణః ||
తాత్పర్యం: భగవంతుని దుఃఖమునకతీతునిగా, మాయను తరింపచేయువానిగా, తారయై మార్గము నిర్దేశించువానిగా, సూర్యునిగా, వాని యందలి శౌర్యముగా, యితరులతో అనుకూలించువానిగా, మరియూ అందరిని తన చుట్టూ వంద సుడులై ఆకర్షించువానిగా, నాభియందు పద్మము గలవానిగా మరియూ పద్మదళములవంటి కన్నులు కలవానిగా, ధ్యానము చేయుము.
ఈ రోజు అద్భుతమైన బాబావారి కఫ్నీ గురించి తెలుసుకుందాము. దీనిగురించిన ఆసక్తికరమైన కధ www.shirdisaitrust.org నుండి గ్రహింపబడినది.
బాబావారి కఫ్నీ కధ ::
బాబావారు తన కఫ్నీ చిరిగిపోయి జీర్ణమయిపోయ్నప్పుడెల్లా, దానిని యితరులకెవరికైనా యిచ్చివేసే బదులు, దానిని ధునిలో కాల్చి బూడిద చేసేవారు. దానిని ధునిలో కాల్చడానికి అది పాతబడిపోవాల్సినంతగా ఉండేదికాదు, కాల్చవలసినంత అవసరమూ ఉండేది కాదు.
ఒక్కొక్కసారి ఆయన కఫ్నీలను కొద్ది కాలమే ధరించినప్పటికీ వాటిని కాల్చి బూడిద చేసేవారు. ఒకోసారి ఆయన వాటిని కుట్టుకొని బాగు చేసుకొని ధరిస్తూ ఉండేవారు. సాయిబాబా గారి దుస్తులు చిరుగులు పట్టినపుడు, తాత్యా పాటిల్ వాటిని తన వేళ్ళతో యింకా చింపివేసేవాడు.
సాయిబాబా ఏభక్తుడినయినా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి తీసుకొని వెళ్ళాలని భావించినపుడు, ఆ అదృష్టవంతునికి బాబావారి దుస్తులు ప్రసాదంగా లభించేవి. బాబా వారి దుస్తులలో అపారమయిన శక్తి నిండి ఉంది. ఒక సారి సాయిబాబా తన కఫ్నీని మహల్సాపతికి బహుమతిగా యిచ్చారు. దానియొక్క ఫలితం ఏమిటంటే, మహల్సాపతి తాను మరణించేవరకూ సన్యాసిలా జీవించాడు. అయినా కాని తన కుటుంబ బాధ్యతలను సమాజంతో బంధాలను తెంచుకోలేదు.
మరొక సంఘటనలో సాయిబాబా తన కఫ్నీని ముక్తారాం అనే భక్తునికిచ్చారు. కఫ్నీ బాగా మాసిపోయి ఉండటం వల్ల ముక్తారాం దానిని ఉతికి వాడ (ధర్మశాల) లో ఆరబెట్టాడు. తరువాత ముక్తారాం బాబా దర్శనానికి వెళ్ళాడు. కాకా సాహెబ్ దీక్షిత్ వాడాలో కఫ్నీ ఆరబెట్టిన చోట వామనరావు ఉన్నాడు.
కఫ్నీలోనించి ఈ విధంగా మాటలు వినిపంచాయి "చూడు, ముక్తారాం నన్నిక్కడకు తీసుకొని వచ్చి, తలకిందులుగా ఆరబెట్టాడు".
వామనరావు వెంటనే కఫ్నీని తీసి తాను ధరించాడు. కఫ్నీని ధరించిన తరువాత వామనరావు ద్వారకామాయికి వెళ్ళాడు.
కఫ్నీని ధరించిన వామనరావుని చూసి సాయిబాబా కోపోద్రిక్తులయారు. కాని వామనరావు సన్యాసం తీసుకొం దామని నిశ్చయించుకొన్నాడు. ఈసంఘటన జరిగిన తరువాత, సమయం వచ్చినపుడు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకొన్నాడు.
15,అక్టోబరు, 1918, మంగళవారమునాడు బాబా వారు సమాధి చెందిన తరువాత బాబావారి పాత గుడ్డ సంచిని తెరచి చూశారు.
ఆ సంచిని బాబా ఎప్పుడు ఎవరినీ ముట్టుకోనిచ్చేవారు కాదు. ఆసంచిలో ఆకుపచ్చ కఫ్నీ, ఆకుపచ్చ టొపీ కనిపించాయి. వాటిని కాశీరాం అనే దర్జీ బాబాకిచ్చాడు.
బాబా వాటిని ధరించారు, కాని తరువాత తెల్లని దుస్తులను ధరించడానికే యిష్టపడ్డారు.
మిగిలిన వస్తువులతో పాటుగా, ఈ సంచి కూడా బాబావారి సమాధి లోపల ఉంచారు.
నేటికీ షిరిడీలోని దీక్షిత్ వాడాలో "సాయిబాబా మ్యూజియం లో" బాబా ధరించిన మరొక కఫ్నీని చూడవచ్చు.
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment