27.05.2016
శుక్రవారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ
రోజు మరొక అద్భుతమైన వైభవాన్ని తెలుసుకుందాము.
నేనెక్కడ ఉంటె అదే షిరిడీ, నేను పటంలో కూడా సజీవంగానే ఉంటాను అన్నారు బాబా. నేనెన్నటికీ అసత్యమాడను అన్న బాబా మరి మాట నిలబెట్టుకోకుండా
ఉంటారా? ఆయనని గమనించకపోవడం మన అజ్ఞానం తప్ప
మరేమీ కాదు. ఆయన తత్వాన్ని, బోధలను పూర్తిగా
జీర్ణించుకున్నవాళ్ళకు ఆయన ఏ రూపంలో వచ్చినా గుర్తించడం అసాధ్యం కాదు. ఈ వైభవాన్ని
తయారు చేస్తున్నప్పుడు నాకు ఆయన 6సంవత్సరాల క్రితం చూపించిన లీల కూడా గుర్తుకు వచ్చింది. ఈ రోజు బాబా మన ఇంటికి భోజనానికి వస్తారు అని నా
నోటంబట వచ్చిన మాటకు ఆయన నిజం చేస్తూ రావడమ్ మరపురాని అనుభూతి. దీనిని ఇంతకు ముందు మన బ్లాగులో ప్రచురించాను.
శ్రీ షిరిడీసాయి
వైభవమ్
భోజనానికి
పిలిస్తే రాకుండా ఉంటారా బాబా?
మధ్యప్రదేశ్
రాష్ట్రం దేవాస్ నుండి ఒక భక్తుడు బాబా దర్శనం కోసం షిరిడీ వచ్చాడు. దీక్షిత్ వాడాలో బస చేసి సగుణ మేరు హోటల్ లో భోజనం
చేస్తూ ఉండేవాడు.
బాబా తనతో కలిసి భోజనం చేయాలని అతనికి ఎప్పటినుంచో ఒక కోరిక ఉంది. అందు చేత ప్రతిరోజూ తను భోజనం చేసే ముందు తన ప్రక్కనే బాబా కోసం ఒక పళ్ళెం పెట్టి తయారుగా ఉంచేవాడు. ఆ తరువాత బాబా దగ్గరకి వెళ్ళి తనతోపాటుగా మధ్యాహ్నం, రాత్రి భోజనానికి రమ్మని ఆహ్వానిస్తూ ఉండేవాడు. కాని బాబా ఒక నవ్వు నవ్వి ఊరుకునేవారు. ఒకరోజు రాత్రి 10.30 కి సగుణమేరు హోటల్ ని ఇక మూసి వేస్తూ ఉండగా నాధ్ పంతీ (నాధ సాంప్రదాయాన్ననుసరించే యోగి) హోటల్ లోకి ప్రవేశించి, “నాకోసం పళ్ళెంలో భోజనం తయారుగా ఉంది. దానిని నేను ఆరగించవచ్చా?” అని అడిగాడు. సగుణమేరు వెంటనే ఆయనకు కూర్చోబెట్టి భోజనం వడ్డించాడు. అతను తృప్తిగా భోజనం చేసి, తన కోసం భోజనాన్ని సిధ్ధం చేసి ఉంచిన వ్యక్తిని చూడాలని ఉందని చెప్పాడు. వెంటనే సగుణమేరు దీక్షిత్ వాడాకు వెళ్ళాడు. ఆ భక్తుడిని తనతో తీసుకుని వద్దామనుకుంటె అతను చాలా గాఢనిద్రలో ఉన్నాడు. అతన్ని లేపుదామని ఎంతగానో ప్రయత్నించాడు కాని ఎంతకీ నిద్ర లేవలేదు. హోటల్ కి తిరిగి వచ్చి ఆ అతిధికి జరిగినదంతా చెప్పాడు. “ఆకలితో ఉన్నవారికి ఎప్పుడూ ఇలాగే భోజనం పెడుతూ ఉండమను” అని చెప్పి ఆ అతిధి వెళ్ళిపోయాడు.

మరుసటి
రోజు అందరికీ ఈ విషయం తెలిసింది. అప్పుడూ శ్యామా
బాబాని అడిగాడు, “బాబా! క్రితంరోజు రాత్రి మీరు సగుణమేరు హోటల్ లో భోజనం చేశారా?” “అవును, నిన్న నేను హోటల్ కి వెళ్ళి కడుపునిండా
తృప్తిగా భోజనం చేశాను” అన్నారు బాబా. ఈ సంఘటనని
బట్టి షిరిడీలో కూడా బాబా వేరే రూపాలలో వచ్చి భోజనం చేసేవారన్న విషయం మనం గ్రహించవచ్చు.
“అమ్మా!
ఎప్పటిలాగే ఈ రోజు కుడా బాంద్రా వెళ్ళాను.
కాని నాకు తినడానికి, త్రాగడానికి అన్నం గాని, గంజి కాని, ఏమీ దొరకలేదు. ఆకలితో తిరిగి వచ్చేశాను” శ్రీ సాయి సత్ చరిత్ర
9వ.అధ్యాయంలో శ్రీమతి తర్ఖడ్ తో బాబా అన్న మాటలు.
వివిధ ప్రదేశాలకు బాబా తన భక్తుల ఇండ్లకు తరచూ అతిధిగా వెళ్ళి భోజనం చేస్తూ ఉండేవారు. ఒక్కొక్క సారి ఆయన తన భక్తునికి, తాను భోజనానికి
వస్తానని చెప్పేవారు. ఆవిధంగా చెప్పి ఆయన ఒక
సాధువు రూపంలో గాని, ఫకీరు లేక ఒక అతిధి రూపంలో (ఏప్రాణి రూపంలోనైనా సరే) వెడుతూ ఉండేవారు. ఇక ఆ వచ్చిన అతిధిని గాని, ప్రాణిని గాని, బాబాయే
ఆ రూపంలో వచ్చారన్న విషయం గ్రహించడం భక్తుల వంతు.
బాబా ఆదేశానుసారం ఉపాసనీ ఖండోబా మందిరంలో ఉండేవాడు. ప్రతి రోజు వంట చేసి బాబాకు ప్రసాదంగా సమర్పించడానికి ద్వారకామాయికి తీసుకొని వెడుతూ ఉండేవాడు. ఒక రోజున ఆయన వంట చేస్తూ ఉండగా ఒక నల్లటి కుక్క వచ్చి ఆకలితో అక్కడే సంచరిస్తూ ఆయన చేస్తున్న వంటని గమనించసాగింది.
బాబాకు సమర్పించకుండా, ఆ కుక్కకు అన్నం పెట్టడం శుధ్ధ దండగ అనుకున్నాడు ఉపాసనీ. వండిన పదార్ధాలన్నిటిని బాబాకు నివేదించడానికి ఉపాసనీ ద్వారకామాయికి వెడుతున్నపుడు కొంత దూరం వరకు ఆ కుక్క కూడా అనుసరిస్తూ వచ్చి ఆ తరువాత మాయమయింది.
ద్వారకామాయికి వెళ్ళి బాబాకు నైవేద్యం సమర్పించడానికి పదార్ధాలన్నీ ఆయన ముందుంచాడు. “ఇంత ఎండలో అంత దూరంనించి ఎందుకు వచ్చావు? నిన్ను గమనిస్తూ నేనక్కడే ఉన్నాను కదా! నా ఆకలి తీరుస్తావనే ఉద్దేశ్యంతో అక్కడే ఉన్నాను” అన్న బాబా మాటలకు ఉపాసనీ విస్తుపోయాడు. బాబా ఉపాసనీ తెచ్చిన పదార్ధాలను స్వీకరించలేదు.
మరుసటి
రోజు ఉపాసనీ బాబా కోసం వంట చేస్తూ ఉండగా, అనారోగ్యంతో ఉన్న ఒక కడజాతివాడు వచ్చాడు. అతను అక్కడ గోడకు ఆనుకొని కూర్చొని ఉపాసనీ చేస్తున్న
వంటను గమనించసాగాడు. ఒక బ్రాహ్మణుడు వంట చేస్తూ
ఉండగా అతని చూపు పడితే దిష్టి తగులుతుందని భావించాడు ఉపాసనీ. ఆ భావన రాగానే అతన్ని అక్కడినుండి వెళ్ళిపొమ్మన్నాడు. ఆ వ్యక్తి అక్కడినుండి వెళ్ళిపోయాడు. ఉపాసనీ బాబాకు సమర్పించడానికి వండిన పదార్ధాలన్ని
తీసుకొని వెళ్ళాడు. బాబా ఈసారి కూడా వాటిని
స్వీకరించలేదు. అప్పుడు ఉపాసనీ, బిచ్చగాడి
రూపంలో వచ్చినది మీరేనా బాబా?” అని అడిగాడు. “నేను అందరిలోనూ ఉన్నాను. అంతటా వ్యాపించి ఉన్నాను” అని సమాధానమిచ్చారు బాబా.
(లైఫ్ ఆఫ్ సాయిబాబా – వాల్యూమ్ – 3)
శ్రీసాయి
సత్ చరిత్ర 40వ.అధ్యాయంలో ఉద్యాపన రోజున (వ్రత సమాప్తివేళ) దేవ్ బాబాని తన ఇంటికి భోజనానికి
ఆహ్వానించాడు. బాబా అందుకు సమ్మతించి తాను
మరొక ఇద్దరితో కలిసి వస్తానని చెప్పారు. ఆ
రోజున ఒక సన్యాసి తన ఇద్దరు అనుచరులతో వచ్చి భోజనం చేసాడు. దేవ్ వారిని సాదరంగా ఆహ్వానించి, అతిధి మర్యాదలు
చేసి భోజనం పెట్టాడు కాని బాబాని గుర్తించడంలో విఫలమయ్యాడు. ఆ తరువాత అతను జోగ్ కి ఉత్తరం వ్రాశాడు, “బాబా వస్తానని
చెప్పి ఎందుకని రాలేదు? ఆయన తప్పక వస్తానని
మాటిచ్చారు. బాబా మాట ఎన్నటికీ అబధ్ధం కాదు. ఆయన వచ్చినట్లు నాకెక్కడా ఋజువు కనిపించలేదు. ఎంతో ఆశగా ఎదురు చూశాను” అని ఆ ఉత్తరంలో వ్రాశాడు.
అప్పుడు
బాబా, జోగ్ తో “నన్ను గుర్తించలేనప్పుడు అసలు నన్నెందుకని పిలవాలి? నేను అన్న మాట ప్రకారం మరొక ఇద్దరితో కలిసి వెళ్ళి
తృప్తిగా భోజనం చేసి వచ్చాను. నా భక్తులకిచ్చిన
మాట కోసం నేను నా ప్రాణాలయినా ఇస్తాను. కాని
నా నోటిలోని మాటలు ఎన్నటికీ అబధ్ధం కావని అతనితో చెప్పు” అన్నారు బాబా.
(మరికొన్ని
వైభవాలు ముందు ముందు)
(సర్వం
శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment