Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Monday, May 30, 2016

శ్రీసాయి పుష్పగిరి – 15వ.భాగమ్

Posted by tyagaraju on 8:33 AM
 Image result for images of shirdisaibaba in flowers
 Image result for images of rose garden
30.05.2016 సోమవారం
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయిబానిస గారిగి బాబా వారు ప్రసాదించిన ఆధ్యాత్మిక సందేశాలు మరికొన్ని
         Image result for images of saibanisa

శ్రీసాయి పుష్పగిరి – 15వ.భాగమ్

26.02.2010
                         Image result for images of asoka chakra pillar

141.  జీవితంలో మనం సాధించింది పదిమందికి ఉపయోగపడాలిమనం వట్టి చేతులతో వచ్చాముతిరిగి వట్టి చేతులతో వెళ్ళిపోతాము  కాని, ఆనాడు అశోకుడు స్థాపించిన ఇనప స్థంభంపై ఉన్న అశోకచక్రము ఈనాడు భారత రాజ్యాంగానికి రాజ చిహ్నంగా నిలిచింది.  
 
17.03.2010

142.  వర్తమానాన్ని విస్మరించకుండా గతము గురించి బాధ పడకుండా భవిష్యత్తుపై ఆశతో నిత్యము పనిచేయినీ ముందు సమస్యలు ఎదురయినపుడు వాటిని అవగాహన చేసుకుని పరిష్కరించడానికి ప్రయత్నించుఅవగాహన లేకుండా సమస్యలను పరిష్కరించడమంటే తేనె తుట్టెను కదపడమవుతుంది.     

05.04.2010

143.  మన జీవిత ప్రయాణంలో మనం ఎవరికీ ఉచిత సలహాలివ్వరాదుకాని ప్రయాణం కొనసాగించేటప్పుడు మనకు తెలియని విషయాలను ఇతరులను అడిగి తెలుసుకుని ముందుకు వెళ్ళాలి.  

03.05.2010

144.  నీవు కష్టాలలో ఉన్నపుడు నీ మిత్రులు నీ నుండి దూరంగా ఉంటారుముఖం చాటు వేస్తారుఇది తెలిసి కూడా నీవు నీ కష్టాల సమయంలో వారిని పలకరించడం నీ తప్పువారు నీకు సహాయం చేయలేదని భావించడం నీలోని మూర్ఖత్వము.  

27.09.2009
                        Image result for image of man quarreling

145.  దుష్టులకు నీవు నీతి బోధ చేసినా అవి వారి మనస్సుకు చేరవుపైగా వారు తమ ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు నీపై దాడి కూడా చేయవచ్చునుఅందుచేత ముందునుండీ దుష్టులకు దూరంగా ఉండు.

01.10.2009
                    Image result for images of woman doing nomu and vratam
146.  తల్లి తన పిల్లవాని ఆరోగ్యం కోసము నోములు వ్రతాలు చేస్తుందిపిల్లవాడు పెద్దయిన తరువాత తల్లి ఋణం తీర్చుకోవాలి.

02.10.2009

147.  ఈరోజుల్లో పిల్లలను కనడానికి పెళ్ళిళ్ళు చేసుకోకుండా సహజీవనం పేరిట అద్దెకు స్త్రీలను, పురుషులను పొందుతున్నారువివాహవ్యవస్థను అపహాస్యం చేస్తున్నారుఇది నాకు చాలా బాధ కలిగించింది.     

07.10.2009


148.  జీవిత ప్రయాణంలో అలసిపోయినప్పుడు మార్గ మధ్యములో కొంత విశ్రాంతి తీసుకుని ముందుకు వెళ్ళాలని నా భక్తునికి చెప్పానుఅతను నా ఇంటి అరుగుమీద కొంతసేపు విశ్రాంతి తీసుకుని తన గమ్యం చేరడానికి ముందుకు నడక ప్రారంభించాడు.   
                 Image result for images of shirdi samadhi mandir


149.  జీవిత ప్రయాణంలో జననమరణాలు, కష్టసుఖాలు ప్రయాణంలో అనుభూతులుగాను అనుభవాలుగాను భావించాలి.


150.  జీవితం ఒక సినిమా రీలులాంటిది రీలును నీవు వెనక్కి తిప్పి చూడలేవురాబోయే దృశ్యాలను కూడా ముందుగా చూడలేవునీవు చూడగలిగింది వర్తమాన సంఘటనల దృశ్యాలు మాత్రమే అని గ్రహించు.  

(మరికొన్ని సందేశాలు ముందు ముందు)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List