Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Wednesday, December 23, 2015

శ్రీ షిరిడిసాయి వైభవం - నాకు నాఫోటోకి భేదం లేదు

Posted by tyagaraju on 7:42 AM
           
Image result for images of shirdisaibaba
       Image result for images of rose

23.12.2015 బుధవారం
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ షిరిడిసాయి వైభవం - నాకు నాఫోటోకి భేదం లేదు
ఈ రోజు శ్రీషిరిడీ సాయి వైభవంలో మరొక అధ్బుతమైన వైభవం తెలుసుకుందాము.  
శ్రీ సాయి సత్చరిత్ర పారాయణ చేసినవారందరికి గుర్తుండే ఉంటుంది. నాకు నా ఫోటోకి భేదం లేదని బాబా  చెప్పిన విషయం.  ఆయన చెప్పిన విషయం మనమందరం బాగా గుర్తుంచుకొని అవగాహన చేసుకోవాలి.  కారణం చెపుతాను వినండి.  సాయి భక్తులలో కొందరు కలిసి సత్సంగాలు చేసేటప్పుడూ, భజనలు చేసేటప్పుడు బాబా పటం పెట్టి చుట్టూరా కరంటు బల్బులతో (చిన్న చిన్న బల్బులు) దండలా వేస్తూ ఉంటారు.  కొంచెం ఆలోచిద్దాము.  బాబా తన ఫొటోకి తనకి భేదం లేదన్నప్పుడు,  ఫోటొ లో ఉన్న బాబా కూడా సజీవమూర్తే కదా?  మరి అటువంటప్పుడు ఆయన ఫోటో చుట్టూరా కరంటూ బల్బుల దండ వేయడం భావ్యమా?  మన ఇంటికి ఎవరయినా గౌరవమయిన వ్యక్తి వచ్చినప్పుడు గౌరవ సూచకంగా ఆయన  మెడలో కరంటు బల్బుల దండ వేస్తామా?  మనం కూడా వేసుకోము కదా?  అందుచేత బాబా ఫోటో లో ఉన్న బాబా కూడా మనెదురుగా సశరీరంతో ఉన్నట్లుగానే  భావించండి.  ఆయన ఫోటో ఎక్కడ ఉంటే అదే షిరిడీ. ఈ  విషయం కుడా ఆయనే చెప్పారు కదా.   షిరిడీలో ఎక్కడ కొన్నా  అది ఆయన ప్రసాదమే.  అందుచేత ద్వారకామాయిలో లభించే ప్రసాదం స్వల్పమే కావచ్చు.  తోటివారికి పంచడానికి షిరిడీలో ఎక్కడ ఏ షాపులో కొన్నా అది బాబా ప్రసాదమే.  
ఇక చదవండి.  

  శ్రీ షిరిడిసాయి వైభవం
             
Image result for image of small rose
వాసుదేవ్ సదాషివ్ జోషి, అతని స్నేహితుడు చిదంబర్ రావ్ కే. గాడ్గే బాబా ను దర్శించుకోవడానికి షిరిడీ వెళ్ళారువారు సాఠేవాడాలో బస చేసి అక్కడ అక్కడ జరుగుతున్న ఆరతిలో  పాల్గొన్నారుపూర్వపు రోజులలో ఆరతి గురుస్థాన్ లో కూడా జరుగుతూ ఉండేది


ఆరతి జరుగుతూ ఉండగా జోషీ కి బాబా ఫోటొలో బాబాకి బదులు నరసింహ  మూర్తి కనిపించారు. ఆయనకెంతో ఆనందం వేసింది.    విచిత్రంలో కెల్లా విచిత్రం ఏమిటంటే అలా వరుసగా మూడురోజులపాటు జరిగింది.  ఇక వారు షిరిడి నుండి బయలుదేరే రోజున బాబా వారికి ఊదీ, ప్రసాదం ఇచ్చారు.    తమ గ్రామానికి తిరిగి వెళ్ళినపుడు ఆ ప్రసాదం అందరికీ పంచడానికి సరిపోదని భావించారు.  బాబా వారి ఆలోచనలని గ్రహించి వారికి ఎనిమిది అణాలు ఇచ్చి షిరిడీలో ప్రసాదం కొని పంచమని చెప్పారు.  షిరిడీలో ఎక్కడ కొన్నా అది తన ప్రసాదమే అని చెప్పారు.

మరొకసారి వారు షిరిడీ వెళ్ళినపుడు బాబా బర్ఫీని ప్రసాదంగా పంచారు. అది ఎంతో మధురంగా ఉంది.  అందుచేత వారు ఇంకా కొందామనుకొన్నారు.  బాబా వారి ఆలోచనను గ్రహించి మూడు బుట్టలనిండా ప్రసాదం ఉన్నదనీ దానిలోనుండి  మూడు గుప్పిళ్ళనిండా  తీసుకోమని చెప్పారు.  వారు సంతోషంగా బాబా ఊదీ, బర్ఫీ ప్రసాదం తీసుకొని వెళ్ళారు.

        కొద్ది రోజుల తరువాత జోషీ  స్నేహితుడు షిరిడీ వెడుతున్నపుడు, బాబాకి  దక్షీణగా ఇమ్మని పది రూపాయలు ఇచ్చాడుఅంతే కాకుండా మరొక కోరిక కోరాడుఆ కోరిక ఏమిటంటే బాబాని ఫోటో తీసి పట్టుకురమ్మని చెప్పాడు ఫోటో ఇంటిలో పెట్టుకొని శాస్త్రోక్తంగా పూజ చేసుకోవాలని అతని కోరికగార్డే శిరిడీ వెళ్ళి, జోషీ ఇచ్చిన పది రూపాయలు తీసుకొని ద్వారకామాయికి వెళ్ళాడు. బాబా ముందర సాష్టాంగ నమస్కారం చేసి జోషి  ఇచ్చిన పది రూపాయలను దక్షిణ సమర్పించాడుఫోటో తీసుకుంటానని బాబాని అడగడానికి ధైర్యం చాలక మౌనంగా ఉన్నాడుబాబా కూడా చాలాసేపు మౌనంగా ఉన్నారుఇక గాడ్గే వెళ్ళిపోయేముందు బాబా అతనికి తన ఫోటో తీసుకోవడానికి అనుమతి ప్రసాదించారు.  అతని ఆనందానికి అవధులు లేవు.  బాబాని రెండు ఫోటో లు తీసుకున్నాడు.  ఒకటి కూర్చున్న భంగిమ, మరొకటి బాబా నుంచుని ఉండగా, రెండు ఫోటోలు.  ఆ ఫోటోలని లాభార్జన కోసం అమ్మవద్దని చెప్పారు బాబా.  
అపుడు బాబా అతనికి ఊదీ, ప్రసాదం ఇచ్చి వెళ్ళడానికి అనుమతిచ్చారు.

          Image result for images of shirdisaibaba sitting
(బాబా అనుమతితో తీయబడిన ఫొటో )

శ్రీ సాయి సత్చరిత్ర  ౩౩వ. అధ్యాయంలో బాలబువా సుతార్ ప్రస్తావన వస్తుంది.  అతను బొంబాయిలో ప్రసిధ్ధ కీర్తనకారుడు.  ఒకసారి అతను షిరిడి వెళ్ళి బాబా దర్శనం చేసుకొన్నాడు.  బాబా అతనిని చూసి “ఇతనితో  నాకు నాలుగు సంవత్సరాలనుండి పరిచయం” అన్నారు.  బాలబువా చాలా ఆశ్చర్యపోయాడు, కారణం అతను షిరిడీ రావడం ఇదే మొదటి సారి,  అటువంటప్పుడు నాలుగు సంవత్సరాలనుండి బాబాకి తనతో పరిచయం ఎలా సంభవం?  నాలుగు సంవత్సరాలే ఎందుకు?  ఈ ప్రశ్నలు అతనిని చాలా వేధించాయి.  అప్పుడు గుర్తుకు వచ్చింది అతనికి, నాలుగు సంవత్సరాల క్రితం తను బాబా ఫోటోకి నమస్కరించిన సంగతి.  బాబా సర్వజ్ఞతకు ఎంతో ఆశ్చర్యపోయాడు.  బాబాకి నమస్కారం చేయడమంటే ప్రత్యక్షంగా  ఎదురుగా ఉన్న బాబాకి నమస్కరించడమే అనే విషయం అర్ధమయింది.  అది ఒక గుణపాఠంగా కలకాలం గుర్తుంచుకొన్నాడు.

(మరికొన్ని వైభవాలు తరువాతి సంచికలో)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 



Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List