28.05.2016
శనివారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయిబానిస
గారికి బాబావారు ప్రసాదించిన మరికొన్ని ఆధ్యాత్మిక సందేశాలు
శ్రీ
సాయి పుష్పగిరి - ఆధ్యాత్మిక జీవితం – 14వ.భాగమ్
11.03.2009
131. స్వార్ధముతో
మ్రగ్గిపోతున్న రోజులివి. తను
బాగుండాలి కాని ఎదుటివాడు నాశనం
కావాలని ఆలోచించే ప్రజల మధ్య జీవించటము
కష్టము. అయినా
తెలివితేటలతో జీవించాలి కలియుగంలో.
15.05.2009
132. నీవుచేసే
ప్రతి పనిని ఏవరో ఒకరు
గమనిస్తూ ఉంటారు అనే విషయం మర్చిపోవద్దు. అందుకే
మంచి పనులు చేసి మంచివాడిగా
పేరు తెచ్చుకో.
24.06.2009
133. జీవితం
ఒక రైలుబండి ప్రయాణంవంటిది. డ్రైవరు
మీద నమ్మకంతో మనం ప్రయాణం కొనసాగిస్తాము. ఆ
డ్రైవరు విధి నిర్వహణలో మనం
కలగజేసుకోము. అలాగే
జీవిత ప్రయాణంలో గురువుపై నమ్మకముంచాలి. ఆయన
పనిలో మనము కలగజేసుకోరాదు.
24.06.2009
134. బీదరికము
అనుభవిస్తున్నా తల్లి తన బిడ్డపై
చూపే ప్రేమ గొప్పది. బీదరికము శాశ్వతము కాదు. ప్రేమ
శాశ్వతము. అందుచేత అనారోగ్యంతో బాధ పడుతున్న బీదవారికి నీవు ధన సహాయం
చేసి వారిని ఆదుకో.
11.08.2009
135. మనం
మాట్లాడుకునే భాష ముఖ్యం కాదు. భావము
ముఖ్యము. అందుచేత
మనుషులు మాట్లాడే భాషకు ప్రాధాన్యత ఇవ్వకు. వారు
ఎప్పుడయినా మంచి భావంతో పలకరిస్తే
వారి భాషలోని భావాన్నే గుర్తుపెట్టుకో. ఆ
భాషను మరచిపో.
136. నీవు
గతంలో నివసించిన ఇళ్ళు కాలగర్భంలో కలసిపోయాయి. ఆ
ఇళ్ల స్థలాలలో కొత్త ఇళ్ళు వచ్చాయి. అటువంటప్పుడు
గతంలో నీకు సంబంధం ఉన్న
ఇళ్ళు, ఆ ఇళ్ళలో నివసించిన
మనుషులు, వస్తువులపై మమకారం ఎందుకు?
12.08.2009
137. నిత్యము
భగవంతుని పూజా కార్యక్రమాలు చేసే
చేతులకన్నా ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టే చేతులు
మిన్న.
25.08.2009
138. వృధ్ధాప్యంలో
భార్యాభర్తలు కలిసి ఉండాలి. ఇద్దరూ
స్నేహితులలాగ మసలుకోవాలి. ఎవరికీ
ఇబ్బందులు కలిగించకుండా జీవితాన్ని కొనసాగించాలి.
09.09.2009
139. పర
మతంలోనివారు కష్టాలలో ఉన్నపుడు మానవత్వం అనే మతాన్ని నీవు
స్వీకరించి వారికి సహాయం చెయ్యి.
16.09.2009
140. ఎవరి
సానుభూతి ఎవరికీ ఉపయోగపడదు. జరగవలసినదంతా
జరిగిన తరువాత తిరిగి నూతన జీవితాన్ని ప్రారంభించు. ఆ
తరవాతనే గత సంఘటనలను సులువుగా
మర్చిపోగలము.
(మరికొన్ని
సందేశాలు ముందు ముందు)
(సర్వం
శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment